దేవాలయాలకు వెళ్ళి రావడమే గతంలో పర్యాటకం
x

దేవాలయాలకు వెళ్ళి రావడమే గతంలో పర్యాటకం

ఏపీలో టూరిజం ప్రాజెక్టులు ఏర్పాటు కు అపారమైన అవకాశాలు ఉన్నాయని సీఎం చంద్రబాబు అన్నారు.


గతంలో పర్యాటకం అంటే దేవాలయాలకు వెళ్ళి రావడమే కానీ ఇప్పుడు టూరిజం దేశాల ఆర్థిక వ్యవస్థను శాసిస్తున్నాయి అని సీఎం చంద్రబాబు అన్నారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ప్రపంచ పర్యాటక దినోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో టూరిజం ద్వారా ట్రాన్స్ఫర్మేషన్‌ తీసుకురావాలన్న లక్ష్యం తో టూరిజం డే నిర్వహించుకుంటున్నామన్నారు. 2.6 ట్రిలియన్‌ డాలర్లు ఆదాయం పర్యాటకం పై ఆయా దేశాలకు వస్తోందన్నారు. వాటితో పోలిస్తే భారత్‌ లో పర్యాటక రంగానికి మంచి అవకాశాలు ఉన్నాయి. కూటమి అధికారంలోకి రాగానే రాష్ట్రంలో పర్యాటక ప్రాజెక్టులను ప్రోత్సహించేందుకు పారిశ్రామిక హోదా కల్పించామన్నారు. పర్యాటకం ద్వారా పెద్ద ఎత్తున ఆదాయాన్ని, ఉపాధిని, ఉద్యోగాలను సాధించే అవకాశం ఉందన్నారు.

ప్రస్తుతం ఒక్క ఇజమే నిలిచి ఉంటుంది. అది టూరిజం మాత్రమే అన్నారు. పర్యాటకం కోసం భారతీయులు ఇతర దేశాలకు వెళుతున్నారు. కానీ మనకు ఉన్నన్ని పర్యాటక ప్రదేశాలు ఇంక ఎక్కడా లేవు. ఏపీలో టూరిజం ప్రాజెక్టులు ఏర్పాటు కు అపారమైన అవకాశాలు ఉన్నాయి. స్పీడ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ విధానం లో అనుమతులు, ప్రోత్సాహకాలు ఇస్తున్నాం. ఇవాళ స్వదేశీ 4 జీ నెట్‌ అందుబాటులోకి వచ్చింన్నారు. 10,600 కోట్ల పెట్టుబడులు పర్యాటక రంగంలో ఏపీ కి వచ్చాయి. అరకు, పాడేరు, విశాఖ, తిరుపతి, రాయల సీమ తదితర ప్రాంతాల్లో 10 వేల హోం స్టే లు అందుబాటులోకి వస్తాయన్నారు. అలాగే వచ్చే మూడేళ్ల లో 50 వేల హోటల్‌ రూం లను కూడా అందుబాటులోకి తెస్తాం. మన సంస్కృతి సంప్రదాయలనూ ఉపయోగించుకుని ఎక్సీ్పరియన్స్‌ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నాం.

టెంపుల్‌ టూరిజం, ఎకో టూరిజం లాంటి ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇస్తున్నాం. తిరుమల, అన్నవరం లాంటి చోట్ల వెడ్డింగ్‌ డెస్టినేషన్‌ లను ఏర్పాటు చేయాలని ఆలోచన చేస్తున్నామన్నారు. బుద్ధిస్ట్‌ ప్రాంతాలు తో పాటు అధ్యాత్మిక కేంద్రాల్లో కుంభ మేళా తరహా కార్యక్రమాలు నిర్వహిస్తాం. అరకు చలి ఉత్సవం, ఫ్లెమింగో ఫెస్టివల్‌ లాంటివి నిర్వహిస్తున్నాం. ఘనంగా దసరా ఉత్సవాలు నిర్వహించి మైసూరు, కలకత్తా నగరాల సరసన విజయవాడను నిలుపుతామని సీఎం చంద్రబాబు అన్నారు.
అమెరికా గ్రాండ్‌ కానియన్‌ తరహాలో గండికోట మనకు ఉంది. గుజరాత్‌ లోని కచ్‌ తరహాలో కొన్ని ప్రాంతాల్లో పర్యాటకం పెంచుతాం. పీపీపీ విధానం లో ప్రాజెక్టులు చేపట్టేందుకు నిర్ణయం తీసుకున్నాం. 2027 నాటికి బెస్ట్‌ టూరిజం హబ్‌ గా ఏపీ నీ తీర్చి దిద్దుతాం. గతంలో మన గ్రామాల్లో ప్రణాళికా బద్దం గా నివాసాలు ఉండేవి. మండువా లోగిళ్ళు , ఆలయాలు, నదీ తీరాలు, కొండలు, సముద్ర తీరాలు ఇలా లెక్కలేనన్ని పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. మన దగ్గర ప్రాంతానికి ఓ రుచికరమైన వంటలు, ఆహారం ఉంది. వీటిని కూడా ఓ పర్యటక థీమ్‌ గా ప్రాజెక్టులు తీసుకురావచ్చు.
మన వద్ద పండించే అరకు కాఫీ రుచి అమోఘం. కోనసీమ లో వాడపల్లి ఆలయం ఇప్పుడు ప్రసిద్ధి చెందింది. ఏపీ టూరిజానికి బెస్ట్‌ డెస్టినేషన్‌ అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఆరోగ్య వంతమైన జీవనానికి మన ఏపీలో ను హీలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేసి హెల్త్‌ టూరిజం ప్రాజెక్టులు ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంది. రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయి. ఏపీ లో ఉన్న వారసత్వ సంపదను కూడా పెద్ద ఎత్తున ప్రమోట్‌ చేసుకోవాలి. కూచిపూడి, థింసా లాంటి సాంప్రదాయ నృత్యాలు స్వర్ణాంధ్ర సాధనకు టూరిజం ప్రధానమని, ప్రస్తుతం 8 శాతం వద్ధి ఉన్న టూరిజం ను 20 శాతానికి తీసుకెళ్లాలని అన్నారు.
Read More
Next Story