ఈ జిల్లాలో అధిక పోలింగ్
రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన పోలింగ్‌లో చిత్తూరు జిల్లా ఓటర్లు ఎక్కువ మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలో పోలింగ్ శాతం 74.06 నమోదైంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల కంటే ఎక్కువ పోలింగ్ ఈ జిల్లాలోనే నమోదైంది. దీని తరువాత కోనసీమ జిల్లాలో 73.55 శాతం పోలింగ్ నమోదైంది. కృష్ణా జిల్లాలో 73.53 శాతం నమోదైంది. వైఎస్సార్ జిల్లాలో 72.85 శాతం నమోదైంది. ఇలా దాదాపు ప్రతి జిల్లాలోనూ బాగానే ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. చిత్తూరు జిల్లాలో ఎక్కువ ఓటింగ్ శాతం నమోదైనప్పటికి చిన్న చిన్న సంఘటనలు కూడా ఎక్కువగానే చోటు చేసుకున్నాయి. అయితే పోలింగ్ స్టేషన్స్ లోపల కాకుండా బయట జరగటం వల్ల ఓటింగ్ కార్యక్రమానికి ఎటువంటి అంతరాయం కలుగలేదు.
Next Story