పోలీసు స్టేషన్‌ ముందే రాళ్లతో కొట్టుకున్న హిజ్రాలు
x

పోలీసు స్టేషన్‌ ముందే రాళ్లతో కొట్టుకున్న హిజ్రాలు

దెబ్బలు, గాయాలు కాకపోవడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.


సహజంగా పోలీసులంటే ఎవరికైనా భయం ఉంటుంది. పోలీసు స్టేషన్‌లకు వెళ్లాలన్నా ఇప్పటికీ కొంత మంది భయపడుతుంటారు. అందువల్ల పోలీసు స్టేషన్‌ల ముందు కొట్టుకోవడానికి జంకుతారు. వాటికి దూరంగా కొట్టాటలు జరుగుతుంటాయి. కానీ హిజ్రాలు అలా కాదు. పోలీసుల ముందే రెచ్చి పోయారు. పోలీసు స్టేషన్‌ ముందే రాళ్లతో కొట్లాటకు దిగారు. దీంతో వారిని వారించడం, శాంతింప చేయడం అనేది పోలీసులకు పెద్ద సవాలుగా మారింది. చివరికి పోలీసులు తమ లాఠీలకు పని చెప్పడంతో హిజ్రాలు పరారయ్యారు. పోలీసులకు అత్యంత తలనొప్పిగా మారిన ఈ హిజ్రాల కొట్లాట నంద్యాల జిల్లాలో చోటు చేసుకుంది. భిక్షాటన విషయంలో కొట్లాటలకు దిగారు.

నంద్యాలలో రెండు వర్గాలగా హిజ్రాలు విడిపోయి ఉన్నారు. ఒకటి నంద్యాల హిజ్రాల వర్గం. మరొకటి పాణ్యం హిజ్రాల వర్గం. ఈ రెండు వర్గాలకు ఒకరంటే ఒకరికి పడదు. కయ్యానికి కాలు దువుకుంటుంటారు. ఈ నేపథ్యంలో భిక్షాటనకు సంబంధించిన గొడవ ఈ రెండు వర్గాల మధ్య గొడవలకు తెరపలేపింది. నంద్యాల హిజ్రా వర్గం నంద్యాల పట్టణంలో భిక్షాటన చేసుకుంటు వెళ్తున్నారు. అలా భిక్షాటన చేసుకుంటూ నంద్యాల పట్టణంలోని టూ టౌన్‌ పోలీసు స్టేషన్‌ ప్రాంతానికి చేరుకున్నారు. అదే సమయంలో పాణ్యం హిజ్రాల వర్గం అటువైపు నుంచి భిక్షాటన చేసుకుంటూ ఎదురుపడింది. సరిగ్గా నంద్యాల టూ టౌన్‌ పోలీసు స్టేషన్‌ వద్ద రెండు వర్గాల హిజ్రాలు పరస్పరం ఎదురు పడ్డారు. తాము పోలీసు స్టేషన్‌ ముందే ఉన్నాము, కొట్లాడుకుంటే పోలీసులు వస్తారు, అందరినీ శిక్షిస్తారనే విషయాన్ని మరిచి పోయిన హిజ్రాలు, తమ ప్రాంతంలో ఎలా భిక్షాటన చేస్తారంటూ నంద్యాల హిజ్రా వర్గం, పాణ్యం హిజ్రా వర్గం పరస్పరం కొట్లాటలకు దిగారు. రాళ్లతో ఒకరిపై ఒకరు దాడులకు దిగారు. సరిగ్గా టూ టౌన్‌ పోలీసు స్టేషన్‌ ముందు ఈ ఘటన చోటు చేసుకోవడంతో పోలీసుల రంగంలోకి దిగాల్సి వచ్చింది.
ఈ కొట్లాట మొదలైన కొద్ది సేపటి వరకు పోలీసులు అలా చూస్తూ ఉండి పోయారు. కొద్ది సేపు అలా అరుచుకొని సర్థుకొని పోతారులే అని భావించిన పోలీసులు కాసేపు అలా చూస్తూ ఉండి పోయారు. అయితే ఆ రెండు హిజ్రా వర్గాలు ఏ మాత్రం తగ్గ లేదు. కొట్లాట పెరిగి పెద్దది అవడం మొదలైంది. ఇరు వర్గాల హిజ్రాలు రాళ్లు రువ్వు కోవడం మొదలెట్టారు. ఈ నేపథ్యంలో పోలీసుల మీద కూడా రాళ్లు పడ్డాయి. హిజ్రాలు కదా పోనీలే పాపం అనుకొని అప్పటి వరకు కామ్‌గా ఉన్నో పోలీసులు రంగంలోకి దిగాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. లేక పోతే సరిగ్గా పోలీసు స్టేషన్‌ ముందే బాహా బాహీకి దిగడం, రాళ్లతో రువ్వుకుంటుడటంతో వారికి గాయాలైతే మళ్లీ పోలీసులకే చెడ్డ పేరు వస్తుంది.
కాబట్టి దానికి తావివ్వకుండా రంగంలోకి దిగారు పోలీసులు. లాఠీలకు పని చెప్పారు. ఇరు వర్గాలను అక్కడ నుంచి తరిమి కొట్టారు. తర్వాత పోలీసులు ఊపి పీల్చుకున్నారు. లేకుంటే ఎవరికో ఒకరికి బలంగానే బెద్దలు తగిలేవి. దీంతో పోలీసులకు బాడ్‌ నేమ్‌ వచ్చి ఉండేది. కానీ పోలీసులు సమన్వయంతో వ్యవహరించి వారిని చెదర గొట్టి వాటికి ఆస్కారం లేకుండా చర్యలు తీసుకున్నారు. ఈ తతంగాన్ని గుర్తు తెలియని వ్యక్తులు వీడియో రికార్డ్‌ చేశారు. ఇప్పుడు ఆ వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీంతో ఈ హిజ్రాల గొడవలు తెరపైకి వచ్చింది. వర్గాలుగా మారిన హిజ్రాలు పరస్పరం దాడులు చేసుకోవడంపై నెటిజన్లు ముక్కున వేలేసుకుంటున్నారు. అందరూ హిజ్రాలే కదా కలిసి కట్టుగా ఉండి సంతోషంగా జీవించొచ్చు కదా అని కామెంట్లు చేస్తున్నారు.
Read More
Next Story