భర్త సంపాదన..ప్రియుడి పాలు చేసిన భార్య
x

భర్త సంపాదన..ప్రియుడి పాలు చేసిన భార్య

ఇల్లును చక్క దిద్దుకోవలసిన ఇల్లాలు పక్క దారి పట్టింది. భర్త రెక్కల కష్టాన్ని ప్రియుడికి దోచి పెడుతూ భర్త మరణానికి కారకురాలైంది. చివరికి కటకట పాలైంది.


కుటుంబం బాగుండాలని భావించాడు భర్త. కుటుంబాన్ని అన్ని రకాలుగా బాగా చూసుకోవాలనుకున్నాడు. దీని కోసం కష్ట పడాలనుకున్నాడు. అందుకు దుబాయ్‌ వెళ్లాలని ప్లాన్‌ చేసుకున్నాడు. అనుకున్న ప్రకారమే అతను దుబాయ్‌ వెళ్లాడు. సంపాదించడం మొదలు పెట్టాడు. కష్టపడి కూడబెట్టిన సొమ్మును భార్యకు పంపించే వాడు. భార్య అన్ని రకాలుగా కుటుంబాన్ని చూసుకుంటూ తక్కిన దానిని జాగ్రత్తగా భద్రపరుస్తుందని కలలు కన్నాడు. కానీ డామిడ్‌ కథ అడ్డం తిరిగింది. భర్త కన్న కలలన్నీ పగటి కలలుగానే మిగిలి పోయాయి. భార్య తన ఇష్టాను సారం వ్యవహరించసాగింది. అత్త సొమ్ము అల్లుడు దానం అన్న చందంగా భర్త కష్టపడి సంపాదించిన సొమ్మును తన ప్రియుడికి దోచి పెట్టింది. భార్య వ్యవహారంతో జీవితం విరక్తి చెందిన భర్త బలవన్మరణానికి పాల్పడి ప్రాణాలు తీసుకున్నాడు. కాకినాడ జిల్లాలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. భర్త మరణానికి కారుకులైన భర్యా, ఆమె ప్రయుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

కాకినాడ జిల్లా ఖండవల్లి గ్రామానికి చెందిన చల్లా దుర్గారావు, దివ్యకుమారి భార్యా, భర్తలు. పెళ్లైన తర్వాత భర్త దుర్గారావు దుబాయ్‌ వెళ్లాడు. ఇటీవలె తిరిగి వచ్చాడు. తన భార్య దివ్యకుమారి అదే ఖండవల్లి గ్రామానికి చెందిన మోత్రపు అమోఘ్‌తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. తాను దుబాయ్‌లో సంపాదించిన పంపిన సొమ్మంతా తన భార్య దివ్యకుమారి మోత్రపు అమోఘ్‌కు దోచి పెట్టిందని భర్త దుర్గారావు తెలుసుకున్నాడు. నిగ్గు తేల్చేందుకు దుర్గారావు బయలు దేరాడు. తన కుటుంబ సభ్యులు, గ్రామ పెద్దలతో కలిసి దివ్యకుమారితో అక్రమ సంబంధం పెట్టుకున్న అమోఘ్‌ను నిలదీసేందుకు అతని ఇంటికెళ్లారు. అయితే అమోఘ్‌ తండ్రి శివప్రసాద్‌ దుర్గారావును నానా దుర్భాషలాడి అవమానించారు. తన పరువు అంతా పోయిందని, ఇక బతికి లాభం లేదని చనిపోవాలని దుర్గారావు నిర్ణయించుకున్నాడు. ఈ నెల 25న పెరవలి లాకుల వద్ద మోటారు సైకిల్‌ను వదిలేసి కాల్వలో దూకి ఆత్మహత్యకు పాల్పడి ప్రాణాలు తీసుకున్నాడు. తర్వాత రోజు ఇరగవరం మండలం రాపాక వద్ద దుర్గారావు శవమైతేలాడు.
అయితే దుర్గారావు తాను చనిపోయే ముందు సూసైడ్‌ లెటర్‌ను రాసుకున్నాడు. తన చావుకు తన భార్య దివ్యకుమారి, ఆమె ప్రియుడు మోత్రపు అమోఘ్, అతని తండ్రి మోత్రపు శివప్రసాద్‌లు కారణమని సూసైడ్‌ లెటర్‌లో రాసి పెట్టాడు. తాను దుబాయ్‌ వెళ్లి సంపాదించిన డబ్బంతా తన భార్య దివ్యకుమారి ఆమె ప్రియుడు మోత్రపు అమోఘ్‌కు దోచి పెట్టింది. దీని వల్ల తాను ఆర్థికంగా చాలా చితికి పోయాను. తన భార్య దివ్యకుమారి, మోత్రపు అమోఘ్‌తో అక్రమ సంబంధం పెట్టుకోవడం తనను తీవ్రంగా మనస్తాపానికి గురి చేసింది. దీంతో తాను ఆత్మహత్య చేసుకొని చనిపోవాలని నిర్ణయించుకున్నట్లు సూసైడ్‌ నోట్‌లో రాసి పెట్టాడు. ఈ కేసులో పోలీసులు రంగంలోకి దిగారు. దుర్గారావు రాసిన సూసైడ్‌ లెటర్‌ ఆధారంగా దివ్యకుమారి, ఆమె ప్రయుడు అమోఘ్, అతని తండ్రి శివప్రసాద్‌లను అదుపులోకి తీసుకొన్న పోలీసులు వారి ముగ్గరిని శుక్రవారం తణుకు కోర్టులో హాజరు పరిచారు.
Read More
Next Story