క్రికెట్ బాల్ తెచ్చిన తంటా.. రక్తసిక్తమైన వీ.కోట..
x

క్రికెట్ బాల్ తెచ్చిన తంటా.. రక్తసిక్తమైన వీ.కోట..

చిత్తూరు జిల్లాలోని వీ.కోట మండలంలో రెండు వర్గాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చిన్న గొడవ కాస్తా చిలికి చిలిక గాలివానలా మారి రెండు వర్గాల మధ్య కొట్లాటకు దారితీసింది.


చిత్తూరు జిల్లాలోని వీ.కోట మండలంలో రెండు వర్గాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చిన్న గొడవ కాస్తా చిలికి చిలికి గాలివానలా మారి రెండు వర్గాల మధ్య కొట్లాటకు దారితీసింది. రెండు వర్గాల వారు ఒకరిపై ఒకరు కర్రలు, రాళ్లతో దాడులు చేసుకోవడంతో వి.కోట రక్తసిక్తమైంది. ఈ మేరకు సమాచారం అందిన వెంటనే కలెక్టర్ సుమిత్ కుమార్, జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు ఘటన స్థలానికి చేరుకుని గొడవలను అదుపు చేయడానికి తీవ్ర ప్రయత్నాలు చేశారు. ఈ క్రమంలో జరిగిన రాళ్లదాడిలో డీఎస్పీ ప్రభాకర్‌ తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే ఆయనను స్థానికు ఆసుపత్రికి తరలించారు. అతి కష్టంపైన పోలీసులు గొడవలను సర్దుమణించారు. కానీ ప్రస్తుతం వీ.కోట మండలంలోని ఉద్రిక్త పరిస్థితులు నివురుగప్పిన నిప్పులా ఉన్నాయి. ఎప్పుడు ఎటునుంచి ఎలాంటి ఉద్రిక్తలు చెలరేగుతాయో అర్థం కాక పోలీసులు సైతం ఆందోళన చెందుతున్నారు. మరోసారి రక్తపాతాలు జరగకుండా ఉండటానికి పోలీసులు.. వి.కోట మండలంలో సెక్షన్ 144 ను రెండు రోజుల పాటు అమలు చేస్తున్నట్లు వెల్లడించారు.

ఇంతకీ ఏమైందంటే..

క్రికెట్ బాల్ తెచ్చిన చిక్కు వీ.కోట మండలాన్ని అతలాకుతలం చేస్తోంది. సోమవారం రాత్రి కొందరు యువకులు క్రికెట్ ఆడుతుండగా ఆ క్రికెట్ బాల్ వెళ్లి ఓ మహిళకు తగిలింది. వారి మధ్య మాటామాటా పెరిగి అది కాస్తా గొడవలకు, పోలీసు ఫిర్యాదులకు దారి తీసింది. ఆ మహిళ తరపు వాళ్లు కొందరు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయడానికి వెళ్లారు. కానీ మరికొందరు మాత్రం బాధితులపై దాడులు చేరశారు. దీంతో ఈ గొడవ కాస్తా చిలికి చిలికి గాలివానైనట్లు చిన్నా గొడవా కాస్తా.. రెండు వర్గాల మధ్య ఘర్షణలా మారింది. ఒక వర్గం మరో వర్గంపై తీవ్ర దాడులకు పాల్పడ్డారు. కత్తులు, రాడ్లు, కర్రలతో దొరికిన వారిని దొరికినట్లు కొట్టుకోవడం ప్రారంభించారు. దీంతో వీ.కోట మండలం రక్తసిక్తమైంది. ఈ ఘర్షణల నేపథ్యంలో తమకు రక్షణ కల్పించాలంటూ ఒక వర్గం అంబేద్కర్ సర్కిల్‌లో ధర్నాకు దిగింది.

అప్పటి వరకు ధర్నా కొనసాగుతుంది..

ఇంతలో అక్కడకు చేరుకున్న కలెక్టర్ సుమిత్ కుమార్, ఎస్పీ మణికంఠ.. ధర్ణా చేస్తున్న వారికి సర్దిచెప్పి ధర్నా విరమించుకోవాలని కోరారు. కాగా అందుకు సదరు వర్గం నిరాకరించింది. తమపై దాడికి యత్నించిన వారందరినీ అరెస్ట్ చేసే వరకు తాము ధర్నాను విరమించుకునేది లేదని వారు తేల్చి చెప్పారు. దీంతో వి.కోట మండలంలోని పరిస్థితులు నివురుగప్పిన నిప్పులా మారి ఎప్పుడు ఆగ్ర జ్వాలలను వెదజల్లుతాయో అర్థం కాని పరిస్థితులు నెలకొని ఉన్నాయి.

కలెక్టర్ సమక్షంలో శాంతి కమిటీ

వి.కోట మండలంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సందర్భంగా కలెక్టర్ సుమిత్, ఎస్పీ మణికంఠ ఓ శాంతి కమిటీని ఏర్పాటు చేశారు. ఇరు వర్గాలు వెనక్కు తగ్గడానికి అంగీకరించకపోవడంతో రెండు వర్గాల పెద్దలతో ఈ కమిటీ నిర్వహించారు. శాంతిభద్రతలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంటుందని, కాబట్టి ఇరు వర్గాల వారు సంమయనం పాటించాలని అధికారులు కోరారు. నలుగురు మధ్య గొడవలను రెండు వర్గాల మధ్య గొడవులుగా మార్చుకోవడం మంచిది కాదని ఇరు వర్గాల వారికి వివరించారు. కాగా అక్కడి పరిస్థితులను పర్యవేక్షించడానికి బీజేపీ నేతలు హుటాహుటిన చేరుకోవడంపై సీపీఎం నేత దడాల సుబ్బారావు కీలక వ్యాఖ్యలు చేశారు.

మత ఘర్షణలకు రెచ్చగొట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీపీఎం రాష్ట్రనాయుకులు దడాల సుబ్బారావు, జీల్లా కార్యదర్శి వాడ గంగరాజు డిమాండ్ చేశారు. చిన్నపాటి గొడవను మతఘర్షణలుగా బీజేపీ నాయకులు మారుస్తున్నారని, ప్రశాంతమైన వీ.కోటలో మతఘర్షణలు లేకుండా చర్యలు చేపట్టాలని అధికారులను కోరారు వారు.

Read More
Next Story