చర్లపల్లిలో పట్నంకు ప్రాణహాని ?
x

చర్లపల్లిలో పట్నంకు ప్రాణహాని ?

పట్నం(Patnam)ను అర్జెంటుగా స్పెషల్ బ్యారక్ కు మార్చాలని పార్టీ లాయర్ హౌజ్ మోషన్ దాఖలు చేశారు.


వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్ మీద దాడి ఘటనలో కీలకవ్యక్తి పట్నం నరేందరరెడ్డి చర్లపల్లి జైలు(Charlapalli Jail)లో ఉన్నారు. దాడిలో కీలక వ్యక్తిగా పోలీసులు పట్నంను అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టగా జడ్జి రిమాండ్ విధించారు. సింగిల్ జడ్జి ఇచ్చిన రిమాండ్ ఆదేశాలు కొట్టేయాలని పట్నం తరపున బీఆర్ఎస్ లాయర్ డివిజన్ బెంచ్ లో పిటీషన్ వేశారు. అయితే శుక్రవారంతో కలుపుకుని శని, ఆదివారాలు కోర్టుకు సెలవు కావటంతో పిటీషన్ సోమవారం మాత్రమే విచారణకు వచ్చే అవకాశముంది. అందుకనే పట్నం(Patnam)ను అర్జెంటుగా స్పెషల్ బ్యారక్ కు మార్చాలని పార్టీ లాయర్ హౌజ్ మోషన్ దాఖలు చేశారు. సెలవులు అయినప్పటికీ అత్యవసరంగా వచ్చే పిటీషన్లను విచారించేందుకు వెకేషన్ కోర్టు ఉంటుంది. ఆ కోర్టులోనే బీఆర్ఎస్ లాయర్(BRS Lawyer) హౌజ్ మోషన్ దాఖలు చేశారు.

ఇంతకీ అంత అర్జంటుగా పట్నంను చర్లపల్లిలోని సాధారణ జైలుగది నుండి ప్రత్యేక బ్యారక్ కు మార్చాలని బీఆర్ఎస్ ఎందుకు కోరుకుంటోంది ? గురువారం సాయంత్రం నుండి పట్నం చర్లపల్లిలోని సాధారణ జైలుగదిలోనే ఉంటున్నారు. ఈ గదిలో పట్నంతో మరో ఐదుగురు నేరస్ధులన్నారని బీఆర్ఎస్ ఆందోళన వ్యక్తంచేస్తోంది. ఒక గదిలో ఐదుగురు నేరస్ధులతో కలిసి పట్నం ఉండటం ఎంతమాత్రం క్షేమం కాదని పార్టీ టెన్షన్ పడుతోంది. నేరస్ధులతో కలిసి మాజీ ఎంఎల్ఏని ఒకే గదిలో ఉంచటం ఏమిటని బీఆర్ఎస్ లాజిక్ మాట్లాడుతోంది. ఐదుగురు నేరస్ధులతో కలిసి పట్నంను ఒకే గదిలో ఉంచటం క్షేమంకాదని అంటోందేకాని సదరు నేరస్ధులు ఎవరు ? వారిలో ఎవరినుండి ప్రాణహాని ఉంది అన్నది మాత్రం చెప్పటంలేదు.

ఇతర నేరస్ధులతో కలిసి ఒకే గదిలో ఉంచటంపట్ల పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేస్తోంది. అయితే నేరగాళ్ళతో కలిసి పట్నంను ఎందుకు ఉంచకూడదో మాత్రం సరిగా చెప్పటంలేదు. గదిలోని నేరస్ధులతో ప్రాణహాని ఉందా లేకపోతే జైలులో కూడా పట్నంకు వీవీఐపీ ట్రీట్మెంట్(VVIP Treatment) దక్కాలని బీఆర్ఎస్ కోరుకుంటోందా అన్న విషయంలో క్లారిటిలేదు. ఏదేమైనా పట్నంను స్పెషల్ బ్యారక్ లో ఉంచాలని మాత్రం గట్టిగా పట్టుబట్టింది. మరి హౌజ్ మోషన్ లో కేసు విచారణ సందర్భంగా జడ్జి ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.

Read More
Next Story