శాంతి భద్రతలు డబ్బుతో ముడిపడి ఉంటాయా?
x

శాంతి భద్రతలు డబ్బుతో ముడిపడి ఉంటాయా?

ఇంతకూ ఏపీ పోలీసు శాఖ ఏమి చెప్పదల్చుకుంది. సీఎంపై రాయి దాడిని ఎలా పరిష్కరించనుంది. నిందితులను పట్టుకోవాలనుకుంటే ప్రజలకు డబ్బు ఆశ చూపించాల్సిందేనా.



శాంతి భద్రతలు డబ్బుతోనే ముడిపడి ఉంటాయని పోలీసులు భావిస్తున్నట్లు ఉన్నారు. ఎందుకీ మాట అనాల్సి వస్తుందంటే.. విజయవాడ నగరంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై రాళ్లతో దాడికి పాల్పడిన వారి ఆచూతికి తెలిపిన వారికి రూ. 2లక్షలు నగదు బహుమతి ఇస్తామని ఎన్టీర్‌ జిల్లా పోలీసు కమిషనగర్‌ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. డిసిపి కంచి శ్రీనివాసరావు ఫోన్‌ నంబరు 9490619342, ఆర్‌ శ్రీహరిబాబు టాస్క్‌ ఫోర్సు ఏడీసీపీ ఫోన్‌ నంబరు 9440627089లకు సమాచారం అందించొచ్చని అందులో పేర్కొన్నారు. సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని అందులో ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌ రాజకీయ చరిత్రలో ముఖ్యమంత్రిపై ఏదైనా దాడి జరిగినప్పుడు కారకుల సమచారం అందిస్తే నగదు మహుమతులు ప్రకటించిన సందర్భాలున్నాయా? అంటే లేవనే చెప్పొచ్చు. ఎందుకంటే ముఖ్యమంత్రి అన్న తర్వాత ఆయన చుట్టూ అంత దుర్బేద్యమైన రక్షణ వలయం ఉంటుంది. ముఖ్యమంత్రి చుట్టూ పోలీసులు నిత్యం డేగ కళ్లతో గమనిస్తూ ఉంటారు. జనాల్లో కూడా నిఘా సిబ్బంది కలియ తిరుగుతుంటారు. ఎక్కడ ఏ చిన్న సంఘటన జరిగినా పోలీసులకు క్షణాల్లో తెలిసి పోతుంది. అంత పటిష్టమైన నిఘా వ్యవస్థ ఉంటుంది.
ముందే జల్లెడ పడుతారు
ముఖ్యమంత్రి పర్యటించే ప్రాంతాలను ముందుగానే జల్లెడ పడుతారు. ఎన్నికల ప్రచారమైనప్పటికీ ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వారికి కల్పించే భద్రతలో ఎలాంటి సడలింపులు ఉండవు. ఎన్నికల ప్రక్రియ పూర్తి అయ్యే వరకు ఆ భద్రత అలాగే కొనసాగుతూ ఉంటుంది. ఎన్నికల సమయం కాబటి ఎన్నికల కమిషన్‌ ప్రచార కార్యక్రమానంతా వీడీలను తీస్తుంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి స్పీచ్‌ను కూడా వీడియో తీస్తారు. పోలసులకు సంబంధించిన టెక్నికల్‌ విభాగం వాళ్లు ఫొటోలు తీయడంతో పాటు వీడియోలను కూడా తీస్తారు. డ్రోన్‌ కెమేరాలను కూడా ఉపయోగిస్తారు. వీటితో ఫొటోలు, వీడియోలను తీస్తారు. ఇన్ని రకాల వీడియాలు, ఫొటోల మధ్య ఏమి జరిగినా ఇట్టే గుర్తించే అవకాశం ఉంటుంది.
నమోదు కాకపోవడం గమనార్హం
ముఖ్యమంత్రిపైకి దూసుకొచ్చిన రాయి ఎక్కడి నుంచి వచ్చిందో.. ఎలా వచ్చిందో ఏ కెమేరాలోను నమోదు కాకపోవడం గమనార్హం. ఇలాంటి పరస్థితుల్లో నిందితులను గుర్తించడంలో పోలీసు శాఖ చేతులెత్తేసే పరిస్థితి వచ్చింది. అందుకేనేమో నిందితుల సమాచారం అందించిన వారికి పోలీసు వారు నగదు బహుమతిని ఇస్తామని ప్రకటించారు. అంటే డబ్బుకు ఆశ పడిన వారు పోలీసులకు సమాచారం ఇస్తారనే భ్రమలో పోలీసులు ఉండే ఉండి ఉండొచ్చు.
సాధారణంగా మావోయిస్టులు, టెర్రరిస్టులు, కరుగట్టిన నేరస్తు, అంతర్జాతీయ నేరగాళ్ల సమాచారం తెలుసుకునేందుకు ఇలాంటి నగదు బహుమతులు ప్రకటించడం ఇప్పటి వరకు చూశాం. కానీ నిత్యం ముఖ్యమంత్రి చుట్టూ ఉండే భద్రతా సిబ్బంది గమనించ లేని విషయాలను బయటి వాళ్లు గమనించి చెబుతారేమోననే ఆలోచన పోలీసు మెదళ్లకు వచ్చిందంటే ఈ రాష్ట్రంలో పోలీసు శాఖ ఘోరంగా వైఫల్యం చెందిందనేది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న చర్చ.
ముఖ్యమంత్రి జగన్‌కు ఎలాంటి భద్రత ఉందో తెలుసా
ముఖ్యమంత్రి చుట్టూ మూడంచెల భద్రత ఉంటుంది. అక్టోపస్, ఇంటెలీజెన్స్‌తో పాటు స్పెషల్‌ పోలీసులు పహారా ఉంటారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్‌కు కొత్త ముప్పు ఉన్నట్టు ఇంటెలిజెన్స్‌ విభాగం పేర్కొంది. ఐఎస్‌ఐ ప్రేరేపిత ఉగ్రవాదులతో వల్ల, వామపక్ష తీవ్రవాదులు, సంఘ విద్రోహ శక్తులు, నేరముఠాల నుంచి ముప్పు ఉందని, సీఎం జగన్‌కు జెడ్‌ ప్లస్‌ స్థాయి భద్రత కల్పించాలని గతంలో కేంద్రప్రభుత్వానికి రాష్ట్ర ఇంటెలిజెన్స్‌ విభాగం నివేదించింది. ఐఎస్‌ఐ ప్రేరేపిత ఉగ్రవాదులతో ముప్పు ఉందని కూడా వివరించింది. ఆ మేరకు రాష్ట్రప్రభుత్వం కేంద్రానికి నోట్‌ పంపింది. ఇప్పటి వరకు దేశంలోని ముఖ్యమంత్రుల్లో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు మాత్రమే ఐఎస్‌ఐ ప్రేరేపిత ఉగ్రవాదులతో ముప్పు ఉన్నట్టు పోలీసు వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు కూడా జెడ్‌ ప్లస్‌ స్థాయి భద్రత కల్పించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. జెడ్‌ ప్లస్‌ స్కేల్‌ భద్రత కల్పించే వ్యక్తిగా జామర్, బులెట్‌ ప్రూఫ్‌ కార్‌ ఇతర సెక్యూరిటీ బందోబస్తు కల్పించాలని ఏపీ ప్రభుత్వం కోరింది. అంతేకాకుండా సీఎం జగన్‌ ప్రయాణించే విమానానికి కూడా విమానాశ్రయంలో సాయుధులైన భద్రతా సిబ్బందితో కాపలా కావాలని కోరింది. ఈ నేపథ్యంలో సీఎం జగన్‌కు జడ్‌ప్లస్‌ కేటగిరీ భద్రతను కేంద్రం కల్పించింది. అయితే ఇప్పటికే సీఎం జగన్‌కు సీఎం సెక్యూరిటీ వింగ్‌కు చెందిన భధ్రతను రాష్ట్రప్రభుత్వం కల్పిస్తోంది. దీనికి బాహ్యవలయంగా ఆక్టోపస్‌ దళానికి చెందిన 32 మంది స్పెషల్‌ ట్రైన్డ్‌ సిబ్బంది సీఎంకు భద్రత కల్పిస్తున్నారు.
Read More
Next Story