ఆలస్యంగా వస్తే ఎలా? మంత్రులపై స్పీకర్‌ సీరియస్‌
x

ఆలస్యంగా వస్తే ఎలా? మంత్రులపై స్పీకర్‌ సీరియస్‌

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. శాసన మండలికి శనివారం సెలవు ప్రకటించగా, శాసన సభ కొనసాగుతోంది.


ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో స్పీకర్‌ చింతకాయల అయ్యన్నపాత్రుడు కొందరి మంత్రులపై సీరియస్‌ అయ్యారు. మంత్రులు సకాలంలో సభకు రాకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. సమావేశాలకు ఆలస్యంగా రావడం ఏంటని ప్రశ్నించారు. ముందుగానే సిద్ధపడి అసెంబ్లీ సమావేశాలకు బాధ్యతగా రావాలని సూచించారు. ప్రశ్నోత్తరాలు, జీరో అవర్‌లో సభ్యులు ప్రస్తావించే అంశాలకు ప్రభుత్వం నుంచి సరైన సమాధానం చెప్పాల్సిన బాధ్యత మంత్రులపై ఉందని అన్నారు. అలాంటిది, సమావేశాలకు మంత్రులే ఆలస్యంగా వస్తే ఎలా అని ప్రశ్నించారు. సరైన సమయానికి రావడానికి ప్రయత్నించాలని సూచించారు. తణుకులో ఈఎస్‌ఐ ఆసుపత్రిపై సభ్యుడు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చే సమయంలో మంత్రి వాసంశెట్టి సుభాష్‌ అందుబాటులోకి లేకపోవడంతో స్పీకర్‌ సీరియస్‌ అయ్యారు. ఇక నుంచి అలా జరక్కుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.


Read More
Next Story