తప్పు చేస్తే చంద్రబాబు నన్నూ జైలుకు పంపుతారు
x

తప్పు చేస్తే చంద్రబాబు నన్నూ జైలుకు పంపుతారు

2029 తర్వాత కూడా ఎన్డీఏ కూటమితో తమ పొత్తు కొనసాగుతుందని మంత్రి లోకేష్‌ చెప్పారు.


ఆంధ్రప్రదేశ్‌లో ఎలాంటి ప్రతీ కార చర్యలకు తాము పాల్పడటం లేదని ఒక వేళ తాను చట్టాన్ని ఉల్లంఘించి తప్పు చేస్తే తనను కూడా సీఎం చంద్రబాబు జైలుకు పంపేందుకు వెనుకాడరని మంత్రి నారా లోకేష్‌ పేర్కొన్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం మాజీ సీఎం జగన్‌ మీద, వైసీపీ శ్రేణుల మీద, అధికారుల మీద కక్షపూర్తి రాజకీయాలు చేయడం లేదన్నారు. ప్రస్తుతం తమిళనాడు పర్యటనలో ఉన్న ఆయన కోయంబత్తూరులో ఇండియా టుడే నిర్వహించిన సౌత్‌ కాంక్లేవ్‌లో మంత్రి నారా లోకేష్‌ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన బిల్లును సమర్థిస్తున్నట్లు చెప్పారు. భారత దేశంలో క్లీన్‌ పాలిటిక్స్‌ చాలా అవసరమన్నారు. రాజకీయ నాయకులకు సంబందించిన కేసుల్లో ఏడాది లోపు తీర్పులు వెలువడాలన్నారు. కానీ మన దేశంలో అలా జరగడం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లు మిస్‌ యూజ్‌ కాదనే నమ్మకం తనకుందన్నారు.

మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన జాతీ విద్యా విధానాన్ని తాను సమర్థిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ నూతన విద్యా విధానంలో మూడు భాషలు నేర్చుకోవాలని చెబుతున్నప్పటికీ ఎక్కడా కూడా హిందీ భాష తప్పనిసరి అని కేంద్రం చెప్పలేదన్నారు. ఒక భారతీయుడిగా మాతృ భాష ప్రాముఖ్యత తనకు తెలుసని, అంతేకాకుండా హిందీ నేర్చుకోవడం ఎంత ముఖ్యమో కూడా తనకు తెలుసని మంత్రి లోకేష్‌ అన్నారు. తాను మూడు భాషలు నేర్చుకున్నట్లు లోకేష్‌ చెప్పారు. తన కుమారుడు దేవాంశ్‌ కూడా అదే పని చేస్తున్నట్లు చెప్పారు. విదేశీ భాషలు నేర్చుకుంటే ఆయా దేశాల్లో ఉద్యోగాలు చేసుకునేందుకు ఎంతో ఉపయోగపడుతాయన్నారు. ఉత్తరాది భాషలు దక్షిణాది ప్రజలు ఎందుకు నేర్చుకోకూడన్నారు. ఆంధ్రప్రదేశ్‌ సరిహద్దు ప్రాంతాల్లో ఏపీకి పొరుగు రాష్ట్రాలైన ఒడియా, తమిళం, కన్నడ మాధ్యమాల్లో పాఠ్యాంలు బోధించే విధంగా తమ ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వనున్నట్లు చెప్పారు. రాజకీయ నిర్ణయాల ఆధారంగా కాకుండా పిల్లలు వాళ్లే భాషలు నేర్చుకోవాలని కోరుకుంటారో ఆ ప్రకారమే నేర్చుకోవాలన్నారు. ఎన్డీఏ కూటమితో తెలుగుదేశం పార్టీ పొత్తు గురించి మాట్లాడుతూ.. 2029 తర్వాత కూడా పొత్తు అలానే కొనసాగుతుందన్నారు. ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్‌కు మద్దతిస్తామన్నారు.
Read More
Next Story