
ఉప్పాడ తీరంలో ఉధృతంగా మోంథా
పునరావాస కేంద్రాలుగా మారిన కాకినాడ హాస్టళ్లు
మొంథా తుపాను కన్నేసిన కాకినాడ జిల్లాలో అనేక ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఉప్పాడ సముద్ర తీరంలో కెరటాలు భీకరంగా ఎగిసిపడుతున్నాయి. తొండంగి, యు. కొత్తపల్లి, తాళ్లరేవు మండలాల్లో 2,590 పూరిళ్లు, పెంకుటిళ్లలో నివసిస్తున్న కుటుంబాలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. ఎమర్జన్సీఅవసరాలకోసం 50 మంది SDRF, 30 మంది NDRF సిబ్బందిని సిద్ధంచేశారు..
కాకినాడ జిల్లాలో స్కూళ్ల కు శెలవు ప్రకటించారు. 101 హాస్టళ్లలో ఉన్న 14,499 మంది విద్యార్థులను ఇళ్లకు పంపించారు. అలా ఖాళీ అయిన భవనాలను తాత్కాలిక పునరావాస కేంద్రాలుగా మార్చారు.
కాకినాడ తీర ప్రాంతంలో తుపాను తీరం దాటే అవకాశం ఉన్నందున ఉప్పాడ తీరంపై మొంథా తుపాను బాగా ప్రభావం చూపిస్తున్నది. ఉప్పాడ సురాడ పేటలో సముద్ర తీర ప్రాంతంలో బలమైన ఈదురు గాలులకు ఒక ఇంటి పైకప్పు ఎగిరిపోయింది. ప్రమాదం నుండి రెవిన్యూ సిబ్బంది, స్థానికులు తృటిలో తప్పించుకున్నారు. బీచ్ రోడ్డును తాత్కాలికంగా మూసేశారు. ఉప్పాడ నుంచి కాకినాడ వెళ్లే బీచ్ రోడ్డు అలల తాకిడికి ధ్వంసం అయింది.

