రాజధాని పేరుతో రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేయడం భావ్యమా?
x

రాజధాని పేరుతో రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేయడం భావ్యమా?

డాక్టర్ నర్రెడ్డి తులసి రెడ్డి అమరావతి ప్రాంతంలో విస్తృతంగా పర్యటించి వివిధ నిర్మాణ దశలో ఉన్న భవనాలను పరిశీలించారు.


రాజధాని పేరు చెప్పి రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేయడం భావ్యం కాదని రాజ్యసభ మాజీ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి డాక్టర్ నర్రెడ్డి తులసిరెడ్డి కూటమి ప్రభుత్వానికి హితవు చెప్పారు. ఆదివారం తులసి రెడ్డి అమరావతి ప్రాంతంలో విస్తృతంగా పర్యటించి వివిధ నిర్మాణ దశలో ఉన్న భవనాలను పరిశీలించారు. రాజ్ భవన్ నిర్మాణం పనులు ఇంకా ప్రారంభమే కాలేదని, శాశ్వత సచివాలయ ,అసెంబ్లీ ,హైకోర్టు భవనాల నిర్మాణం పునాది దశలోనే ఉందని అన్నారు. మంత్రుల ,జడ్జీల, ఎమ్మెల్యేల ,ఎన్జీవోల భవనాలు వివిధ నిర్మాణ దశలో ఉన్నాయన్నారు. ప్రభుత్వ సొమ్ము దుబారా అవుతోంది. తెలంగాణ రాష్ట్ర శాశ్వత సచివాలయ భవనం 600 కోట్ల రూపాయలతో పూర్తి చేయగా అమరావతిలో తాత్కాలిక సచివాలయం పేరుతో 1180 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగిందని ,మళ్లీ ఇప్పుడు శాశ్వత సచివాలయం పేరుతో 4600 కోట్ల రూపాయలు కేటాయించడం దుబారా కాక మరి ఏమిటని తులసి రెడ్డి ప్రశ్నించారు.

విభజన చట్టంలో సెక్షన్ 94 సబ్ సెక్షన్ 3 ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో రాజ్ భవన్ ,సచివాలయం, అసెంబ్లీ భవనం ,శాసనమండలి భవనం, హైకోర్టు ,మౌలిక సదుపాయాలకు కేంద్ర ప్రభుత్వము గ్రాంట్ రూపంలో నిధులు సమకూర్చాలి కానీ దురదృష్టవశాత్తు గత 11 సంవత్సరాలుగా కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ ప్రభుత్వం పిల్లికి బిచ్చం వేసినట్లు కేవలం 1500 కోట్ల రూపాయలు మాత్రమే గ్రాంట్ గా ఇచ్చిందని మిగతా సొమ్ము అప్పు తెచ్చుకోమని రాష్ట్ర ప్రభుత్వానికి సలహా ఇవ్వడం దురదృష్టకరం .కూటమి ప్రభుత్వం ఇప్పటికే రాజధాని కోసం ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు,హడ్కో, జర్మనీకి చెందిన కె ఎఫ్ వై బ్యాంకు నుండి రాజధాని కోసం 31 వేల కోట్ల రూపాయలు అప్పుచేసింది.
ఇది చాలక మళ్ళీ 32,500 కోట్ల రూపాయలు అప్పు చేయబోతోంది. రాజధాని అమరావతి సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్టు అని అందులో నుంచే సంపద సృష్టించి ఆ డబ్బుతోనే నిర్మాణాలు చేపడతామని రాష్ట్ర ప్రజలపై భారం వేయమని చంద్రబాబు పదేపదే చెప్పారు. ఇప్పుడు అందుకు పూర్తి విరుద్ధంగా జరుగుతుంది .ఇప్పటికైనా దుబారా తగ్గించాలని ,కేంద్ర ప్రభుత్వం నుండి గ్రాంట్ రూపంలో నిధులు తెప్పించి ,సెల్ఫ్ ఫైనాన్స్ విధానంలో ప్రజా రాజధాని నిర్మించాలని ,రాజధాని పేరు చెప్పి అప్పులు చేయవద్దని, రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేయవద్దని తులసి రెడ్డి రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు .ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కోటేశ్వరరావు, ప్రసాద్ ,నామా వినయ్ తదితరులు పాల్గొన్నారు.
Read More
Next Story