అత్తతో అక్రమ సంబంధం, అల్లుణ్ణి హత్య చేయించిన మామ!
x

అత్తతో అక్రమ సంబంధం, అల్లుణ్ణి హత్య చేయించిన మామ!

శ్రీసత్యసాయి జిల్లా ముదిగుబ్బలో జరిగిన మర్డర్ కేసు గుట్టు వీడింది. ఓ మనిషిని రెండు ముక్కలుగా నరికి చెల్లాచెదరు చేసిన ఈకేసును ముదిగుబ్బ పోలీసులు ఛేదించారు.


శ్రీసత్యసాయి జిల్లా ముదిగుబ్బలో జరిగిన మర్డర్ కేసు గుట్టు వీడింది. ఓ మనిషిని రెండు ముక్కలుగా నరికి చెల్లాచెదరు చేసిన ఈకేసును ముదిగుబ్బ పోలీసులు ఛేదించారు. తనకల్లు మండలం యర్రగుంటపల్లికి చెందిన విశ్వనాథ్‌ హత్య కేసులో ఐదుగురు నిందితులను ముదిగుబ్బ పోలీసులు అరెస్ట్‌ చేశారు. రూ.4 లక్షలకు సుపారీ ఇచ్చి అల్లుడిని మామే హత్య చేయించినట్లు ధర్మవరం డీఎస్పీ హేమంత్‌కుమార్, ముదిగుబ్బ అప్‌గ్రేడ్‌ స్టేషన్‌ సీఐ శివరాముడు చెప్పారు.
అసలేం జరిగిందంటే...
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్లచెరువు మండలంలోని టి.ఎర్రగుంటపల్లికి చెందిన విశ్వనాథ్‌.. ఓబుల దేవరచెరువు మండలంలోని గాజుకుంటపల్లిలో వివాహం చేసుకున్నాడు. బైపాస్‌ దగ్గర అటవీ ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తులు అతడిని దారుణంగా హతమార్చారు. తల, మొండెం వేరు చేశారు. ఈ హత్యను చేయించింది పిల్లనిచ్చిన మామేనని తేలింది.

పోలీసులు చెప్పిన కథనం ప్రకారం... విశ్వనాథ్‌ తన అత్త, మరదలితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. మామకు ఈ విషయం తెలిసింది. అల్లుడి ఆగడాలకు అరికట్టాలనుకున్నా అత్త మద్దతు ఉండడంతో అది కుదరలేదు. అయితే అత్తకు చెందిన నాలుగు ఎకరాల పొలంలో రెండు ఎకరాలు అమ్మేశాడు. దీనిపై వివాదం నడుస్తున్న సమయంలోనే మిగిలిన రెండు ఎకరాలు విక్రయించేందుకు ఒప్పందం కుదుర్చుకొని, స్థిరాస్తి వ్యాపారుల నుంచి డబ్బు తీసుకున్నాడు.
కుమారులకు ఆస్తిలో భాగం ఇవ్వకుండా అమ్మడమేమిటని విశ్వనాథ్‌ను మామ వెంకటరమణప్ప ప్రశ్నించాడు. దీనిపై మాటా మాటా పెరిగి ఇద్దరూ ఒకర్నొకరు నిందించుకున్నారు. అల్లుడు తనను తీవ్రంగా అనుమానించాడని భావించిన మామ వెంకటరమణప్ప-- తన కుటుంబానికి అల్లుడు అడ్డుగా ఉన్నాడని, ఎలాగైనా తప్పించాలని కుట్ర పన్నాడు.
తన స్నేహితుడు, గరిశనపల్లికి చెందిన కాటమయ్య ద్వారా ముంకముతక శంకర్‌ మధ్యవర్తిత్వంతో విశ్వనాథ్‌ను హతమార్చేందుకు రూ.4 లక్షలు సుపారీ ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నాడు. రూ.50 వేలు అడ్వాన్స్‌ ఇచ్చాడు.
జూలై 1న టమాటా పంట డబ్బు రూ.50 వేలు ఇస్తానని చెప్పి విశ్వనాథ్‌ను కాటమయ్య ముదిగుబ్బకు రప్పించాడు. కాటమయ్య, రామకృష్ణ, మధుబాబు కలిసి విశ్వనాథ్‌ను వేటకొడవళ్లతో నరికి తల, మొండెం వేరు చేసి పడేశారు. మూడు రోజుల పాటు ఎవ్వరికీ తెలియకుండా పోయింది. ఆ తర్వాత మొండెం బయటపడడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. వెంకటరమణప్పతోపాటు బత్తలపల్లి మండలం గరిశనపల్లికి చెందిన కమతం కాటమయ్య, ఎర్రాయపల్లికి చెందిన కమతం రామకృష్ణ, సాకే మధుబాబు, ఓబుళదేవరచెరువు మండలం శెట్టివారిపల్లికి చెందిన మంకముతక శంకర్‌ను రాళ్లఅనంతపురం క్రాస్‌ వద్ద పోలీసులు అరెస్ట్‌ చేశారు. వారి నుంచి మూడు వేటకొడవళ్లు, ఒక ఆటో స్వాధీనం చేసుకున్నారు. నిందితులను కదిరి కోర్టులో హాజరుపరిచారు.
Read More
Next Story