
వక్ఫ్ బిల్లుపై ఎంత మంది పిటీషన్‌లు వేశారంటే
నేడు సుప్రీం కోర్టు విచారించనున్న నేపథ్యంలో దీని మీద తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
ఇటీవల కేంద్రంలోని మోదీ ప్రభుత్వం తెరపైకి తీసుకొచ్చిన వక్స్ సవరణ చట్టం దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. అనేక ఎత్తుగడల మధ్య ఈ బిల్లును మోదీ ప్రభుత్వం పార్లమెంట్‌లో చాకచక్యంగా ఆమోదింపచేసుకుంది. అయితే దీనిపై అటు ప్రతిపక్షాలు, ఇటు ముస్లిం వర్గాలు, ప్రజాస్వామిక వాదులు, వామపక్షాలు పెద్ద ఎత్తున వ్యతిరేకించాయి. అయినా తగ్గేదేలేదంటూ మోదీ ప్రభుత్వం ముందుకెళ్లింది. ఈ నేపథ్యంలో వక్ఫ్ సవరణ బిల్లుపై అభ్యంతరాలు వ్యక్తం చేసిన వారు సుప్రీం కోర్టులో సవాల్ చేశారు. ఈ బిల్లు రాజ్యాంగం విరుద్దమంటూ మోదీ ప్రభుత్వం తెచ్చిన చట్టానికి వ్యతిరేకంగా పలువురు సుప్రీం కోర్టులో పిటీషన్లు దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో ఎంతో ప్రాధాన్యతక సంతరించుకున్న ఈ పిటీషన్ మీద ఈ రోజు (ఏప్రిల్ 16 బుధవారం) సుప్రీం కోర్టు విచారణ చేపట్ట నుంది. సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్‌కుమార్, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌ల సుప్రీం కోర్టు త్రిసభ్య ధర్మాసనం విచారణ జరుప నుంది. ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా దీనిపై ఉత్కంఠత నెలకొంది.