పవన్‌ కల్యాణ్‌కు ఎంత మంది ఫోన్‌ చేశారంటే
x

పవన్‌ కల్యాణ్‌కు ఎంత మంది ఫోన్‌ చేశారంటే

పవన్‌ కల్యాణ్‌ పెద్ద కుమారుడు అకీరానందన్‌ పుట్టిన రోజే రెండో కుమారుడు మార్క్‌ శంకర్‌కు అగ్ని ప్రమాం జరిగింది.


ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ రిలాక్స్‌ అయ్యారు. తన చిన్న కుమారుడు మార్క్‌ శంకర్‌ ప్రమాదంలో చిక్కుకున్నాడని, ఎలా ఉన్నాడో అని ఆందోళనలకు గురైన పవన్‌ కల్యాణ్‌ తన చిన్న కుమారుని ఆరోగ్య పరిస్థితులను తెలుసుకున్న తర్వాత ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం మార్క్‌ శంకర్‌కి సింగపూర్‌లోని ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతున్నాయి.

మంగళవారం విశాఖపట్నం నుంచి హైదరాబాద్‌కు చేరుకున్న పవన్‌ కల్యాణ్‌ అదే రోజు రాత్రి హైదరాబాద్‌ నుంచి సింగపూర్‌లో మార్క్‌ శంకర్‌ ఉన్న ఆసుపత్రికి నేరుగా వెళ్లారు. ఆసుపత్రిలో ఉన్న తన చిన్న కుమారుడు మార్క్‌ శంకర్‌ను చూశారు. చేతులు, కాళ్ళకు కాలిన గాయాలు కావడంతోపాటు ఊపిరితిత్తులకు పొగ చూరడంతో అత్యవసర వార్డులో చికిత్స అందిస్తున్నారు. మార్క్‌కు అందిస్తున్న వైద్య సేవల గురించి అక్కడి వైద్యులతో మాట్లాడారు. మార్క్‌ కోలుకొంటున్నాడని, ఊపిరితిత్తుల దగ్గర పొగ పట్టేయడం మూలంగా తలెత్తే ఆరోగ్యపరమైన ఇబ్బందులపై పరీక్షలు చేస్తున్నామని పవన్‌ కల్యాణ్‌కు వైద్యులు తెలియచేశారు. ప్రమాదం చోటు చేసుకున్న అనంతరం మార్క్‌ శంకర్‌ను భారత కాలమాన ప్రకారం బుధవారం ఉదయం అత్యవసర వార్డు నుంచి గదికి తీసుకువచ్చారు. మరో మూడు రోజులపాటు వైద్యుల పర్యవేక్షణలో పరీక్షలు చేయాల్సి ఉంటుందని ఆసుపత్రి వైద్యులు తెలియచేశారు.
సింగపూర్‌లో వేసవి శిక్షణ తరగతులకు వెళ్ళిన పవన్‌ కల్యాణ్‌ రెండో కుమారుడు మార్క్‌ శంకర్, అక్కడ తరగతి గదిలో మంగళవారం అగ్నిప్రమాదం జరిగింది. దీంతో మార్క్‌ శంకర్‌ గాయపడ్డాడు. కాళు, చేతులకు గాయాలయ్యాయి. అయితే అరకు పర్యటనలో వెళ్ళిన పవన్‌ కల్యాణ్‌కు మంగళవారం ఉదయం ఫోన్‌ కాల్‌ వచ్చింది. అగ్నిప్రమాదం జరిగిన విషయాన్ని ఆయన భార్య అన్నా పవన్‌ కల్యాణ్‌ తెలిపారు. ప్రమాదం చిన్నదే అని పవన్‌ కల్యాణ్‌ మొదట భావించారు. అయితే ప్రమాదంలో ఒక చిన్నారి మరణించడం, మరో 30 మంది పిల్లలకు గాయాల పాలయ్యారని విషయం తెలియగానే పవన్‌ కల్యాణ్‌ ఆందోళనకు గురయ్యారు. మార్క్‌ శంకర్‌కి కూడా ప్రమాదంలో చేతులు, కాళ్లపైన గాయాలయ్యాయని తెలియడంతో కలవరానికి గురయ్యారు. అయితే అగ్ని ప్రమాదంలో దట్టమైన పొగ పీల్చడంతో మార్క్‌ శంకర్‌ ఊపిరితిత్తులతోకి పొగ చేరినట్టు వైద్యులు ధృవీకరించారు. దీని కోసం బ్రాంకోస్కోపీ చేసిన వైద్యులు మార్క్‌ ప్రాణానికి ఎలాంటి ప్రమాదం లేదని తెలిపారు. ప్రమాదం జరిగిన విషయాన్ని మొదట గుర్తించి పిల్లలను కాపాడిన భవన నిర్మాణ కార్మికులకు పవన్‌ కల్యాణ్‌ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ప్రమాదానికి గురైన పవన్‌ కల్యాణ్‌ రెండో కుమారుడు వయసు ఏడేళ్లు. పవన్‌ కల్యాణ్‌ పెద్ద కుమారుడు అకీరానందన్‌ పుట్టిన రోజే రెండో కుమారుడు మార్క్‌ శంకర్‌ ప్రమాదంలో గాయాలు పాలుకావడం పవన్‌ కల్యాణ్‌ను కలచివేసింది. మరో వైపు మార్క్‌ శంకర్‌ ప్రమాద సంఘటన విషయం తెలిసిన వెంటనే ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం స్పందించింది. ప్రధాని నరేంద్ర మోదీ నేరుగా పవన్‌ కల్యాణ్‌కు ఫోన్‌ చేసి మాట్లాడి ధైర్యం చెప్పారు. వెంటనే సింగపూర్‌లో మార్క్‌ శంకర్‌కు మెరుగైన వైద్య సేవలు అందించే విధంగా ఏర్పాట్లు చేయాలని భారత హై కమిషనర్‌కి ప్రధాని మోదీ ఆదేశాలిచ్చారు.
అరకు పర్యటనలో ఉన్న పవన్‌ కల్యాణ్‌కు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఫోన్‌ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ పవన్‌ కల్యాణ్‌కు ఫోన్‌ చేసి ధైర్యం చెప్పారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి కూడా పవన్‌ కల్యాణ్‌కు ఫోన్‌ చేసి ప్రమాదం గురించి అడిగి తెలుసుకున్నారు. కేంద్ర మంత్రులు రామ్మోహన్‌ నాయుడు, కిషన్‌ రెడ్డి, బండి సంజయ్‌ గారికి, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి, ఇక రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర నేతలు, సినీ ప్రముఖులు పవన్‌ కల్యాణ్‌కు పోన్‌ చేసి పరామర్శించారు.
Read More
Next Story