వాట్సాప్‌ ద్వారా ఇంటర్‌ పలితాలు
x

వాట్సాప్‌ ద్వారా ఇంటర్‌ పలితాలు

మూల్యంకనం, మార్కుల కంప్యూటరీకరణ ప్రక్రయలు పూర్తి అయ్యాయి.


ఆంధ్రప్రదేశ్‌లో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఇంటర్‌ పరీక్షల పలితాలను విడుదల చేసేందుకు ఏర్పాట్లన్నీ తుది దశకు చేరుకున్నాయి. ఏప్రిల్‌ 12 అంటే రేపు శనివారం నాడు విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేశారు. ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల పరీక్షల ఫలితాలను శనివారం ఉదయం 11 గంటలకు ఫలితాలను విడుదల చేయనున్నట్లు మంత్రి నారా లోకేష్‌ తెలిపారు. మార్చి 1 నుంచి 20 వరకు ఇంటర్‌ పరీక్షలు జరిగాయి. దాదాపు 10లక్షలకుపూగా విద్యార్థులు ఏపీలో ఇంటర్‌ పరీక్షలను రాశారు. మూల్యాంకనం ప్రక్రియ కూడా పూర్తి అయ్యింది. 25 కేంద్రాల్లో మూల్యాంకనం చేపట్టారు. నాలుగు విడతల్లో దీనిని పూర్తి చేశారు. మార్కుల కంప్యూటరీకరణ కూడా ఇప్పటికే పూర్తి అయ్యింది.

ఇప్పటి వరకు వెబ్‌సైట్ల ద్వారానే పరీక్షల ఫలితాలను తెలుసుకునే వారు. అయితే ఈ సారి కూటమి ప్రభుత్వం వాట్సాప్‌ గవర్నెన్స్‌ తీసుకొచ్చిన నేపథ్యంలో తొలి సారి వాట్సాప్‌ ద్వారా కూడా ఇంటర్‌ ఫలితాలను తెలుసుకునే సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చారు. 9552300009 వాట్సాప్‌ నంబరుకు హాయ్‌ అని మెసేజ్‌ పంపడం ద్వారా ఫలితాలను తెలుసుకోవచ్చు. దీంతో పాటుగా ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్‌ జ్టి్టpట:bజ్ఛీ.్చp.జౌఠి.జీn ద్వారా ఇంటర్‌ ఫలితాలను తెలుసుకునేందుకు ఏర్పాట్లు చేశారు.
9552300009 నంబర్‌కు వాట్సాప్‌లో హాయ్‌ అని మెస్సేజ్‌ పెట్టడటంతో ఇంటర్‌ ఫలితాలను తెలుసుకోవచ్చు. హాయ్‌ అని మెస్సేజ్‌ చేయగానే మనమిత్ర వాట్సాప్‌ గవర్ననెన్స్‌ నుంచి రిప్లయ్‌ వస్తుంది. అందులో సేవను ఎంచుకోండి అని దిగువ భాగానా ఓ మెస్సేజ్‌ కనిపిస్తుంది. అక్కడ క్లిక్‌ చేయాలి. క్లిక్‌ చేసిన తర్వాత విద్య సేవలు అనే ఆప్షన్‌ను ఎంచుకొని దాని మీద క్లిక్‌ చేయాలి. అనంతరం ఇంటర్‌ రిజల్ట్స్‌ అనే మరో ఆప్షన్‌ కనిపిస్తుంది. ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్, ఇంటర్‌ సెకెండ్‌ ఇయర్‌ పరీక్షల ఫలితాలను డౌన్‌లోడ్‌ చేసుకోండని ఆప్షన్‌ కనిపిస్తుంది. విద్యార్థుల హాల్‌టికెట్‌ నంబర్, డేట్‌ ఆఫ్‌ బర్త్‌ వివరాలను ఎంటర్‌ చేయాలి. అనంతరం ఇంటర్‌ రిజల్ట్స్‌ డౌన్‌లోడ్‌ అవుతుంది. మార్క్‌ లిస్ట్‌ పీడీఎఫ్‌ రూపంలో డిస్‌ప్లే అవుతుంది. దీంతో పాటుగా మనబడి వెబ్‌సైట్‌ ద్వారా కూడా ఇంటర్‌ ఫలితాలను తెలుసుకోవచ్చు.
మరో వైపు ఏప్రిల్‌ రెండో వారంలో ఇంటర్‌ ఫలితాలను విడుదల చేయడం ఒక సంప్రదాయంగా మారింది. ఉన్నత విద్య కోర్సులకు వెళ్లేందుకు ఎలాంటి జాప్యం లేకుండా ఏప్రిల్‌ మాసంలోనే ఇంటర్‌ ఫలితాలను విడుదల చేస్తూ వస్తున్నారు. గత ఏడాది కూడా ఇదే తేదీన ఫలితాలను విడుదల చేశారు. ఏప్రిల్‌ 12 శనివారం విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లుగానే గతే ఏడాది కూడా ఏప్రిల్‌ 12వ తేదీనే ఇంటర్‌ ఫలితాలను విడుదల చేశారు. ఈ ఏడాది వరుసగా ఏప్రిల్‌ 13న ఆదివారం, తర్వాత ఏప్రిల్‌ 14న అంబేద్కర్‌ జయంతి రెండు రోజులు సెలవు కావడంతో రెండో శనివారమైనా కూడా ఏప్రిల్‌ 12 శనివారం నాడు ఫలితాలు విడుదల చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది.
Read More
Next Story