ఇంటర్‌ ఫలితాలు విడుదల
x

ఇంటర్‌ ఫలితాలు విడుదల

ఆంధ్రప్రదేశ్‌ మంత్రి నారా లోకేష్‌ ఇంటర్‌ ఫలితాలను విడుదల చేశారు. బెస్ట్‌ విషెస్‌ అంటూ విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు.


ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్‌ ఫలితాలను విడుదల చేశారు. శనివారం ఉదయం 11 గంటలకు ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్, సెకెండ్‌ ఇయర్‌ ఫలితాలను మంత్రి నారా లోకేష్‌ విడుదల చేశారు. విద్యార్థులు resultsbie.ap.gov.inవెబ్‌సైట్‌ ద్వారా ఫలితాలు తెలుసుకోవచ్చని, దీంతో పాటుగా మనమిత్ర వాట్సాప్‌ నంబరు 9552300009 ద్వారా కూడా ఇంటర్‌ ఫలితాలు తెలుసుకోవచ్చని మంత్రి లోకేష్‌ తెలిపారు. రెండే రెండు నిముషాలలో ఇంటర్‌ ఫలితాలను ఫోన్‌లోని వాట్సాప్‌ ద్వారా తెలుసుకోవచ్చన్నారు. ఫలితాలు విడుదల చేసిన సందర్భంగా విద్యార్థులకు శుభాకాంక్షలు, బెస్ట్‌ విషెస్‌ చెప్పారు. ఇంటర్‌ ఫలితాలు విద్యార్థుల ఉత్తమ భవిష్యత్తుకు మార్గం చూపుతాయని లోకేష్‌ వెల్లడించారు.

కూటమి ప్రభుత్వం ఈ సారి ఓ వినూత్న ప్రయోగం చేపట్టంది. మంత్రి నారా లోకేష్‌ ఆధ్వర్యంలో వాట్సాప్‌ గవర్నెన్స్‌కు శ్రీకారం చుట్టూరు. అందులో భాగంగా ఈ సారి ఇంటర్‌ ఫలితాలను కూడా వాట్సాప్‌ గవర్నెన్స్‌ ద్వారా తెలుగుసుకునే విధంగా టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చారు. వాట్సాప్‌ నంబర్‌ 9552300009లో హాయ్‌ అని మెస్సేజ్‌ పెట్టడం ద్వారా ఫలితాలను తెలుసుకోవచ్చని మంత్రి లోకేష్‌ తెలిపారు. ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని విద్యార్థులు, తల్లిదండ్రులకు మంత్రి లోకేష్‌ సూచించారు. హాల్‌టికెట్‌ నంబర్, డేట్‌ ఆఫ్‌ బర్త్‌ వివరాలను మెస్సేజ్‌ చేయడం ద్వారా ఫలితాలు ఫోన్‌లో కళ్ల ముందు కనిపిస్తాయని వెల్లడించారు.
http://resultsbie.ap.gov.in
ఈ వెబ్‌సైట్‌ ద్వారా ఇంటర్‌ ఫలితాలను తెలుసుకోవచ్చు.
ఆంధ్రప్రదేశ్‌లో 10లక్షలకుపైగా ఇంటర్‌ పరీక్షలు రాశారు. గత పదేళ్లల్లో ఎన్నడు లేని విధంగా ఈ విద్యా సంవత్సరం విద్యార్థులు ఇంటర్‌ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్‌ ప్రథమ సంవత్సరంలో 70 శాతం మంది ఉత్తీర్ణత సాధించగా, సెకెండ్‌ ఇయర్‌లో 83 శాతం మంది పాసయ్యారు. ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో కూడా ఇదే ఫలితాలు నమోదయ్యాయి. 69 శాతం మంది విద్యార్థులు సెకెండ్‌ ఇయర్‌లోను, 47 శాతం మంది విద్యార్థులు ఫస్ట్‌ ఇయర్‌లోను ఉత్తీర్ణత సాధించారు.
Read More
Next Story