కుప్పంలో బాబు విజయోత్సవ పర్యటన వివరాలు ఇవే...
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రెండు రోజుల పర్యటనకు ఈనెల 25న కుప్పం వెళుతున్నారు. అక్కడ పార్టీ నాయకులు, అధికారులతో సమావేశాలు, సమీక్షలు నిర్వహిస్తారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈనెల 25, 26న కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తరువాత మొదటి సారిగా కుప్పం పర్యటనకు బయలుదేరుతున్నారు. కుప్పం ప్రజలు చంద్రబాబును ఎన్నో ఏళ్లుగా ఆదరిస్తూ వస్తున్నారు. కుప్పంలో చంద్రబాబు విజయోత్సవ పర్యటన వివరాలు ఇలా ఉన్నాయి.
25 న సీఎం చంద్రబాబు పర్యటన వివరాలు..
మధ్యాహ్నం 12:30 కు కుప్పం పిఈఎస్ మెడికల్ కళాశాల వద్దకు చేరుకోనున్న చంద్రబాబు..
1:00 కు అన్న క్యాంటీన్ ను ప్రారంభించనున్న సీఎం..
1:30 కు ఎన్టీఆర్ విగ్రహం వద్ద జరిగే బహిరంగ సభలో పాల్గొనున్న సీఎం..
3:30 కు పిఈఎస్ మెడికల్ కళాశాలలోని ఆడిటోరియంలో జిల్లా అధికారులతో సమీక్ష..
5:30 నుండి 6:00 వరకు రిజర్వడ్..
6:00 కు ఆర్ అండ్ బి అతిథి గృహంలో కుప్పం నియోజకవర్గ సమన్వయ కమిటీ సమావేశం..
8:00 కు కుప్పం ఆర్ అండ్ బి అతిథి గృహంలో బస చేయనున్న సీఎం..
26న సీఎం చంద్రబాబు పర్యటన వివరాలు..
ఉదయం 10:00 కు జిల్లా నేతలతో సమీక్ష..
11:00 కు ప్రజల నుండి వినతులను స్వీకరింనున్న సీఎం..
12:00 కు శాంతిపురం మండలంలోని గుండిశెట్టిపల్లి వద్ద కాలువను పరిశీలించనున్న సీఎం..
1:00 నుంచి 2:00 వరకు రిజర్వుడు..
మధ్యాహ్నం 2:00 కు నుంచి 4:00 వరకు పిఈఎస్ కళాశాల ఆడిటోరియంలో నియోజకవర్గ టీడీపీ నాయకులతో సమావేశం..
4:30 కు కుప్పం పర్యటన ముగించుకుని తిరుగు ప్రయాణం కానున్న సీఎం చంద్రబాబు.
Next Story