
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫి ప్రైజ్ మనీ ఎంతంటే
ఏడేళ్ల తర్వాత ఈ ట్రోఫీ జరుగుతోంది. దాదాపు రూ. 60 కోట్ల ప్రైజ్ మనీని ఐసీసీ ఈ టోర్నీలో జట్లకు అందించనుంది.
ప్రస్తుతం ఎక్కడ చూసినా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ గురించే చర్చించుకుంటున్నారు. ఆదివారం ఆఖరి పోరు ప్రారంభమైంది. టీమ్ ఇండియా, కివీస్ జట్లు బరిలోకి దిగాయి. ఈ మ్యాచ్ హోరా హోరీగా సాగుతుందని అందచనా వేస్తున్నారు. తుది పోరులో ఎవరు గెలుస్తారనేది ఆసక్తికరంగా మారింది. అటు బ్యాటింగ్ లైనప్‌లో కాని, ఇటు బౌలింగ్‌లో కానీ ఇరు జట్లు పోటా పోటీగానే ఉన్నాయి.
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ తుది పోరులో విజేతగా నిలిచిన జట్టుకు భారీ మొత్తంలో ప్రైజ్ మనీ దక్కనుంది. ట్రోఫీని కైవసం చేసుకున్న జట్టుకు 2.24 మిలియన్ డాలర్లు అంటే ఇండియన్ కరెన్సీలో రూ. 19.45 కోట్లు అందించనున్నారు. రెండో స్థానంలో రన్నరప్‌గా నిలిచిన జట్టుకు 1.24 మిలియన్ డాలర్లు అంటే రూ. 9.72 కోట్లు అందించనున్నారు. ఇక సెమీ ఫైనలిస్టు జట్టులకు రూ. 4.86 కోట్లు చొప్పున ఒక్కో జట్టుకు అందించనున్నారు. మొదటి సెమీ ఫైనల్ మ్యాచ్‌లో ఓడిన ఆస్ట్రేలియా జట్లు, రెండో సెమీ ఫైనల్ మ్యాచ్‌లో ఓటమి పాలైన దక్షిణాఫ్రికా జట్లు ఈ ప్రైజ్ మనీని అందుకోనున్నాయి.
ఈ టోర్నీలో ఓడిన జట్లు, ఆడిన జట్లకు కూడా పెద్ద మొత్తంలో కాసుల వర్షం కురిపించనున్నారు. ఐదో స్థానం, ఆరో స్థానంలో నిలిచిన జట్లకు రూ. 3 కోట్లు, ఏడు, ఎనిమిదో స్థానంలో నిలిచిన జట్లకు రూ. 1.2 కోట్లు చొప్పున అందించనున్నారు. ప్రతి మ్యాచ్‌కు ప్రైజ్ మనీ కింద రూ. 29 లక్షలు చొప్పున అందించనున్నారు. దీంతో పాటుగా అదనంగా కూడా ప్రైజ్ మనీని అందించనున్నారు. ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడే ప్రతి జట్టుకు అదనంగా రూ. 108 కోట్లు అందించనున్నారు.
అయితే 2017లో జరిగిన ఐసీపీ ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నీతో పోల్చుకుంటే 2025లో జరుగుతున్న టోర్నీకి భారీ ఎత్తున ప్రైజ్ మనీని పెంచారు. దాదాపు 53 శాతం పెంచారు. ప్రతీ నాలుగు ఏళ్లకు ఒక సారి ఈ టోర్నీని నిర్వహిస్తారు. ప్రపంచ ర్యాంకింక్‌లో టాప్ ఎనిమిది జట్ల మధ్య ఈ పోటీ జరుగుతుంది. అయితే మహిళల ఛాంపియన్స్ ట్రోఫీని కూడా నిర్వహించాలని చూస్తున్నారు. టీ20 ఫార్మేట్‌లో 2027లో నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
దాదాపు ఏడేళ్ల తర్వాత ఈ ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నీని నిర్వహిస్తున్నారు. ఆఖరి టోర్నీ 2017లో నిర్వహించారు. ఇంగ్లాండ్‌లో జరిగిన ఈ టోర్నీలో పాకిస్తాన్ జట్టు విజేతగా నిలిచింది. తర్వాత 2025లో నిర్వహిస్తున్నారు. పాకిస్తాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యుఏఈ) సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ టోర్నీలో ఎవరు ట్రోఫీని కైవసం చేసుకుంటారో, భారీ మొత్తంలోని ప్రైజ్ మీనీని ఏ జట్టు సొంతం చేసుకుంటుందో అనేది ఆసక్తికరంగా మారింది.
Next Story