
నేనూ పోరాటాల్లో పాల్గొంటా..బరితెగిస్తే ఊరుకోం
తాము అధికారంలోకి వస్తే అన్నింటినీ రద్దు చేస్తామని జగన్ హెచ్చరించారు.
మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణపై అన్ని రకాలగా పోరాటాలు చేస్తామని, తాను కూడా పోరాటాల్లో పాల్గొంటానని, రాష్ట్ర శ్రేయస్సును కోరే ప్రతి ఒక్కరు ఈ పోరాటాల్లో భాగస్వాములు కావాలని, బరి తెగిస్తే ఊరుకోమని, ఎవరు టెండర్లులలో పాల్గొంటారో పాల్గొనండి, మేం చూస్తాం, మేం అధికారంలోకి వచ్చాక అన్నింటిని రద్దు చేస్తాం, గుర్తు పెట్టుకోండి అంటూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హెచ్చరికలు జారీ చేశారు. బుధవారం ఆయన తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో మాట్లాడుతూ పోలీసుల చేతే కూటమి ప్రభుత్వం రిగ్గింగ్ చేయిస్తోందని ఆరోపించారు. అలాంటప్పుడు ఈవీఎంలు ఉంటే ఏంటి? పేపర్ బ్యాలెట్ పెడితే ఏంటని ప్రశ్నించారు. కేంద్ర బలగాలు వస్తేనే ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరుగుతాయని, సాధారణ ఎన్నికలప్పుడు సరైన నిర్ణయం తీసుకోవాలని అంటూ జగన్ మాట్లాడారు.
అసెంబ్లీ సమావేశాలలో ఇంత సేపు మాట్లాడేందుకు సమయం ఇవ్వరని, ప్రధాన ప్రతిపక్ష హోదోతోనే అంత సమయం మాట్లాడేంత వెసులు బాటు ఉంటుందని, కానీ వైసీపీకి ప్రతిపక్ష హొదా అంశం ఇంకా హైకోర్టులో పెండింగ్‌లోనే ఉందన్నారు. అసెంబ్లీలో ఉన్నది ఒకే ఒక్క ప్రతిపక్ష పార్టీ వైఎస్‌ఆర్‌కాంగ్రెస్ పార్టీనే, అలాంటిది తమ పార్టీని కూటమి ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీగా గుర్తించడం లేదు, అసెంబ్లీలో మాట్లాడేందుకు సమయం ఇవ్వడం లేదు, ఆ సమయంలో ప్రజా సమస్యలపై ఏమి మాట్లాడుతామని జగన్ ప్రశ్నించారు. ప్రతిప„ý నేత హోదా ఇస్తే సభాధ్యక్షుడితో సమానంగా సభలో సమయం కేటాయించాల్సి ఉంటుందని, అందువల్లే తమకు ప్రతిపక్ష హోదా కూటమి ప్రభుత్వం ఇవ్వడం లేదని మండిపడ్డారు. గతంలో చంద్రబాబు ఎన్ని రోజులు సభకు వచ్చారని నిలదీశారు.
Next Story