ఆంధ్ర రాజకీయాలకు రాంగోపాల్ వర్మ రాంరాం..!
x

ఆంధ్ర రాజకీయాలకు రాంగోపాల్ వర్మ రాంరాం..!

సంచలనాలకు, వివాదాలకు మారుపేరుగా అందరికీ సుపరిచితమైన పేరు రామ్‌గోపాల్ వర్మ్. ఆయన ఏం చేసినా వైరలే అవుతుంది. ఆయన ఏం మాట్లాడినా హాట్‌ టాపిక్‌గా మారుతుంది.


సంచలనాలకు, వివాదాలకు మారుపేరుగా అందరికీ సుపరిచితమైన పేరు రామ్‌గోపాల్ వర్మ్. ఆయన ఏం చేసినా వైరలే అవుతుంది. ఆయన ఏం మాట్లాడినా హాట్‌ టాపిక్‌గా మారుతుంది. ఆంధ్ర ఎన్నికల సమయంలో ఈయన టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారారు. అందుకు తాను పిఠాపురంలో పోటీ చేస్తున్నానంటూ జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ప్రకటించిన కొంతసేపటికే తాను కూడా పిఠాపురం బరిలో ఉంటానంటూ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ కాస్తా రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపింది. ఆర్‌జీవీ.. వైసీపీ అమ్ములపొదిలో బాణంటా మారాడని, కానీ ఆ బాణం ఏం చేయలేదంటూ అప్పట్లో జనసైనికులు సెటైర్లు కూడా వేశారు. అయితే ఆ ట్వీట్ పెట్టిన తర్వాత నుంచి ఆర్‌జీవీ పెద్దగా ఆంధ్ర రాజకీయాలపై స్పందించలేదు.

వైసీపీని మించిన ఆర్‌జీవీ

ఆంధ్ర రాజకీయాల విషయంలో ఆర్‌జీవీ సృష్టించిన రచ్చ అంతా ఇంతా కాదు. అప్పట్లో ఎక్కడ చూసినా ఆర్‌జీవీ వ్యాఖ్యలపైనే చర్చలు జరిగాయి. పిఠాపురంలో పోటీ అంటూ చేసిన ట్వీట్ అయితే మరింత దుమారం రేపింది. దానికి తోడుగా వైసీపీకి మద్దతుగా కూటమి పార్టీలు, చంద్రబాబు, లోకేష్, పవన్‌కు వ్యతిరేకంగా ఆయన చేసిన వ్యాఖ్యలు అన్నీఇన్నీ కావు. ఆయన విమర్శలు వైసీపీ నేతలను కూడా మించి ఉన్నాయి. అంత దుమారం రేపిన ఆర్‌జీవీ ఇప్పుడు ఒక్కసారిగా సైలెంట్ అయ్యారు. పోలింగ్ తర్వాత అయితే ఏపీ ఊసు కూడా ఎత్తట్లేదు. దీంతో ఆంధ్ర రాజకీయాల గురించి మాట్లాడటానికి ఆర్‌జీవీ భయపడ్డారా? కూటమి గెలిచేలా ఉండటంతో ఇప్పుడు కదిలిస్తే రేపు అధికారంలోకి వచ్చాక తన భరతం పడతారని హడలిపోయారా? లేకుంటే నాకెందుకులే అనుకున్నారా? అన్న ప్రశ్నలు తీవ్ర చర్చలకు దారితీస్తున్నాయి. తాజాగా దర్శకుల అసోసియేషన్ పేరుతో ఆర్‌జీవీ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ఆ ఫొటోను కూడా సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. అది చూసిన నెటిజన్లు.. రాజకీయాల విషయంలో ఆర్‌జీవీ మారారంటూ పోస్ట్‌లు పెడుతున్నారు.

సినిమాలతో వైసీపీకి మద్దతు

2019 ఎన్నికల ముందు కూడా ఆర్‌జీవీ.. వైసీపీకి మద్దతుగా పనిచేశారు. ఎన్నికలు పూర్తయిన తర్వాత కూడా ఆయన తన మద్దతును కొనసాగించారు. వైసీపీ ప్రత్యర్థి ఎవరైనా పోస్ట్‌లతో విరుచుకుపడేవారు. అందుకోసం వైసీపీ నుంచి కోట్ల రూపాయలు తీసుకునేవారని, వాటిని కూడా తాను తీసే సినిమాలకు పెట్టుబడులు సేకరించినట్లు కలరింగ్‌లు ఇచ్చేవారని అప్పట్లో వార్తలు కూడా గుప్పమన్నాయి. అలా తీసుకున్న డబ్బుతో తీసిని సినిమాలతో కూడా ఆయన వైసీపీకే మద్దతు పలికారని కూడా ప్రచారం జరుగుతోంది. వ్యూహం, శపథం సినిమాలు ఆ కోవలోకే వస్తాయని అంటున్నారు. అదే సమయంలో వైసీపీకి వ్యతిరేకంగా విడుదలైన రాజధాని ఫైల్స్, వివేకంగా సినిమాలు మంచిగా రాణించాయి. ఆ సమయంలో ఆర్‌జీవీతో లాభం కంటే నష్టమే ఎక్కువగా ఉందన్న వాదనలు వైసీపీ వర్గాల నుంచి కూడా వినిపించాయి. అదే సమయంలో ఆర్‌జీవీ కూడా సైలెంట్ అయిపోవడంతో వైసీపీ, ఆర్‌జీవీ మధ్య ఉన్న ఒప్పందం పూర్తయిందా? లేకుంటే వైసీపీనే ఒప్పందాన్ని బ్రేక్ చేసిందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అదే విధంగా ఆర్‌జీవీ భయపడ్డాడంటూ సెటైర్లు పేలుతున్నాయి.

Read More
Next Story