
రేపు నేను ఏపీలో ఉంటా..తెలుగులో మోదీ ట్వీట్
ప్రధాని మోదీ రేపు ఉమ్మడి కర్నూలు జిల్లా పర్యటనకు రానున్నారు.
ప్రధాన మంత్రులు ఏ రాష్ట్ర పర్యటనకు వెళ్తే ఆ రాష్ట్ర స్థానిక భాషలో ప్రజలను పలకరించడం, తన ప్రసంగంలో స్థానిక భాషలో నమస్కారాలు చెప్పడం సహజం. ప్రస్తుత ప్రధాని మోదీ కూడా అదే చేస్తుంటారు. అయితే ట్వీట్లు మాత్రం ఇంగ్లీషులో చేస్తుంటారు. అయితే ఈ సారి మాత్రం ప్రధాని మోదీ తన స్టైల్‌ను ప్రదర్శించారు. గురువారం ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వస్తున్న నేపథ్యంలో పూర్తిగా తెలుగులో ట్వీట్ చేసి అందరిని ఆశ్చర్యానికి గురి చేశారు. ప్రధాని మోదీ తెలుగులో చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్‌గా మారింది.
మోదీ ఏమని ట్వీట్ చేశారంటే..
రేపు, అక్టోబరు 16న నేను ఆంధ్రప్రదేశ్‌లో ఉంటాను. శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్ల దేవస్థానంలో ప్రార్థనలు చేస్తారు. ఆ తర్వాత కర్నూలులో 13,400 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి పనుల శంకుస్థాపనలు లేదా ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటాను. ఈ పనులు విద్యుత్ రైల్వేలు, పెట్రోలియం, రక్షణ పరిశ్రమలతోపాటు మరిన్ని రంగాలకు సంబంధించినవి. అంటూ ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.
రేపు, అక్టోబర్ 16న నేను ఆంధ్రప్రదేశ్‌లో ఉంటాను. శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్ల దేవస్థానంలో ప్రార్థనలు చేస్తాను. ఆ తర్వాత, కర్నూలు లో 13,400 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి పనుల శంకుస్థాపనలు లేదా ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటాను.ఈ పనులు విద్యుత్,…
— Narendra Modi (@narendramodi) October 15, 2025
Next Story