రాజకీయాల్లోకి వస్తే ఐఏఎస్‌లను కంట్రోల్ చేయొచ్చని ఆలోచించా
x

రాజకీయాల్లోకి వస్తే ఐఏఎస్‌లను కంట్రోల్ చేయొచ్చని ఆలోచించా

నేను యూనివర్సిటీలో చదువుకునేటప్పుడు కూడా ప్రజాప్రతినిధి అవ్వాలని కోరుకున్నాను అని సీఎం చంద్రబాబు అన్నారు.


రాజకీయాల్లోకి వస్తే ఐఏఎస్‌లను కంట్రోల్ చేయొచ్చని ఆలోచించా.. అది విజన్ అంటే అని సీఎం చంద్రబాబు అన్నారు. సంవిధాన్ దివస్ సంర్భంగా ఏపీ అసెంబ్లీలో బుధవార రాజ్యాంగ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా అసెంబ్లీ ప్రాంగణంలో విద్యార్థులతో నిర్వహించిన మాక్ అసెంబ్లీని ముఖ్యమంత్రి చంద్రబాబు తిలకించారు. అనంతరం రాజ్యాంగ దినోత్సవాన్ని ఉద్దేశించి ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ.... ఐఏఎస్ అవ్వాలంటే ఎంతో ప్రిపేర్ అవ్వాలి. అదే నేను రాజకీయాల్లోకి వస్తే ఐఏఎస్‌లను కంట్రోల్ చేయవచ్చని ఆలోచించాను. అందుకే రాజకీయాల్లోకి వచ్చాను. 28 ఏళ్లకే నేను ఎమ్మెల్యే అయ్యాను. నేను యూనివర్సిటీలో చదువుకునేటప్పుడు కూడా ప్రజాప్రతినిధి అవ్వాలని కోరుకున్నాను. మా వైస్ ఛాన్సలర్ పిలిచి లెక్చరర్ గా చేరాలని అడిగితే...లెక్చరర్‌గా రాను ఎమ్మెల్యే అవుతానని చెప్పాను. 1978లో పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచి కనబడతానని చెప్పి గెలిచి చూపించాను. నిరంతరం శ్రమ చేయాలి. ప్రతి ఒక్కరికీ సంక్షోభాలు వస్తాయి...వాటిని ధైర్యంగా ఎదుర్కోవాలి. సరైన నిర్ణయం తీసుకుని ముందుకెళ్లాలి. అందువల్లే నేను 9 సార్లు ఎమ్మెల్యే అయ్యాను. 30 ఏళ్లకే నేను మంత్రి అయ్యాను..40 ఏళ్లకు సీఎం అయ్యాను. అని చంద్రబాబు తన నేపథ్యాన్ని వివరించారు.

విద్యార్థులు మాక్ అసెంబ్లీ నిర్వహించిన తీరు చాలా అభినందనీయం. 175 నియోజవకర్గాల నుంచి ఎంపికై మాక్ అసెంబ్లీకి వచ్చి నియోజకవర్గం తరపున ప్రాతినిధ్యం వహించినందుకు సంతోషంగా ఉంది. స్టూడెంట్స్ మాక్ అసెంబ్లీని అదరగొట్టారు...చాలా బాగా రాణించారు. అసెంబ్లీ ఆదర్శంగా ఉండాలని నేను ఎప్పుడూ కోరుకుంటాను. విద్యార్థులు తక్కువ సమయంలోనే ఏ విధంగా ప్రవర్తించాలో అనుసరించి వండర్ ఫుల్ గా వ్యవహరించారు. ప్రతి ఒక్కరిలో బాధ్యత, చైతన్యం రావడానికి సంవిధాన్ దివస్ ప్రోగ్రామ్ నిర్వహిస్తున్నాం. మన కోసం మనం భారత రాజ్యాంగాన్ని రాసుకున్నాం అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

స్పీకర్ అయ్యన్నపాత్రుడు 7 సార్లు ఎమ్మెల్యే, ఒకసారి ఎంపీ అయ్యారు. నా కంటే చిన్న వయసులోనే మీరు మాక్ అసెంబ్లీకి వచ్చి సమర్థవంతంగా నిర్వహించారు. మా ఎమ్మెల్యేలు తడబడ్డా...మీరు మాత్రం తడబడలేదు. మీ కాన్ఫిడెన్స్‌కు అభినందనలు. అసెంబ్లీని మరిపించేలా సెటప్ వేసి మీ అందిరినీ ఎమ్మెల్యేలుగా చూస్తున్నాం. బాధ్యతను గుర్తుపెట్టుకోవడానికి ఈ మాక్ అసెంబ్లీ నిర్వహించుకున్నాం. రాజ్యాంగాన్ని అంబేద్కర్ అద్భుతంగా తీర్చిదిద్దారు. అంబేద్కర్ ఎప్పుడూ ప్రజల గుండెల్లో ఉంటారు. దేశానికి ఆత్మగా భారత రాజ్యాంగం నిలిచింది. 1949 నవంబర్ 26న ఆమోదం పొందింది. 2 ఏళ్ల 11 నెలల 18 రోజుల పాటు సుధీర్ఘంగా చర్చించి రాజ్యాంగాన్ని రూపొంచింది ఆమోదించుకున్నామని పేర్కొన్నారు.
అనేక ఒడిదుడుకులు వచ్చాయి. ఎమర్జెన్సీని కూడా ఎదుర్కొన్నాం. అయినా రాజ్యాంగం మనుగడ సాధించడం వెనక కారణం రాసిన విధానం. రాజ్యాంగం గురించి ప్రతి ఒక్కరికీ చెప్పాల్సిన అవసరం ఉంది. రాజ్యాంగం ఎంత గొప్పదైనా దాన్ని అమలు చేసే వారు మంచి వారు కాకపోతే చెడుఫలితాలను ఇస్తుంది. రాజ్యాంగం అమలు చేసే వారు మంచి వారైతే చెడు రాజ్యాంగమైనా మంచి ఫలితాలు ఇస్తుందని అంబేద్కర్ స్పష్టంగా చెప్పారు. నేను మీ అందరికీ ఆయుధాన్ని ఇస్తున్నాను. అది ఓటు అని చెప్పారు. భారతదేశంలో ప్రతి ఒక్కరికీ ఓటు అవకాశం కల్పించిన రాజ్యాంగం భారత రాజ్యాంగం. .18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ మన దేశంలో ఓటు హక్కు ఉంటుంది. కొన్ని దేశాల్లో బలహీన వర్గాలకు ఓటు అవకాశం లేదు. పోరాడి తెచ్చుకున్నారు. మరి కొన్ని దేశాల్లో మహిళలు ఓటుకోసం పోరాడారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ పార్లమెంట్లో మొన్నే బిల్లు కూడా పాస్ అయింది. అమెరికాలో ఒక మహిళ ఆ దేశ అధ్యక్షురాలు కాలేకపోయింది. కానీ భారతదేశంలో మహిళ ప్రధాని అయ్యారు. ఓటు హక్కు మనకు వజ్రాయుధం. మన భవిష్యత్ కు మనం రూపకల్పన చేసుకోవచ్చు. ఒక ఛాయ్ వాలా దేశానికి ప్రధాని అయి, దేశ దిశ మార్చారంటే అది రాజ్యాంగం మనకు ఇచ్చిన గొప్ప వరం అని కొనియాడారు.
సాధారణ వ్యక్తి అయిన అబ్దుల్ కలాం రాష్ట్రపతి అయ్యారు.. భారత రత్న పొందారు. పవర్ ఫుల్ రాష్ట్రపతిగా వ్యవహరించారు. ద్రౌపది ముర్ము... గిరిజన మహిళ ప్రస్తుతం రాష్ట్రపతి అయ్యారు. నేను కూడా సాధారణ కుంటుంబలో పుట్టి 4వసారి సీఎం అయ్యానంటే అది రాజ్యాంగం కల్పించిన అవకాశం. రాజ్యాంగం హక్కులే కాదు... విధులు కూడా ఇచ్చింది. చాలా మంది హక్కుల కోసం పోరాడతారు..కానీ విధులను గురించి పట్టించుకోరు. దేశంలో ఏ ఒక్కరూ రాజ్యాంగం కంటే గొప్పవారు కాదు. రాజ్యాంగ స్వరూపం చాలా గొప్పది. పార్లమెంట్, శాసన సభలు చట్టాలు చేస్తాయి. వ్యక్తిగత ప్రయోజనాల కోసం సభకు రాకూడదు. సమాజ హితం కోసం ప్రజాప్రతినిధులుగా రావాలి. వ్యక్తిగత కక్షల కోసం పోరాడాల్సిన అవసరం లేదు అని పేర్కొన్నారు.
ఏ దేశానికైనా పబ్లిక్ పాలసీలు అవసరం. 1990లో ఐటీ రెవల్యూషన్ తీసుకొచ్చాం. ఇంజనీరింగ్ కాలేజీలు తీసుకొచ్చాం. జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ పెట్టాం. నాలెడ్జ్ ఎకనామీలో తెచ్చిన ఒకేఒక్క ఐటీ పాలసీ వల్ల తలసరి ఆదాయం పెరిగింది. వందల దేశాల్లో ఉద్యోగాలు పొందుతున్నారు. విదేశీయుల కంటే తలసరి ఆదాయం అధికంగా పొందుతున్నారు. విద్యా, ఉద్యోగాల్లో 33 శాతం ఆడపిల్లకు రిజర్వేషన్లు తీసుకొచ్చాం. మగవారికంటే ఆడపిల్లలు ఇప్పుడు ఎక్కువ జీతం సంపాదిస్తున్నారు. ఆడపిల్లల్లో కూడా ధైర్యం ఉండాలి. మహిళ పట్ల అవహేళనగా మాట్లాడితే ఎదర్కోవాలి. వెంటాడితే భయపడతారు. ఆడపిల్లలాగా ఏడుస్తున్నావు, గాజులు తొడుక్కుని లేం అని అంటుంటారు. ఇవన్నీ పోవాలి. ఆర్టీసీ కండర్లగానూ మహిళలకు అవకాశం కల్పించాం. ఆకాశమే హద్దుగా ఆడపిల్లలు ఎదగాలి అని సీఎం చంద్రబాబు చెప్పారు.
Read More
Next Story