జీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యతో పాటు ఇటీవల జరిగిన టీడీపీ నేతల హత్యల మీద సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. రెండో రోజు కడపలో జరుగుతున్న మహానాడులో ఆయన మాట్లాడుతూ.. వైసీపీ మీద నిప్పులు చెరిగారు. సాధారణంగా నేను చాలా జాగ్రత్తగా ఉంటాను. అన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటాను. అలాంటిది మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి మర్డర్ విషయంలో నాలాంటి నాయకుడ్నే మోసం చేయగలిగారు. గుండెపోటుతో వైఎస్ వివేకానందరెడ్డి మరణించారని తొలుత నేను కూడా నమ్మాను. అలా నమ్మే విధంగా వారు డ్రామాలాడారు. వారి అసాక్షి పేపరు, అసాక్షి టీవీలో పెద్ద ఎత్తున కథనాలు వల్లారు. అబద్దాలను ఎంత చాకచక్యంగా అల్లారు అంటే వారు ఎంత కరుడుగట్టిన నేరస్తులో అర్థం చేసుకోవాలి.
వైఎస్ వివేకానందరెడ్డి హత్య రాత్రి జరిగితే.. తెల్లవారేలోగా అన్నీ తారుమారు చేశారు. ఎప్పుడూ వినూత్నంగా ఆలోచనలు చేసే నేను అలా వారు తారుమారు చేసిన వాటిల్లో పడిపోయాను. ఎన్నికల బిజీలో ఉన్న నేను వివేకానందరెడ్డి మర్డర్ విషయంలో వినూత్నంగా ఆలోచనలు చేయలేక పోయాను, ఆ విధంగా దృష్టి పెట్టలేక పోయాను. వారు అల్లిన కల్లబొల్లి మాటలకు బోల్తా పడ్డాను.
అయితే అదేరోజు సాయంత్రానికి వివేకానందరెడ్డి హత్య అనేక మలుపులు మీద మలుపులు చోటు చేసుకున్నాయి. వివేకాది గుండెపోటు కాదని, గొడ్డలితో నరికి చంపారని, ఆ గొడ్డలి వేటుకు తలలోని చిన్న మెదడుకు కూడా బయటకు వచ్చి చిన్నా భిన్నమైపోయి ఆ రూమంతా రక్తం పడిఉందని వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. వాస్తవం అలా ఉంటే.. అలాంటి దానిని కడిగేసి, ఏమీ జరగనట్లు గుండెపోటుతో కర్తం కక్కుకొని వివేకానందరెడ్డి మరణించినట్లు , అలా వచ్చిన రక్తం గోడలంతా అంటుకున్నట్లు ఎన్నో కథలు అల్లారు. తర్వాత రోజు నారాసుర రక్త చరిత్ర అని నా మీద కథలు అల్లారు. నా చేతిలో ఒక కత్తి పెట్టిన బొమ్మ వేసి నా మీదే నెపం వేశారు. వవేకానందరెడ్డిని అత్యంత క్రూరంగా చంపేసి, గుండెపోటుతో చినిపోయినట్లు చెప్పగలిగారంటే వారు ఎంత కరుడు కట్టిన నేరస్తులో అందరికీ అర్థమవుతుంది. అలాంటి కరుడు కట్టిన నేరస్తులతో మనం పోరాటం చేస్తున్న విషయం ప్రతి టీడీపీ కార్యకర్త గుర్తు పెట్టుకోవాలన్నారు.
ఇటీవల జరిగిన వీరయ్య చౌదరి హ్యతతో పాటు మరి కొని హత్యలు ఎలా జరిగాయనే దానిపైన ఆలోచనలు చేశాను. ఎవరు ఈ హత్యలు చేసి ఉంటారనేదానిపై దృష్టి పెట్టాను. మన పార్టీలో మనకు నమ్మకంగా ఉన్నట్లు నటిస్తూ.. వైసీపీ వాళ్లకు పని చేస్తూ, వాళ్ల ప్రోత్సాహంతో హత్యలకు పాల్పడుతూ హత్యా రాజకీయాలు చేస్తున్నారు. మన వేళ్లతో మన కళ్లు పొడుచుకునే విధంగా వైసీపీ వాళ్లు వ్యవహరిస్తున్నారు. చివరికి టీడీపీ వాళ్లే, టీడీపీ వాళ్లను చంపుకుంటున్నారని ప్రచారం చేస్తూ, టీడీపీకి చెడ్డపేరు వచ్చే విధంగా చేస్తున్నారు. ఇవి వైసీపీ నేరస్తులు చేస్తున్న కనికట్టు మాయ. ఇలాంటి తప్పుడు పనులు చేసే టీడీపీ కార్యకర్తలను ఉపేక్షించేది లేదని చంద్రబాబు టీడీపీ శ్రేణులకు హెచ్చరికలు జారీ చేశారు.