ఏపీలో పిడుగుపాటుకు ఎంత మంది బలయ్యారంటే
x

ఏపీలో పిడుగుపాటుకు ఎంత మంది బలయ్యారంటే

ఆంధ్రప్రదేశ్‌లో పిడుగుపాటు వర్షాలు కుటుంబాల్లో దుఃఖాన్ని నింపుతున్నాయి.


ఆంధ్రప్రదేశ్‌లో భయబ్రాంతులకు గురి చేస్తున్న పిడుగుపాటు వర్షాలు ఏడుగురిని బలి తీసుకుంది. ఈదురుగాలుకు చెట్టు పడి ఒకరు ప్రాణాలు పోగొట్టుకున్నారు. విద్యుత్‌ ఘాతానికి ఒకరు బలయ్యారు. పిడుగుపాటుకు తిరుపతి జిల్లాలో ముగ్గురు, ప్రకాశం జిల్లాలో ఒకరు, బాపట్ల జిల్లాలో ఒకరు, కృష్ణా జిల్లాలో ఒకరు, ఏలూరు జిల్లాలో ఇద్దరు మరణించారు. వీరిలో ఒక బాలుడు కూడా ఉన్నాడు.

తిరుపతి జిల్లా నాయుడుపేట మండలం వద్దిగుంట కండ్రిగకు చెందిన 52ఏళ్ల భాస్కర్‌ అనే రైతు, అదే తిరుపతి జిల్లా ఓజిలి మండలం గొల్లపాలెంకు చెందిన 11 ఏళ్ల కార్తీక్, అదే జిల్లా చిల్లకూరు మండలం కాకువారిపాలెంకు చెందిన 30 ఏళ్ల మునీంద్ర పిడుగుపాటుకు గురై మరణించారు. ప్రకాశం జిల్లాలో ఒకరిని బలి తీసుకుంది. ఈదుమూడికి చెందిన 40 ఏళ్ల నాగమల్లేశ్వరరావు అనే గొర్రెల కాపరి పిడుగుపాటుకు మరణించాడు. బాపట్ల జిల్లా చినగంజాంకు చెందిన 50 ఏళ్ల పశువుల కాపరి పశువులు మేపుతుండగా పిడుగుపాటుకు మృత్యువాత పడ్డాడు.
బైక్‌ పైన వెళ్తున్న వారిని కూడా పిడుగులు వదల్లేదు. కృష్ణా జిల్లా శ్రీకాకుళం రేవు నుంచి బైక్‌ మీద గాజులంకకు వెళ్తున్న 23 ఏళ్ల సుప్రదీప్‌ అనే యువకుడు పిడుగుపాటుకు గురై మృత్యువాత పడ్డాడు. ఏలూరు జిల్లా మండవల్లి మండలం చింతపాడు గ్రామానికి చెందిన 33 సంవత్సరాల సైదు గిరిబాబు అనే రైతు పిడుగు పడి ప్రాణాలు కోల్పోయాడు.
ఆదివారం కురిసిన ఈదురు గాలుల పిడుగు పాటు వర్షాలకు చెట్టు పడి ఒక బాలుడు, కరెంట్‌ సరఫరా కోసం పని చేస్తున్న ఓ లైన్‌మెన్‌లు ప్రాణాలు కోల్పోయారు. ఏలూరు జిల్లా ముసునూరు మండలం చెక్కపల్లి గ్రామానికి చెందిన పదేళ్ల వయసున్న మామిడి గోవిందు అనే బాలుడు మీద చెట్టుపడటంతో అక్కడికక్కడే మరణించాడు. తిరుపతి సంస్కృతినగర్‌లో ట్రాన్స్‌ఫార్మర్‌కు మరమ్మతులు చేస్తున్న సమయంలో విద్యుత్‌ఘతానికి గురై ఓ జూనియర్‌ లైన్‌మెన్‌ ప్రాణాలు పోగొట్టుకున్నాడు.
Read More
Next Story