బెంగుళూర్ ను టార్గెట్ చేసిన హైదరాబాద్
x

బెంగుళూర్ ను టార్గెట్ చేసిన హైదరాబాద్

సాఫ్ట్ వేర్ ఎగుమతుల ఉత్పత్తుల్లో బెంగుళూరును మించిపోవాలని హైదరాబాద్ టార్గెట్ గా పెట్టుకున్నది.


సాఫ్ట్ వేర్ ఎగుమతుల ఉత్పత్తుల్లో బెంగుళూరును మించిపోవాలని హైదరాబాద్ టార్గెట్ గా పెట్టుకున్నది. దేశం మొత్తంమీద ఐటి రంగానికి కేరాఫ్ అడ్రస్ అంటేనే బెంగుళూరన్న విషయం అందరికీ తెలిసిందే. అలాంటి బెంగుళూరును సాఫ్ట్ వేర్ ఉత్పుత్తుల్లో బీట్ చేయాలని హైదరాబాద్ టార్గెట్ పెట్టుకోవటం ఆశ్చర్యంగానే ఉంది. బెంగుళూరును బీట్ చేయాలంటే పాలకులకు ఎంతో చిత్తశుద్ది అవసరం. ఇపుడు దేశంలోనే సాఫ్ట్ వేర్ ఉత్పత్తుల్లో బెంగుళూరు తర్వాత హైదరాబాద్ రెండోస్ధానంలో ఉంది కాబట్టి మొదటిస్ధానంకు చేరుకోవటానికి ప్రభుత్వం పెద్ద టార్గెట్ పెట్టుకున్నది.

ఇదే విషయమై పరిశ్రమలు, ఐటి శాఖల మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు మాట్లాడుతు బెంగుళూరు ఇపుడు సాఫ్ట్ వేర్ ఉత్పత్తుల్లో రు. 7 లక్షల కోట్లతో మొదటిప్లేసులో ఉన్నట్లు చెప్పారు. హైదరాబాద్ నుండి మొన్నటి మార్చి 31వ తేదీకి సాఫ్ట్ వేర్ ఎగుమతుల విలువ రు. 2.7 లక్షల కోట్లయితే జూన్ నాటికి విలువ రు. 2.9 లక్షల కోట్లకు చేరుకున్నట్లు చెప్పారు. అంటే రు. 20 వేల కోట్లు పెరిగింది. దీనికే మంత్ర సంబరపడిపోతున్నారు. బెంగుళూరు రు. 7 లక్షల కోట్లు ఎక్కడ హైదరాబాద్ రు. 2.9 లక్షల కోట్లెక్కడ ? బెంగుళూరుకున్నా హైదరాబాద్ సుమారు రు. 4 లక్షల కోట్లు వెనుకబడున్న విషయాన్ని మంత్రి మరచిపోయినట్లున్నారు.

అయితే ఇక్కడ మంత్రి చెప్పిన కీలకమైన విషయం ఏమిటంటే బెంగుళూరును బీట్ చేయటానికి తమ ప్రభుత్వం 3 ఏళ్ళు గడువు పెట్టుకున్నదట. గడువు పెట్టుకోవటమే కాకుండా ఏఐ(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్)ను ప్రోత్సహించటానికి భారీ ప్రణాళికలు రెడీ చేస్తున్నట్లు చెప్పారు. నిజంగానే దుద్దిళ్ళ చెప్పినట్లుగా ఏఐ రంగానికి మంచి ప్రోత్సాహమిచ్చి, అంతర్జాతీయ స్ధాయిలో నిపుణులను రప్పించుకోగలిగితే అప్పుడు సాఫ్ట్ వేర్ ఉత్పత్తుల విలువ ఒక్కసారిగా పెరిగిపోయే అవకాశాలున్నాయి. అయితే ఇక్కడ ఒక చిన్న సందేహం ఏమిటంటే హైదరాబాదే ఏఐ రంగాన్ని ప్రోత్సహించేటపుడు మరి బెంగుళూరు చూస్తూ ఊరుకోదు కదా. ఏఐ రంగాన్ని ప్రోత్సహించే పనిని బెంగుళూరు ఇప్పటికే మొదలుపెట్టేసుంటుంది కదా ?

అయితే ఇక్కడ హైదరాబాద్ కు కలిసొచ్చే అంశం ఒకటుంది. అదేమిటంటే ఐటి ఫీల్డులో ఇప్పటికే బెంగుళూరు తారస్ధాయికి చేరుకునేసింది. కాబట్టి ఇంతకుమించి ఎదగటానికి బెంగుళూరుకు పెద్దగా అవకాశంలేదు. అదే హైదరాబాద్ అయితే ఐటి, సాఫ్ట్ వేర్ రంగాల్లో అభివృద్ధి చెందుతోంది. ఒకవైపు సాఫ్ట్ వేర్, ఐటి రంగాల్లో అభివృద్ధి చెందుతునే మరోవైపు ఏఐ ఫీల్డు మీద బాగా దృష్టిపెడితే డెవలప్మెంట్ రాకెట్ వేగంతో పుంజుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బహుశా ఆ ధీమాతోనే, అలాంటి వ్యూహాలతోనే మంత్రి బెంగుళూరును బీట్ చేయటానికి మూడేళ్ళు గడువు పెట్టుకున్నది. తెలంగాణా ప్రభుత్వం వేసిన ప్లాన్లు వేసినట్లుగానే అమలైతే అప్పుడు బెంగుళూరును హైదరాబాద్ బీట్ చేసే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. కోడింగ్ నైపుణ్యమున్న 2 లక్షల మంది ఇంజనీరింగ్ విద్యార్ధులను ఏఐ నిపుణులుగా మార్చేందుకు చర్యలు తీసుకోబోతున్నట్లు శ్రీధర్ చెప్పారు.

Read More
Next Story