గత ఐదేళ్లల్లో నేనే మాట్లాడలేక పోయా:సీఎం చంద్రబాబు
x

గత ఐదేళ్లల్లో నేనే మాట్లాడలేక పోయా:సీఎం చంద్రబాబు

గత ప్రభుత్వం చేసిన అన్యాయాలు, అక్రమాలపైన తానే ఏమీ మాట్లాడలేని భయానక వాతావరణం సృష్టించారని సీఎం చంద్రబాబు ధ్వజమెత్తారు.


ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైఎస్‌ జగన్‌ మీద, ఆయన ప్రభుత్వం మీద మరో సారి ధ్వజమెత్తారు. ఇసుక గురించి ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ఇసుక మీద అనేక అక్రమాలు చేశారని మండిపడ్డారు. రీచ్‌ల వద్దకు ఎవ్వరు వెళ్లలేని భయానక వాతావరణం సృష్టించారని విమర్శించారు. ఎవ్వరూ కూడా దీనిని ప్రశ్నించలేని పరిస్థితులు వైఎస్‌ఆర్‌సీపీ వాళ్లు క్రియేట్‌ చేశారని ధ్వజమెత్తారు. ఒక వేళ మాట్లాడితే ఏమి చేస్తారో అనే భయాందోళనలు రాష్ట్ర వ్యాప్తంగా సృష్టించారని అన్నారు. మూడు సార్లు ముఖ్యమంత్రిగా పని చేసిన తానే వాటి గురించి మాట్లాడలేక పోయానని, ఇక సామాన్యులు ఇతర నాయకులు మాట్లాడే సాహసం ఎలా చేస్తారని అన్నారు. రాష్ట్ర పాలన గురించి కానీ, సమస్యల గురించి కానీ మాట్లాడే పరిస్థితులు, ప్రశ్నించే వాతావరణం గత ప్రభుత్వంలో ఎక్కడున్నాయని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యాన్ని జగన్‌ ఖూనీ చేశారని మండిపడ్డారు. ఇసుక మీద పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడిన వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు ఇప్పుడు నీతులు చెబుతున్నారని మండిపడ్డారు.


Read More
Next Story