నెల్లూరు జిల్లాకు భారీ వర్షాలు
ఆంధ్రప్రదేశోలోని సముద్రం తీరం వెంబడి బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తొలుత తీవ్ర రూపం దాల్చింది. తర్వాత క్రమంగా బలహిన పడింది. తీవ్రంగా మారిన అల్పపీడనం కాస్త బలహీనపడిన అల్పపీడనంగా మారింది. దీని ప్రభావంతో 1.5కిమీ మేర ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీంతో సముద్ర తీరం వెంబడి బలమైన ఈదురు గాలులు వీచనున్నాయి. గంటకు 65కిమీ వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని విశాఖపట్నం వాతావరణ కేంద్రం తెలిపింది. దీంతో సముద్ర తీరం వెంబడి ఉన్న అన్ని పోర్టులో ప్రమాద హెచ్చరికలు ఇప్పటికే జారీ చేశారు. అన్ని పోర్టుల్లో మూడో ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. సముద్రం అల్లకల్లోలంగా మారడం, అలలు ఎగిసి పడుతుండటంతో మత్స్యకారులకు హెచ్చరికలు జారీ చేశారు. వేట కోసం సముద్రంలోకి వెళ్లొద్దని సూచించారు. రానున్న రెండు రోజుల్లో రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రానున్న 24 గంటల్లో నెల్లూరు జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని పేర్కొంది.