ప్రకాశంలో వైఎస్సార్‌సీపీకి దక్కేది ఆ ఒక్క నియోజకవర్గమేనా!
x

ప్రకాశంలో వైఎస్సార్‌సీపీకి దక్కేది ఆ ఒక్క నియోజకవర్గమేనా!

ప్రకాశం జిల్లా రాజకీయాలు ఆసక్తిగా మారాయి. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల్లో గెలిచేది ఒక్కే ఒక్క నియోజకవర్గమట.


ఆంధ్రప్రదశ్‌లోని ప్రకాశం జిల్లాలో ఏ పార్టీ విజయం సాధిస్తుంది? ఏ పార్టీ బలం ఎంత? ఓటర్లు ఏమని భావిస్తున్నారనే అంశంపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మూడు రోజులుగా సొంత వ్యక్తులతో సర్వే చేయించినట్లు విశ్వసనీయ సమాచారం. అభ్యర్థులు ఎందుకు వెనుకబడుతున్నారనే అంశంపైనా సర్వేలో కొన్ని కొత్త విషయాలు వెలుగు చూసినట్లు సమాచారం. ఒక్కో నియోజకవర్గానికి ఒక్కో విధమైన సమస్య ఉంది. అందువల్ల ఖచ్చితంగా ఒకే సమస్యపై అభ్యర్థి ఓడిపోతాడని చెప్పడానికి వీలు లేదు. సమస్యల కంటే రాజకీయ కోణాలే ఓటమికి ఎక్కువ కారణాలు చూపుతున్నాయి.

ఉదాహరణకు గిద్దలూరు నియోజకవర్గాన్ని పరిశీలిస్తే గత ఎన్నికల్లో వైఎస్సార్‌సీసీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించిన అన్నా వెంకట రాంబాబుకు సుమారు 78,916 ఓట్ల మెజారిటీ వచ్చింది. ఇది అసాధరణమైన మెజారిటీగా చెప్పొచ్చు. అయినా రాంబాబుకు అక్కడ 2024లో వైఎస్సార్‌సీపీ టిక్కెట్‌ ఇవ్వలేదు. కేవలం రాజకీయ, కుల పరమైన కారణాల వల్ల టిక్కెట్‌ ఇవ్వలేదని సమాచారం. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన ముత్తుముల అశోక్‌రెడ్డికి గడ్డుకాలమేనని పలువురు భావిస్తున్న తరుణంలో రాంబాబును మార్కాపురానికి మార్చి అక్కడి నుంచి సిటింగ్‌ ఎమ్మెల్యే నాగార్జునరెడ్డిని గిద్దలూరు అభ్యర్థిగా పెట్టారు. ఈ రాజకీయ మార్పులే ఇరువురి ఓటమికి కారణమవుతున్నాయని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.
గిద్దలూరు నియోజకవర్గంలో ఉన్న ఆరు మండలాల్లో నాలుగు మండలాలకు రెడ్డి సామాజిక వర్గం వారు ఎంపీపీలుగా ఉన్నారు. రెండు మండలాలకు బీసీలు ఉన్నారు. రెడ్లు, బీసీ ఎంపీపీలను కలుపుకుని అన్నా రాంబాబు అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించారు. ప్రతి మండల పరిషత్‌ అధ్యక్షుడూ ఆయన అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించడంతో చేసేది లేక అభ్యర్థిని మార్చినట్లు వైఎస్సార్‌సీపీ వర్గాలు అభ్యర్థికి నచ్చజెప్పాయి. పైగా రాంబాబు అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించడం వెనుక ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుమారుడు రాఘవరెడ్డి ఉన్నాడని రాంబాబు చెప్పడంతో పాటు అధికారుల వద్ద తనను పలచన చేసిన రాఘవరెడ్డి వ్యవహారాన్ని దుయ్యబట్టారు. ఒక్క నియోజకవర్గం వ్యవహారం. ఇలా ప్రతి నియోజకవర్గంలోనూ అభ్యర్థుల ఎంపిక విషయంలో వైఎస్సార్‌సీపీ పప్పులో కాలేసిందని పార్టీ వారే చెబుతున్నారు.
సంతనూతలపాడు, కొండపి నియోకవర్గాల్లో మంత్రులు ఆదిమూలపు సురేష్, మేరుగు నాగార్జునలకు కూడా ఎదురు గాలి వీస్తోందని మొదటి నుంచీ పార్టీలోనే చర్చ జరుగుతోంది. కనిగిరి అభ్యర్థి విషయంలోనూ పార్టీ తీసుకున్న నిర్ణయంతోనే ఓటమి జరిగే అవకావం ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఒంగోలు అసెంబ్లీ అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా ఏటికి ఎదురీదుతున్నారని పలువురు స్థానికులు చెబుతున్నారు. నియోజకవర్గంలో కనీస అభివృద్ది లేకపోవడం, మంత్రిగా ఉన్నప్పుడు బాలినేని కుమారుడు ప్రణీత్‌రెడ్డి, వియ్యంకుడు భాస్కర్‌రెడ్డిలు ప్రజల పనుల కంటే వారి సొంత పనులకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం, మంత్రి పేషీలో వీరిద్దరే చక్రం తిప్పడంతో బాలినేనిపై కొందరు పెట్టకున్న ఆశలు సన్నగిల్లాయని పార్టీలోని వారే చర్చించుకోవడం విశషం. నియోకవర్గంలోని ఏ వర్గంలోనూ బాలిననిపై వ్యతిరేకత లేకపోయినా అధికార పార్టీపై ఉన్న వ్యతిరేకత బాలినేనిపై ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. దర్శి నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి డాక్టర్‌ బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, టీ డీపీ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మిలు పోటీ పడుతున్నారు. రెండు పార్టీల వారు ప్రచారాన్ని హోరాహోరీగా సాగిస్తున్నారు. ఇక్కడ ప్రభుత్వ వ్యతిరేకత పనిచేస్తే శివప్రసాద్‌రెడ్డి ఓటమిని సవిచూడాల్సిందే. లేదంటే గెలుపు తెలుగుదేశం పార్టీదే అవుతుందని స్థానికులు చెప్పడం విశేషం.
ఎర్రగొండపాలెంలో టీడీపీ వర్గపోరును ఎదుర్కొంటోంది. ఇది వైఎస్సార్‌సీపీకి ప్లస్‌ అయినట్లు నియోజకవర్గానికి చెందిన పలువురు రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. ఇటీవల పుల్లలచెరువు మండలంలో కొంత మంది వైఎస్సార్‌సీపీ నాయకులు టీడీపీలో చేరారు. అయినా ఆ నియోకవర్గంలో వైఎస్సార్‌సీపీకి బలం తగ్గలేదని, ఎస్సీ రిజర్వుడు కావడం, అభ్యర్థి చంద్రశేఖర్‌ అందరినీ కలుపుకుని వర్గాలు లేకుండా ముందుకు సాగటం వల్ల ఆయనకు సానుకూల వాతావరణం ఏర్పడిందని స్థానికులు చెబుతున్నారు. అంటే ఖచ్చితంగా గెలిచే నియోజకవర్గం ఎర్రగొండపాలెం మంత్రమేనని స్పష్టమవుతోంది.
Read More
Next Story