
ట్రాక్టర్ల ధరలు ఎంతెంత తగ్గుతాయంటే...
కొత్త GST శ్లాబులు దేశంలో నూటికి 60 శాతంగా ఉన్న రైతులకు పెద్ద ఉపశమనంగా చెప్తున్నారు వ్యవసాయ రంగ నిపుణులు
'ఓరే, రామయ్యా.. ఏ ట్రాక్టర్ కొందామనుకుంటున్నావ్..'
"ఏమోరా.. తెలియడం లేదు.."
'జీఎస్టీ తగ్గించారట.. కొనదల్చుకుంటే ఇప్పుడే కొను..'
"ఎందుకు?.."
'జీఎస్టీ తగ్గించారంటర్రా'
"జీఎస్టీ అంటే ఏమిటీ? ఎందుకు తగ్గించారు?.."
24 గంటలుగా ఊళ్లల్లోని రచ్చ బండలపై సాగుతున్న ముచ్చట్లివి. దీనికి కారణం లేకపోలేదు. గతంలో మాదిరి ఎద్దులు, దున్నపోతులతో వ్యవసాయం చేసే పరిస్థితి లేదు. అంతా యంత్రాలతోనే సాగవుతోంది సాగు.
కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ జీఎస్టీని (వస్తు సేవల పన్ను) తగ్గిస్తూ ప్రకటన చేశారు. దీని ప్రకారం వ్యవసాయానికి ఉపయోగించే ట్రాక్టర్లు, ఇతర పరికరాల ధరలు తగ్గుతాయంటున్నారు. అసలు వాటి ధరవరలు ఇప్పుడెంత ఉన్నాయో సెప్టెంబర్ 22 తర్వాత ఇవి ఎంత తగ్గుతాయనే దానిపై గ్రామాల్లో చర్చ సాగుతోంది.
GST మార్పుల వల్ల ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ట్రాక్టర్ల ధరలు ఎలా ఉండనున్నాయనేది ఇంకా ఇతమిద్ధంగా తేలలేదు. అయితే దాని ప్రభావం కనిపిస్తుంది—GST దేశవ్యాప్తంగా ఒకేలా వర్తిస్తుంది.
ఏం మారింది? ఎప్పుడు?
GST (వస్తు సేవల పన్ను) స్లాబ్స్‌ను నాలుగింటి నుంచి రెండు ప్రధాన రేట్లకు కుదించారు. ఇకపై వస్తువలను 5%, 18% పన్నుల క్యాటగిరీల కిందకు తెచ్చారు. విలాసవంతవైన అంటే లగ్జరీ, సిన్ వస్తువులకు మాత్రం 40% రేట్ ఉంటుంది. ఇవి 2025 సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి వస్తాయి. 8 ఏళ్ల కిందటి శ్లాబలను మార్చడమే ఇందులో ప్రధాన విషయం.
చవకయ్యే విభాగాలు..
మనం నిత్యం వాడుకునే సబ్బు, టూత్‌పేస్ట్, షాంపూ, హెయిర్ ఆయిల్, బ్రష్, షేవింగ్ క్రీమ్ వంటివి 18% నుంచి 5% క్యాటగిరీలోకి వస్తాయి. గతంలో ఏ వస్తువులను పాత క్యాటగిరిలో తయారు చేసి మార్కెట్ కి వదిలారో అవి మాత్రం పాత క్యాటగిరీలోనే ఉంటాయి.
ప్యాకేజ్డ్ ఫుడ్, పాలు ఉత్పత్తులు, కొన్ని మందులు 5% క్యాటగిరీలో వస్తాయని కేంద్రం సూచించింది. దీనివల్ల వినియోగదారులకు ఉపశమనం కలుగుతుందని చెబుతున్నారు.
వ్యక్తిగత హెల్త్/లైఫ్ ఇన్షూరెన్స్ పాలసీలపై GST మినహాయింపు ఉంటుంది. ప్రీమియం తగ్గుతుంది.
ఇక సిమెంట్, టీవీ/ఇతర విడిభాగాలు కూడా 28% నుంచి 18% క్యాటగిరీలోకి వస్తాయి. ఎక్స్-ఫ్యాక్టరీ ధర స్థిరంగా ఉంటే రిటైల్ ధర 7.8% తగ్గే అవకాశం ఉంది.
చిన్న కార్లు, రెండు చక్రాల వాహనాలు కూడా ఎక్కువ భాగం 28% నుంచి 18% క్యాటగిరీలోకి వస్తాయి. తగ్గుదల ఎంత అనేది ఇంకా తేలలేదు.
ఎలక్ట్రిక్ వాహనాలు (EVs) ఇప్పటికే 5% క్యాటగిరీలో ఉన్నాయి. ఇప్పుడు కూడా అదే కొనసాగుతుంది.
ఖరీదయ్యే వస్తువులు...
టోబాకో, లగ్జరీ కార్లు వంటివి 40% క్యాటగిరీ శ్లాబులో ఉంటాయి. హై-ఎండ్ వస్తువులకు కూడా ఇదే వర్తిస్తుంది.
ఏవీ ప్రభావంలోకి రావు?
పెట్రోల్, డీజిల్, ఆల్కహాల్ ఫర్ హ్యూమన్ కన్సంప్షన్, విద్యుత్, స్టాంప్ డ్యూటీ/రిజిస్ట్రేషన్ — ఇవి GST పరిధిలో లేవు. ఈ మార్పులతో వీటి ధరలు మారవు.
ట్రాక్టర్ల ధరలు ఎలా ఉంటాయంటే..
ట్రాక్టర్ల ధరలు ఎలా ఉండవచ్చుననే దానిపై భిన్నమైన రిపోర్టులు వస్తున్నాయి.
కొన్ని రిపోర్టుల ప్రకారం ట్రాక్టర్, టైర్లు, స్పేర్ పార్ట్స్‌ను 5% క్యాటగిరీలోకి మార్చారన చెబుతున్నారు. దాని అర్థం ఏమిటంటే ఉదాహరణకు షోరూం బేసిక్ ధర ₹10,00,000 అనుకుంటే దానిపై ఇప్పటి వరకు ఉన్న జీఎస్టీని 12% నుంచి 5 శాతానికి తగ్గించడం వల్ల సుమారు ₹70,000 సేవింగ్స్ అవుతాయని విజయవాడలో మహేంద్ర కంపెనీ డీలర్ ఒకరు చెప్పారు.
పాత స్టాక్ అమ్మే వరకు కొత్తవి రావు గనుక పాత వాటిపై ధర తగ్గిస్తారా లేదా అనేది ఇంకా నిర్ణయం కాలేదని జాన్ డీర్ కంపెనీ డీలర్లు చెబుతున్నారు.
జీఎస్టీ విధించే వస్తువులను HSN క్యాటగిరీల కింది వర్గీకరించి పన్నులను లెక్కిస్తారు.
HSN అంటే Harmonized System of Nomenclature. ఇదో అంతర్జాతీయ కోడ్ సిస్టమ్. వస్తువులను వర్గీకరించి వాటికి ఈ HSN కింద నెంబర్లు ఇస్తుంటారు.
ప్రతి సరుక్కీ HSN code (4, 6, or 8 నెంబర్లలో) ఇస్తుంటారు. ఇచ్చే నెంబర్ని బట్టి ఆ వస్తువు ఏ క్యాటగిరీ జీఎస్టీలోకి వస్తుందో తెలుస్తుంది. ఇప్పటి వరకు మనకున్న శ్లాబులు నాలుగు(5%, 12%, 18%, 28%).
ఉదాహరణకి ట్రాక్టర్లు- HSN 8701 నెంబరు కిందికి వస్తాయి.
మెడిసిన్స్- HSN 3004 - Medicaments (pharmaceutical products).
HSN 2710 - Petrol, Diesel, Lubricating oils.
ఈ నెంబర్ల ఆధారంగా జీఎస్టీని వ్యాపారస్తులు వసూలు చేస్తుంటారు.
ఇలా HSN కోడ్ అనేది ఆ వస్తువును నిర్వహించడానికి ఉపయోగించే ఐచ్ఛిక గుర్తింపు సంఖ్యే. ఇది ఒక “వర్గీకరణ” విధానం మాత్రమే.
GST రేట్లు HSN కోడ్ ఆధారంగా నిర్ణయించబడతాయి. ముఖ్యమైన విషయమేమిటంటే ప్రభుత్వ అధికారిక నోటిఫికేషన్ వచ్చిన తర్వాతే ఇవి అమల్లోకి వచ్చినట్టు.
HSN 8701 క్యాటగిరీ కిందకు ఏయే తరహా ట్రాక్టర్లు వస్తాయంటే ఈ కోడ్ కిందకు ట్రాక్టర్లు (tractors) అన్నీ వస్తాయి. అయితే 8701 తర్వాత వచ్చే సబ్-హెడ్డింగ్స్ (4–8 అంకెల కోడ్‌లు) ద్వారా వేరు వేరు ట్రాక్టర్ రకాల్ని గుర్తిస్తారు.
HSN 8701 లోని ముఖ్య సబ్-కేటగిరీలు
8701.10 – Pedestrian controlled tractors
చిన్న వాటిని (walk-behind type) ఎక్కువగా పేరటి తోటలు, తోటలు, ఉద్యానవన పంట తోటల్లో ఉపయోగిస్తారు. ఉదా: పవర్ టిల్లర్ (rotavator-style).
8701.20 – Road tractors for semi-trailers (ఇవి సాధారణంగా వ్యవసాయం కోసం కాకుండా రవాణా కోసం ఉపయోగిస్తారు. (లారీలు లాగే head tractor).
8701.30 – Track-laying tractors (చెరువులు, మాగాళ్లలో వాడతారు. వీటికి చక్రాల బదులు ట్రాక్స్ (caterpillar-type tracks) ఉంటాయి.
8701.90 – Other tractors (రైతులు ఎక్కువగా వాడే కేటగిరీ ఇది)
Wheeled tractors (చక్రాలతో ఉండేవి) – ఇవే మనం రోడ్డు మీద చూసే 2WD, 4WD ట్రాక్టర్లు ఇవే. చిన్న, మధ్య తరహా రైతులు ఎక్కువగా వాడేవి. దుక్కులు దున్నడం, రవాణా, నీటి పంపింగ్, పంట నాటేవ, కోత కోసేవి ఈ క్యాటగిరీలో ఉన్నాయి. అలాగే 4WD (Four-Wheel Drive) Tractors (పెద్ద పొలాల్లో, బరువైన పనుల కోసం ఉపయోగిస్తారు. లోతుగా దున్నడం, పెద్ద కల్టివేటర్లు, ట్రాలీలు, కాంబైన్ హార్వెస్టర్లు ఉంటాయి)
Mini tractors / Power tillers (8701.10 క్యాటగిరీలో ఉన్నాయి). 15HP–30HP వరకు చిన్న రైతులు, ఉద్యాన పంటల రైతులు, చెరకు రైతులు ఫార్మ్స్‌లో ఉపయోగిస్తుంటారు.
రైతులు ఎక్కువగా వాడే బ్రాండ్లు
Mahindra (Yuvraj, Arjun, Novo సిరీస్)
TAFE Massey Ferguson
John Deere
Escorts Powertrac / Farmtrac
Sonalika
Swaraj
VST Shakti (mini tractors / tillers)
మొత్తానికి HSN 8701 అంటే “అన్ని రకాల ట్రాక్టర్లు” అని broadly కవర్ చేస్తుంది.
ఇవి 5% జీఎస్టీ శ్లాబులోకి వస్తే ఎంత తగ్గుతుందో చూద్దాం. ఇప్పటి వరకు ట్రాక్టర్లపై 12 శాతం GST ఉంది. తాజా వార్తల ప్రకారం సెప్టెంబర్ 22 నుంచి ట్రాక్టర్లు, టైర్లు, స్పేర్ పార్ట్స్ కూడా 5%కి తగ్గుతాయని చెబుతున్నారు.
12% నుంచి 5%కి వస్తే, showroom ధర సుమారుగా 6.25% తగ్గుతుంది (ఎందుకంటే కొత్త ధర = పాత బేస్ × 1.05 అంటే −6.25%).
అంటే ప్రతి లక్ష రూపాయలకి GST 12% నుంచి 5% తగ్గడం వల్ల సుమారుగా ₹6,250 తగ్గుతుంది.
ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ లేదా తెలంగాణలో Swaraj 735 FE (4 టైర్లు 40 HP) ట్రాక్టర్ ధరలు (showroom) ఎలా ఉండవచ్చుననే ఉజ్జాయింపుగా అందులో పని చేసే ఓ సేల్స్ మేనేజర్ శివ చెప్పిన దాని ప్రకారం దేశవ్యాప్తంగా ధర ₹6.20 లక్షల నుంచి ₹6.57 లక్షల వరకు ఉంటుంది. కొన్ని వేరియంట్స్ (Tractor Kharido) ₹5.85 లక్షల నుంచి ₹6.20 లక్షల మధ్య ఉంటాయి. ఏదైమైనా ప్రారంభ ధర ₹6.20 లక్షలు.
రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా ధరల మధ్య వ్యత్యాసం లేదు.
GST 12% నుంచి 5% తగ్గితే... మీ గతంలో ట్రాక్టర్ ను ₹6.20 లక్షలు కొంటే (12% GSTతో) ఇప్పుడు ₹5.53, లేదా రూ.5.60 లక్షలకు కొంటారు.
దేశంలో నూటికి 60 శాతంగా ఉన్న రైతులకు ఇదో ఉపశమనంగా చెప్తున్నారు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ప్రధాన కార్యదర్శి కేవీవీ ప్రసాద్.
Next Story