పల్నాడులో భారీ పేలుడు
x

పల్నాడులో భారీ పేలుడు

బయోడీజిల్‌ను అన్‌లోడ్‌ చేస్తుండగా ట్యాంకర్‌ పేలడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.


ఆంధ్రప్రదేశ్‌లో భారీ పేలుడు ప్రమాదం సంభవించింది. పల్నాడు జిల్లా రెంటచింతల మండలం పాలువాయి జంక్షన్‌ వద్ద బయోడీజిల్‌ బంకులో ఈ ఘటన చోటుచేసుకుంది. బంకులో బయోడీజిల్‌ అన్‌లోడ్‌ చేస్తుండగా ట్యాంకర్‌ ఒక్కసారిగా పేలడంతో పేలుడు ప్రమాదం జరిగింది. దీంతో భారీగా మంటలు చెలరేగాయి. ఈ దుర్ఘటనలో ఒకరు మృతి చెందగా, మరో వ్యక్తిక తీవ్రగంగా గాయపడ్డారు. మృతి చెందిన వ్యక్తి గురజాలకు చెందిన రషీద్‌గా గుర్తించారు. తీవ్రంగా గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు. భారీగా చెలరేగిన మంటలకు స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. వెంటనే అగ్నిమాపక శాఖ, పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఫైర్‌ ఇంజన్లతో మంటలను అదుపులోకి తెచ్చారు. మరోవైపు పోలీసులు కూడా ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. భద్రతా లోపాల కారణంగా ఈ దుర్ఘటన జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.

Read More
Next Story