అమెరికా పౌరసత్వ విధానంలో ఏముందీ? ఎంతమంది తెలుగువాళ్లకి ఎఫెక్ట్?
x

అమెరికా పౌరసత్వ విధానంలో ఏముందీ? ఎంతమంది తెలుగువాళ్లకి ఎఫెక్ట్?

అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న 5 లక్షల మంది భారతీయులలో 15-20% మంది తెలుగు మాట్లాడే వారు ఉండవచ్చు. అంటే ఈ సంఖ్య సుమారు 75,000 నుండి 1,00,000 మధ్య ఉండవచ్చు.


అమెరికా నూతన అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వస్తూనే పౌరసత్వ విధానంపై కొత్త ఉత్తర్వులు జారీ చేశారు. 2025 జనవరి 20న అమెరికా పౌరసత్వ విధానంలో కీలక మార్పులను ప్రకటించారు. కొత్త ఆదేశాల ప్రకారం, అమెరికాలో అక్రమంగా ఉంటున్న వ్యక్తుల పిల్లలకు, తాత్కాలిక అనుమతితో వచ్చిన వారి పిల్లలకు పౌరసత్వం ఇకపై హక్కుగా సంక్రమించదు. ఇప్పటి వరకు అమెరికా గడ్డపై పుట్టిన వారందరికీ ఆటోమ్యాటిక్ గా పౌరసత్వం వచ్చేది. ఇక ఆ పరిస్థితి ఉండదని నూతన అధ్యక్షుడు తాజాగా జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
కొత్త జీవోలోని ప్రధాన అంశాలు..
వందేళ్ల కిందట అమెరికా రాజ్యాంగానికి చేసిన 14వ సవరణ ద్వారా అమెరికా సంయుక్త రాష్ట్రాలలో పుట్టిన పిల్లలకు పౌరసత్వం వచ్చేది. ఇప్పుడా చట్టం రద్దవుతుంది. 1857లో డ్రెడ్ స్కాట్ వర్సెస్ శాండ్ ఫోర్డ్ కేసులో యునైటెడ్ స్టేట్స్ సుప్రీం కోర్టు ఇచ్చిన దురదృష్టకరమైన తీర్పును సరిదిద్దేలా అమెరికా రాజ్యాంగాన్ని సవరించారు. రాజ్యాంగాన్ని కోర్టు తప్పుగా అర్థం చేసుకుందని, కేవలం వారి జాతి ఆధారంగా ఆఫ్రికన్ వంశస్తులు అమెరికా పౌరసత్వానికి శాశ్వతంగా అనర్హులుగా ప్రకటించింది. దాన్ని సరిదిద్దడానికి రాజ్యాంగాన్ని సవరించాల్సి వచ్చింది.

ఇప్పుడు దాన్ని ట్రంప్ రద్దు చేశారు. కొత్త నిబంధనల ప్రకారం.. తల్లి అక్రమ నివాసితురాలిగా ఉండి తండ్రి అమెరికా పౌరుడు, శాశ్వత నివాసితుడు కాకపోతే వారికి పుట్టే పిల్లలకు పౌరసత్వం ఉండదు.
తాత్కాలిక వీసాతో వచ్చిన మహిళకు, అమెరికన్ పౌరుడు కాని వ్యక్తికి పుట్టే పిల్లలకు కూడా పౌరసత్వం దానంతటదే వచ్చే అవకాశం లేదు.
ట్రంప్ ఆదేశాల ప్రకారం, కొత్త నిబంధనలు 2025 జనవరి 20నుంచి 30 రోజుల తర్వాత జన్మించిన వారికి వర్తిస్తాయి. ఈలోగా ఫెడరల్ సంస్థలు కొత్త విధానాలను సవరించి 30 రోజుల్లో మార్గదర్శకాలను జారీ చేయాలి. సెక్రటరీ ఆఫ్ స్టేట్, అటార్నీ జనరల్, హోం ల్యాండ్ సెక్యూరిటీ సెక్రటరీ, సోషల్ సెక్యూరిటీ కమిషనర్ ఈమేరకు మార్గదర్శక సూత్రాలు రూపొందిస్తారు.
జనవరి 20, 2025న విడుదలైన ఈ ఆదేశం 30 రోజుల తర్వాత జన్మించిన వారికి మాత్రమే వర్తిస్తుంది. ఇప్పటికే పుట్టిన వారికి ఈ కొత్త నిబంధనలు వర్తించవు.
రాజకీయంగా మంటలు పుట్టిస్తున్న కొత్త నిబంధనలు...
ట్రంప్ జారీ చేసిన కొత్త పౌరసత్వ నిబంధనలు రాజకీయంగా మంటలు పుట్టిస్తున్నాయి. ఈ నిర్ణయం చట్టపరంగా, రాజకీయంగా చర్చనీయాంశమైంది. పౌరసత్వం జన్మ హక్కు అనే అంశంపై చర్చ మళ్లీ మొదలైంది. “ఈ నిర్ణయం చట్టప్రకారంగా ఉండి, అమెరికా పౌరసత్వ విలువను కాపాడేందుకు ఉద్దేశించింది” అని వైట్ హౌస్ పేర్కొంది. అయితే ఈ వాదనను అమెరికాలోని పౌరహక్కుల సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. తాజా మార్పులపై మరింత చర్చలు, వాదోపవాదాలు జరిగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఎంతమంది తెలుగు వారికి నష్టం చేయవచ్చు?
అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న భారతీయుల సంఖ్యపై ఖచ్చితమైన గణాంకాలు అందుబాటులో లేవు. అయితే, ప్యూ రిసెర్చ్ సెంటర్ 2022లో విడుదల చేసిన నివేదిక ప్రకారం, 2014 నాటికి సుమారు 5 లక్షల మంది భారతీయులు అక్రమంగా అమెరికాలో నివసిస్తున్నట్లు అంచనా.
2024 డిసెంబరులో యునైటెడ్ స్టేట్స్ ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (ICE) సంస్థ 15 లక్షల మంది అక్రమ వలసదారులను దేశం నుంచి పంపించేందుకు జాబితాను సిద్ధం చేసింది. ఇందులో 17,940 మంది భారతీయులు ఉన్నారు.
గత మూడేళ్లలో సుమారు 90,000 మంది భారతీయులు అక్రమంగా అమెరికా సరిహద్దు దాటే ప్రయత్నంలో భద్రతా సిబ్బందికి పట్టుబడ్డారు. అయితే ఈ లెక్కలను ఏ శాఖ నిర్ధారించలేదు. ఇమిగ్రేషన్ శాఖ మాత్రమే ఖచ్చితమైన సమాచారం ఇవ్వగలుగుతుంది. ఆ నివేదికలు ఇంకా బయటకు రాలేదు.
అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న భారతీయులలో తెలుగు మాట్లాడే వారి సంఖ్యపై ఖచ్చితమైన గణాంకాలు అందుబాటులో లేవు. అయితే, 2024 నాటికి అమెరికాలో మొత్తం 12.3 లక్షల మంది తెలుగు మాట్లాడే ప్రజలు ఉన్నారని యూఎస్ సెన్సస్ బ్యూరో డేటా ఆధారంగా తెలుస్తోంది. అందువల్ల, తెలుగు మాట్లాడే వారి సంఖ్యను ఖచ్చితంగా నిర్ధారించడం కష్టం. సుమారుగా అంచనా వేస్తే, అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న భారతీయులలో (సుమారు 5 లక్షలు) దాదాపు 15-20% మంది తెలుగు మాట్లాడే వారు ఉండవచ్చు. అంటే ఈ సంఖ్య సుమారు 75,000 నుండి 1,00,000 మధ్య ఉండవచ్చు.
ఒకవేళ ట్రంప్ జారీ చేసిన నూతన ఉత్తర్వుల ప్రకారం స్వదేశానికి తిరిగి వచ్చే వాళ్లు లేదా వారి పిల్లలు అందరూ కలిపినా ఈ సంఖ్య లక్షకు మించదని అంచనా.
Read More
Next Story