మంచి మేనేజ్‌మెంటే అయితే 8 మంది ఎందుకు చనిపోయారు బాబూ
x

మంచి మేనేజ్‌మెంటే అయితే 8 మంది ఎందుకు చనిపోయారు బాబూ

మొంథా తుపాను నిర్వహణపై చంద్రబాబువి 'పిట్టలదొర మాటలు, అంటూ జగన్ తీవ్ర విమర్శలు గుప్పించారు.


ఆంధ్రప్రదేశ్‌లో మొంథా తుపాను దెబ్బకు రైతులు తీవ్ర నష్టపోయిన నేపథ్యంలో, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాను 'గొప్ప మేనేజ్‌మెంట్' చేశానని చెప్పుకోవడం పిట్టలదొర మాటల్లా ఉన్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర ఎద్దేవా చేశారు. "మీకు మీరు చెప్పుకునే గొప్పలు పిట్టలదొర మాటల్లా ఉన్నాయని, ఉచిత పంటల బీమా, ఇ-క్రాప్ వంటి పథకాలను రద్దు చేసి రైతులను వదిలేసిన మీ పాలన మానవ నిర్మిత విపత్తు" అంటూ జగన్ తన' X 'ఖాతాలో పోస్ట్ చేశారు. మొంథా తుపానులో సంభవించిన 8 మంది మరణాలకు కూడా చంద్రబాబు బాధ్యత వహించాలని ఆరోపించారు.

తమ ప్రభుత్వంలో 84.8 లక్షల మంది రైతులు ఉచిత బీమా పరిధిలో ఉండి, 54.55 లక్షల మందికి రూ.7,802 కోట్లు నష్ట పరిహారం అందాయి. మీరు అధికారంలోకి రాగానే రద్దు చేసి, ఇప్పుడు ప్రీమియం కట్టుకునే 19 లక్షల మంది మాత్రమే మిగిలారు. మోంథా తుపానులో 15 లక్షల ఎకరాల పంటలు నాశనం అయ్యాయి.. ఇప్పుడు రైతుల దిక్కు ఎవరు? అని సీఎం చంద్రబాబును ప్రశ్నించారు. ఇ-క్రాప్ వ్యవస్థ, ఆర్‌బీకేలు, రైతు భరోసా స్కీమ్‌ను రద్దు చేశారు. అన్నదాత సుఖీభవలో రూ.20,000 చొప్పున ఇవ్వాల్సి ఉండగా, కేవలం రూ.5,000 మాత్రమే ఇచ్చారు. 18 నెలల్లో 16 సార్లు విపత్తులు జరిగి, రూ.600 కోట్లు ఇన్‌పుట్ సబ్సిడీ బకాయిలు పెట్టారు.. ఒక్క పైసా పంట నష్ట పరిహారం ఇవ్వలేదు. అని ధ్వజమెత్తారు.

మీది మంచి మేనేజ్‌మెంట్ అయితే 8 మంది ఎందుకు చనిపోయారు? ఇది ముమ్మాటికీ 'అబద్ధాలు, ఫొటోషూట్లు, పబ్లిసిటీ' మాత్రమే అని జగన్ పేర్కొన్నారు. జగన్ తమ ప్రభుత్వ హయాంలో దేశంలోనే తొలిసారిగా ఆర్‌బీకేలు, ఇ-క్రాప్, ధరల స్థిరీకరణ నిధి (రూ.3,000 కోట్లు) వంటి విప్లవాత్మక చర్యలు తీసుకున్నామని, అవి రైతులకు 'శ్రీరామ రక్ష'లా ఉన్నాయని గుర్తు చేశారు. "ప్లానింగ్ అంటే ఇదే.. మీరు చేసింది మాత్రం పథకాలు నాశనం" అని ఆరోపించారు.


Read More
Next Story