
ఈ నెలలోనే అన్నదాత సుఖీభవ డబ్బులు జాబితాలో మీరున్నారా తెలుసుకోండిలా..
జాబితాలో అనర్హులుగా వున్న రైతుల సమస్యల పరిష్కారానికి రైతు సేవా కేంద్రాలలో రేపటి నుంచి అధికారులు ఫిర్యాదులు స్వీకరిస్తారు.
ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం రైతులకు శుభవార్త చెప్పింది. ఈ నెలలోనే అన్నదాత సుఖీభవ పథకం డబ్బులు రైతుల ఖాతాలలో జమచేయడానికి రెడీ అయ్యింది.ఈ పథకానికి అర్హుల తుది జాబితాను ప్రభుత్వం సిద్ధం చేసింది.రైతులందరూ జాబితాలో తమ పేరు వుందో లేదో సరిచూసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు కీలక సూచన చేశారు. జాబితాలో పేరులేని వారు అనర్హులుగా వున్నవారు రైతు సేవా కేంద్రాలలో మరోమారు నమోదు చేసుకోవాల్సి వుంటుంది. అర్హతకు సంబంధించి సమస్యల పరిష్కారానికి రేపటి నుంచి (5/07/2025) నుంచి రైతుసేవా కేంద్రాల్లో ఫిర్యాదులు స్వీకరించనున్నట్లు అధికారులు ప్రకటించారు.
పేరు తనిఖీ చేసుకోవడం ఎలా?
అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి అర్హుల జాబితాలను ప్రభుత్వం పోర్టల్ లో అందుబాటులో ఉంచింది.అందులోనే వివరాలను తెలుసుకోవచ్చు.అందుకోసం అన్నదాత సుఖీభవ అధికారిక వెబ్ సైట్ https://annadathasukhibhava.ap.gov.in/ఓపెన్ చేసి know your status పైన క్లిక్ చేయాలి.రైతు ఆథార్ నెంబర్,క్యాప్చా ఎంటర్ చేసి search ఆప్షన్ పై క్లిక్ చేస్తే, రైతు పేరు , గ్రామం వివరాలు కనిపిస్తాయి.పక్కనే eligible లా కాదా చూపిస్తుంది. అనర్హులైతే remarks కాలంలో కారణం వస్తుంది. అనర్హులైన రైతులు 155251 నంబర్‌కు ఫోన్ చేసి వివరాలు తెలుసుకునేలా కూడా ఏర్పాట్లు చేసారు.
గ్రీవెన్స్ మాడ్యూల్‌ను శుక్రవారం అధికారులు విడుదల చేశారు. అభ్యంతరాలు, అర్హత కు సంబంధించిన సమస్యల పరిష్కారానికి రైతుసేవా కేంద్రాల్లో ఫిర్యాదులు స్వీకరించనున్నట్లు వ్యవసాయశాఖ డైరెక్టర్ డిల్లీరావు తెలిపారు.వెబ్‌ల్యాండ్‌లో డేటా సరిచేయించుకోకపోయినా,భూ ఖాతాదారు చనిపోయిన సందర్భంలో వెబ్‌ల్యాండ్, అడంగల్, 1బీల్లో వారసత్వ వివరాలు చేర్చకపోయినా, అన్నదాత-సుఖీభవ-పీఎం కిసాన్ వంటి పథకాలకు అనర్హులు అవుతారని తెలిపారు.సాంకేతిక లోపంతో వాస్తవంగా భూమి ఉన్నా.. ఎలాంటి భూమి లేని ఖాతాలుగా నమోదవడం, డేటా లోపాలతో విస్తీర్ణం కనిపించకపోవడం వంటి సమస్యలపై గ్రీవెన్స్ మాడ్యూల్ ద్వారా పరిష్కరిస్తారు.కేంద్రం నుంచి రూ 2 వేలు,ఏపీ ప్రభుత్వం రూ 5 వేలు మొత్తంగా 7 వేల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి.ఈ సొమ్ము ఈనెల రెండవ వారంలో రైతుల ఖాతాలలో జమచేసే అవకాశం వుంది. లబ్దిదారులెవరికీ అన్యాయం జరగకుండా ముందుగానే పోర్టర్ లో అర్హుల జాబితాను అందుబాటులో వుంచామని , అనర్హులుగా పేర్కొన్న వారు శనివారం నుంచి రైతు సేవా కేంద్రాలలో తగిన ఆధారాలు చూపించి సమస్యను పరిష్కరించుకోవచ్చని అధికారులు వెల్లడించారు.
Next Story