Allu Arjun Happy|నేను హ్యపీగానే ఉన్నాను
x

Allu Arjun Happy|నేను హ్యపీగానే ఉన్నాను

ఇంటిదగ్గర వెయిట్ చేస్తున్న మీడియాతో కొద్దిసేపు మాట్లాడిన సందర్భంగా తన అభిమానులను ఉద్దేశించి ‘నేను హ్యాపీగానే ఉన్నాను’ ఎవరూ ఆందోళనపడద్దని అల్లు అర్జున్(Allu Arjun) విజ్ఞప్తిచేశాడు


నేను హ్యాపీగానే ఉన్నాను...ఇది జైలునుండి విడుదలైన అల్లు అర్జున చేసిన వ్యాఖ్య. జైలునుండి శనివారం ఉదయం సుమారు 7 గంటల ప్రాంతంలో బయటకు వచ్చిన అర్జున్ నేరుగా గీతా ఆర్ట్స్ ఆఫీసుకు వెళ్ళారు. అక్కడ కొంతసేపు గడిచి అక్కడినుండి తనింటికి చేరుకున్నారు. ఇదేసమయంలో ఇంటిదగ్గర వెయిట్ చేస్తున్న మీడియాతో కొద్దిసేపు మాట్లాడిన సందర్భంగా తన అభిమానులను ఉద్దేశించి ‘నేను హ్యాపీగానే ఉన్నాను’ ఎవరూ ఆందోళనపడద్దని అల్లు అర్జున్(Allu Arjun) విజ్ఞప్తిచేశాడు. పుష్ప-2(Pushpa Movie) సినిమా థియేటర్ తొక్కిసలాటలో (Stampeding) జరిగినది నిజంగా దురదృష్టకర సంఘటనగా అభివర్ణించారు.

20 ఏళ్ళుగా తానునటించిన సినిమాలను థియేటర్ కు వెళ్ళి చూస్తున్నా ఎప్పుడూ ఇలాంటి ఘటన జరగలేదన్నారు. సంధ్యా థియేటర్ తొక్కిసలాటలో మహిళ చనిపోవటం(Woman Killed) నిజంగా దురదృష్టకరమని ఆవేధనతో చెప్పారు. చనిపోయిన మహిళను వెనక్కు తీసుకురాలేము కాని బాధపడుతున్న కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తంచేశారు. నష్టపోయిన ఆ కుటుంబాన్ని ఆదుకుంటానని కూడా ప్రకటించారు. కష్టకాలంలో తనకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ అల్లు అర్జున్ ధన్యవాదాలు చెప్పారు.

Read More
Next Story