‘మాట పైనే ఉంటా’.. పవన్ గెలుపుపై ముద్రగడ
x

‘మాట పైనే ఉంటా’.. పవన్ గెలుపుపై ముద్రగడ

పిఠాపురం నియోజకవర్గంలో జనసేనాని పవన్ కల్యాణ్ భారీ మెజార్టీతో విజయం సాధించారు. ఎవరూ ఊహించని రీతిలో 70వేలకు పైచిలుకు మెజారిటీని కైవసం చేసుకున్నారు.


పిఠాపురం నియోజకవర్గంలో జనసేనాని పవన్ కల్యాణ్ భారీ మెజార్టీతో విజయం సాధించారు. ఎవరూ ఊహించని రీతిలో 70వేలకు పైచిలుకు మెజారిటీని కైవసం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రచార సమయంలో కాపు ఉద్యమ నేత, వైసీపీ నాయకుడు ముద్రగడ పద్మనాభం చేసిన ఛాలెంజ్ వైరల్ అవుతోంది. ఆయన సవాల్ చేసినట్లు పేరు మార్చుకుంటారా అంటూ నెటిజన్లు నెట్టింట పోస్ట్‌ల వర్షం కురిపిస్తున్నారు. మరికొందరైతే మరో అడుగు ముందుకేసి ముద్రగడ నామకరణ వేడుకల ఆహ్వాన పత్రికను కూడా వైరల్ చేసేస్తున్నారు. ఈ క్రమంలోనే పిఠాపురంలో పవన్ కల్యాణ్ విజయంపై ముద్రగడ పద్మనాభం స్పందించారు.

అసలు ముద్రగడ ఏమన్నారంటే..

పిఠాపురంలో ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగింది. ఎలాగైనా పవన్‌ను ఓడించాలని భావించిన వైసీపీ పెద్దపెద్ద నేతలను పిఠాపురం రాజకీయ బరిలోకి దింపింది. పవన్‌కు ప్రత్యర్థిగా ఓటమెరుగని వంగా గీతను నిలపగా ఆమెకు తోడుగా ముద్రగడ పద్మనాభంను కూడా ఆమె విజయానికి సహకరించాలని పిఠాపురంకు పంపింది. నియోజకవర్గంలో పార్టీ ఎక్కడెక్కడ సమావేశాలు నిర్వహించాలి, ఎలాంటి సమావేశాలు నిర్వహించాలని అన్న బాధ్యలన్నింటినీ ముద్రగడకు అప్పగించింది. ఆ నేపథ్యంలోనే పిఠాపురంలో పవన్ కల్యాణ్ ఓటమి తథ్యమని ముద్రగడ ధీమా వ్యక్తం చేశారు. పవన్‌ను చిత్తు చేయకుంటే తన పేరు మార్చుకుంటానని కూడా బహిరంగ ఛాలెంజ్ చేశారు.

మాట తప్పను.. పేరు మార్చుకుంటా: ముద్రగడ

అన్న మాట ప్రకారమే తన పేరును మార్చుకుంటానని ముద్రగడ వెల్లడించారు. ‘‘నా పేరు మార్చుకోవడానికి గెజిల్ పేపర్లు కూడా రేడీ చేశాం. నా పేరు పద్మనాభ రెడ్డి మార్చుకుంటా. రెండు మూడు రోజుల్లో దరఖాస్తు చేయబోతున్నాం. పేరు మారిన తర్వాత అన్ని వివరాలు వెల్లడిస్తాం. కాబట్టి ఇక నన్న ఉప్మా పద్మనాభం అంటూ పద పదే ట్రోల్ చేయడం కరెక్ట్ కాదు. ఇంటికి వచ్చిన వారికి టిఫిన్ పెట్టి మర్యాద చేయడంలో తప్పేమీ లేదు. అందుకని నన్ను ఉప్మా పద్మనాభం అనడం సమంజసం కాదు. అతిథులకు మర్యాద చేయడం మా తాతల కాలం నుంచి వస్తున్న ఆనవాయితీ’’ అని చెప్పారు.

అర్థం కావట్లేదు

రాష్ట్రంలో వైసీపీ ఓటమిపై ముద్రగడ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రజలకు సంక్షేమం అందించిన సీఎం జగన్ ఒక్కరేనన్నారు. ఇలాంటి సాహం దేశంలో ఏ సీఎం కూడా చేయలేదని, కానీ ప్రజలకు ఆయనకు ఎందుకు ఓట్లు వేయలేదో తనకు అర్థం కావట్లేదని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ప్రజల ఫోకస్ సంక్షేమం కన్నా అభివృద్ధిపై ఉందా? లేకుంటే వైసీపీకి మించి కూటమి సంక్షేమాన్ని ఆఫర్ చేయడంతో అటువైపు మొగ్గు చూపారా? ఏంటో తెలియడం లేదన్నారు. సంక్షేమానికి ప్రజలు ఓటేయకుంటే రానున్న రోజుల్లే ఏ సీఎం కూడా ప్రజల సంక్షేమాన్ని పట్టించుకోరని, అప్పుడు బాధలు పడేది వారే అని ప్రజలు అర్థం చేసుకోవాలని కోరారు.

Read More
Next Story