
కొనసాగుతున్న పెట్టుబడుల వేట
ఆంధ్రప్రదేశ్ ను గ్లోబల్ హబ్ గా మార్చేందుకు పెట్టుబడి దారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆహ్వానిస్తున్నారు. ఆ వేట కొనసాగుతూనే ఉంది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెట్టుబడుల ఆకర్షణలో తన పాత వేటను మళ్లీ ప్రారంభించారు. వచ్చే నవంబర్ 2 నుండి 5 వరకు లండన్ పర్యటనకు సిద్ధమవుతున్నారు. ఈ పర్యటన లక్ష్యం నవంబర్ 14, 15 తేదీల్లో విశాఖపట్నంలో జరిగే సీఐఐ (కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ) పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్‌కు ప్రపంచ పెట్టుబడిదారులను ఆహ్వానించడం. అధికారుల బృందంతో సహా ఈ టూర్‌లో చంద్రబాబు పలు పారిశ్రామిక దిగ్గజాలతో సమావేశాలు నిర్వహించనున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో సుమారు 9 లక్షల కోట్ల రూపాయల మేర పెట్టుబడులను ప్రభుత్వం ఆకర్షించినట్లు చెబుతోంది. మరో 2 లక్షల కోట్ల వరకు అవకాశాలు ఉన్నాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఈ వ్యూహం ద్వారా రాష్ట్రాన్ని ఆర్థికంగా బలోపేతం చేయడమే కాకుండా, ఉపాధి అవకాశాలను పెంచేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి.
గూగుల్ తో ఒప్పందం సందర్భంగా ఎంవోయూలు మార్చుకుంటున్న ప్రతినిధులు
చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించడంలో విజయం సాధిస్తోంది. సీఐఐ సమ్మిట్ 30వ ఎడిషన్‌గా విశాఖలో జరగనుంది. ఇది గ్లోబల్ వ్యాపార నాయకులు, పాలసీ మేకర్లు, ఇన్నోవేటర్లకు ప్లాట్‌ఫాం అందిస్తుంది. రాష్ట్రంలో విస్తారమైన మానవ వనరులు, మౌలిక సదుపాయాలు, ఇన్వెస్టర్-ఫ్రెండ్లీ పాలసీలు పెట్టుబడిదారులను ఆకర్షిస్తున్నాయి. ఉదాహరణకు ఇటీవలి కాలంలో ఐటీ, మాన్యుఫాక్చరింగ్, రెన్యూవబుల్ ఎనర్జీ సెక్టార్లలో పెట్టుబడులు పెరిగాయి. అయితే ఈ ప్రయత్నాలు ఎంతవరకు ఫలవంతమవుతాయో చూడాలి.
మైక్రో సాఫ్ట్ తో ఒప్పందం సందర్బంగా...
ఎందుకంటే గతంలోనూ చంద్రబాబు హయాంలో అమరావతి ప్రాజెక్ట్ వంటివి ఆకర్షించినప్పటికీ, రాజకీయ మార్పులతో అడ్డంకులు ఎదుర్కొన్నాయి. ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక స్థిరత్వం, ఉపాధి సృష్టి కోసం ఈ లండన్ టూర్ కీలకమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే, ఆంధ్రప్రదేశ్ భారత ఆర్థిక వృద్ధిలో ముందంజలో నిలిచే అవకాశం ఉంది.
ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ఈ నెల 19-24 తేదీల్లో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్తున్నారు. ఆస్ట్రేలియా ప్రభుత్వం ఆహ్వానంపై, స్పెషల్ విజిట్స్ ప్రోగ్రామ్‌లో ఆయన పాల్గొననున్నారు. ఈ పర్యటనలో ఆయన వివిధ యూనివర్సిటీలను సందర్శించి అధునాతన విద్యా విధానాలను అధ్యయనం చేస్తారు. అలాగే నవంబర్ 14-15లో విశాఖపట్నంలో జరిగే సీఐఐ పార్టనర్‌షిప్ సమ్మిట్ విజయవంతం కోసం రోడ్ షోల్లో పాల్గొంటారు.
సిడ్నీలో 19న తెలుగు డయాస్పోరా సమావేశం, యూనివర్సిటీ ఆఫ్ న్యూసౌత్ వేల్స్, TAFE NSW సందర్శనలతో పాటు బిజినెస్ కౌన్సిల్ ఆఫ్ ఆస్ట్రేలియాతో సమావేశాలు జరుగుతాయి. 21న పర్రమట్టాలో సీఫుడ్స్ ఇండస్ట్రీ, వెస్ట్రన్ సిడ్నీ యూనివర్సిటీ సందర్శనలు, 22న గోల్డ్ కోస్ట్‌లో గ్రిఫిత్ యూనివర్సిటీ, క్వీన్స్‌లాండ్ ట్రేడ్ సమావేశాలు, 23న మెల్‌బోర్న్ యూనివర్సిటీ, వైన్ ఇండస్ట్రీ సందర్శనలు, 24న ఆస్ట్రేలియన్ ట్రేడ్ కమిషన్‌తో రౌండ్ టేబుల్, విక్టోరియా క్రికెట్ గ్రౌండ్ సందర్శన ఉన్నాయి. 24 రాత్రి మెల్‌బోర్న్ నుంచి బయలుదేరి 25న హైదరాబాద్ చేరుకుంటారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో 2024-2025లో వివిధ కంపెనీలతో జరిగిన ప్రధాన మెమోరాండమ్ ఆఫ్ అండర్‌స్టాండింగ్ (MoU)లు లేదా ఇన్వెస్ట్‌మెంట్ అగ్రిమెంట్‌లు ఇలా ఉన్నాయి. ఇవి మొత్తం రూ.9.34 లక్షల కోట్ల వరకు పెట్టుబడులను ఆకర్షించాయి. 340కి పైగా MoUలు జరిగాయి. సుమారు 25 లక్షల ఉద్యోగాలు సృష్టించే అవకాశం ఉందని ప్రభుత్వం చెబుతోంది. ప్రధాన సెక్టార్లు గా IT, రెన్యూవబుల్ ఎనర్జీ, మాన్యుఫాక్చరింగ్, టూరిజం, AI, ఫార్మా మొదలైనవి ఉన్నాయి. టూరిజం సెక్టార్‌లో 103 సంస్థలతో రూ.10,644 కోట్ల MoUలు జరిగాయి. కానీ స్పెసిఫిక్ కంపెనీల పేర్లు అధికారికంగా ప్రభుత్వం వెల్లడించలేదు.
అదానీ కంపెనీతో ఒప్పందం సందర్భంగా సీఎం చంద్రబాబు
ప్రధాన MoUలు వివరాలు
Google: AI-పవర్డ్ డేటా సెంటర్ (1 GW కెపాసిటీ), విశాఖపట్నం. పెట్టుబడి: రూ.87,520 కోట్లు ($15 బిలియన్). అక్టోబర్ 14, 2025 న ఎంఓయూ జరిగింది. సబ్‌సీ కేబుల్ కనెక్టివిటీ, AI ప్రొఫెషనల్స్ డెవలప్‌మెంట్.
Bill & Melinda Gates Foundation: హెల్త్‌కేర్, అగ్రికల్చర్, ఎడ్యుకేషన్‌లో AI సొల్యూషన్స్ (ప్రిడిక్టివ్ హెల్త్ అనలిటిక్స్, ప్రెసిషన్ ఫార్మింగ్). మార్చి 2025లో ఎంఓయూ జరిగింది.
Tata Power Renewable Energy Ltd / Tata: క్లీన్ ఎనర్జీ (7 GW కెపాసిటీ). రూ.45,000 కోట్లు పెట్టుబడి.
Tata Consultancy Services (TCS): IT/ITES క్యాంపస్, విశాఖపట్నం. రూ.1,370 కోట్లు పెట్టుబడి. 12,000 ఉద్యోగాలు.
Hinduja Group / Ashok Leyland: వెహికల్ మాన్యుఫాక్చరింగ్ (50-100% కెపాసిటీ).
ArcelorMittal Nippon Steel: స్టీల్ ప్లాంట్, నక్కపల్లి, అనకాపల్లి జిల్లా. రూ.1,47,162 కోట్ల పెట్టుబడి.
Cognizant Technology Solutions: IT క్యాంపస్, విశాఖపట్నం. రూ.1,583 కోట్లు పెట్టుబడి. 8,000 ఉద్యోగాలు.
Adani Group: గ్రీన్ & హైడ్రోపవర్ ప్రాజెక్టులు. పెట్టుబడి: రూ.18,900 కోట్లు.
Raymond: మాన్యుఫాక్చరింగ్. పెట్టుబడి: రూ.1,202 కోట్లు, 6,571 ఉద్యోగాలు.
Reliance Consumer Products: కన్స్యూమర్ ప్రాడక్ట్స్, ఓర్వకల్. పెట్టుబడి: రూ.1,622 కోట్లు, 1,200 ఉద్యోగాలు.
Yamna (UK): గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్ట్, కృష్ణపట్నం. పెట్టుబడి: రూ.16,000 కోట్లు.
JKSH Green Power & Hynfra: గ్రీన్ హైడ్రోజన్ & అమ్మోనియా, మచిలీపట్నం. పెట్టుబడి: రూ.35,000 కోట్లు, 10,500 ఉద్యోగాలు.
Petronas: గ్రీన్ అమ్మోనియా ప్లాంట్, కాకినాడ. పెట్టుబడి: రూ.13,000-15,000 కోట్లు.
Indosol Solar: సోలార్ ఎక్విప్‌మెంట్ మాన్యుఫాక్చరింగ్, శ్రీ సత్యసాయి జిల్లా. పెట్టుబడి: రూ.58,469 కోట్లు, 15,000 ఉద్యోగాలు.
Laurus Labs: ఫార్మా హబ్, అనకాపల్లి. పెట్టుబడి: రూ.5,630 కోట్లు, 6,350 ఉద్యోగాలు.
Lulu Group: మాల్ & కన్వెన్షన్ సెంటర్, విశాఖపట్నం. పెట్టుబడి: రూ.1,500 కోట్లు, 7,000 ఉద్యోగాలు.
Bharat Petroleum Corporation (BPCL): ఆయిల్ రిఫైనరీ & పెట్రోకెమికల్స్. పెట్టుబడి: రూ.95,000 కోట్లు.
Microsoft: AI ట్రైనింగ్ (2 లక్షల యూత్), గ్లోబల్ హ్యాకథాన్.
NVIDIA: AI యూనివర్సిటీ, అమరావతి.
Schneider Electric: అడ్వాన్స్‌డ్ టెక్ ల్యాబ్స్ (9,000 స్టూడెంట్స్ ట్రైనింగ్).
MasterCard: టూరిజం ఎన్‌హాన్స్‌మెంట్ (APTDCతో), సాంస్కృతిక హెరిటేజ్ ప్రమోషన్. జూలై 2025లో ఎంఓయూ జరిగింది.
LG Electronics: ఇన్వెస్ట్‌మెంట్ సేసేందుకు ఎంఓయూ చేసుకుంది.
Jindal Group: యూనిట్స్ ఇన్ రాయలసీమ & నార్త్ ఆంధ్ర.
ఇతరులు: PepsiCo (డిస్కషన్స్); IVP Semi, DTDS Group (సెమికండక్టర్); YouTube Academy India, Tesseract Inc. (క్రియేటర్ అకాడమీ); Cyient Foundation, AICTE (ఇన్నోవేషన్ సెంటర్స్); Sify Infinite Spaces, Sattva Developers, ANSR Global Corporation, BVM Energy (విశాఖలో ఇన్వెస్ట్‌మెంట్స్).
పై సంస్థలకు సంబంధించి ఎంవోయూలు చేసుకున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇంకా కొన్ని సంస్థలు ఎంవోయూలు చేసుకోవాల్సి ఉందని, వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని అధికారులు చెబుతున్నారు. ప్రధాన మైన కంపెనీల వివరాలు మాత్రమే ప్రభుత్వం వెల్లడించింది.