
నా రాజకీయ గురువును కడసారి చూడలేకపోయాను
కన్నుమూసిన సీపీఐ సీనియర్ నాయకుడు బొప్పూడి స్టాలిన్ బాబు
ప్రతి ఒక్కరి జీవితంలో ఎవరో ఒకరు గురువు ఉంటారు. కొంత మందికి ఒకరి కంటే ఎక్కువ మంది కూడా గురువులుగా ఉంటారు. సహజంగా తమ జీవితాలను అత్యంత ప్రభావితం చేసిన వ్యక్తులను గురువులుగా భావిస్తుంటారు. ప్రముఖ సీపీఐ నాయకుడు కే నారాయణకు కూడా ఒక రాజకీయ గురువు ఉన్నారు. ఆయనే బొప్పిడిపూడి స్టాలిన్ బాబు. ఈయనది గుంటూరు. నారాయణను ఒక మంచి రాజకీయ నాయకుడిగా మార్పు చెందడంలో స్టాలిన్ బాబు పాత్ర ఎంతో ఉంది. విద్యార్థి దశ నుంచే నారాయణను స్టాలిన్ బాబు నాయకుడిగా తీర్చి దిద్దారు. అలాంటి ప్రత్యేక గౌరవం కలిగిన వ్యక్తులు మరణించిన సమయాల్లో కడసారి వారిని చూసి ఇరువురికి సంబంధించిన స్వీట్ మెమోరీస్ ను ఓ సారి గుర్తు చేసుకుంటారు. ఒక వేళ గురువులు కన్నుమూసిన సమయాలలో చివరి చూపులు చేసేందుకు కొంత మందికి ఒక్కోసారి అవకాశం ఉండదు. అలాంటి సందర్భమే నారాయాణకు వచ్చింది. తన రాజకీయ గురువు బొప్పూడి స్టాలిన్ బాబు అనారోగ్యం కారణంగా కన్నుమూశారు. అయితే నారాయణ తన పిల్లలతో కలిసి ఉండేందుకు అమెరికాలో ఉన్నారు. గురువు స్టాలిన్ బాబును కడసారి చూసేందుకు అవకాశం లేకుండా పోయింది. దీంతో ఆయన సోషల్ మీడియా వేదికగా స్సందించారు. నిర్దాక్షిణ్యంగా వెళ్లి పోయాడని తెలిసి విఘాతం చెందాను అంటూ తన మనసులోని బాధను వ్యక్తం చేశారు.
నారాయణ ఏమన్నారంటే..
సీపీఐ ఉద్యమంలో స్టాలిన్ బాబు సేవలు
స్టాలిన్ బాబు విద్యార్థి దశ నుంచే ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ (ఏఐఎస్‌ఎఫ్)లో చురుకైన పాత్ర పోషించారు. నాటి సీపీఐ జాతీయ నాయకులైన డాంగే, మీనాజ్ కర్, పెరవలి కృష్ణయ్య, సురవరం సుధాకర్ రెడ్డి వంటి ప్రముఖులతో సన్నిహితంగా పనిచేశారు. చండ్ర రాజేశ్వరరావు, కనపర్తి నాగయ్య, వల్లూరు గంగాధరరావు, మల్లయ్యలింగం, వేములపల్లి శ్రీకృష్ణ వంటి నాయకులతో కలిసి సీపీఐ ఉద్యమాన్ని బలోపేతం చేశారు.
- 1970లో ఏఐటీయూసీ సదస్సు: గుంటూరులో జరిగిన ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (ఏఐటీయూసీ) సదస్సును విజయవంతంగా నిర్వహించారు.
- 1975లో సీపీఐ మహాసభలు: విజయవాడలో జరిగిన సీపీఐ 10వ జాతీయ మహాసభల్లో జనసేవా దళ్ రాష్ట్ర ఉప కమాండర్‌గా బాధ్యతలు నిర్వహించారు.
- విద్యార్థి, యువజన ఉద్యమాలు: ఏఐఎస్‌ఎఫ్, ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ (ఏఐవైఎఫ్)లో జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఎన్నో పోరాటాలను నడిపించారు. 1970లలో వేలాది మంది విద్యార్థి, యువజన నాయకులకు మార్గదర్శకంగా నిలిచారు.
- ఇతర బాధ్యతలు: ఆల్ ఇండియా ఎల్‌ఐసీ ఏజెంట్స్ అసోసియేషన్ సెక్రటరీగా కూడా సేవలందించారు.

