
ఏపీలో నేడు భారీ వర్షాలు
ఆంధ్రప్రదేశ్‌లో అక్కడక్కడ భారీ వర్షాలు పడుతాయని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్‌లో విభిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఓ పక్క ఎండ తీవ్రత, ఉక్కపోతతో ఉక్కిరి బిక్కిరి అవుతోంటే.. మరో వైపు పిడుగుపాటు వర్షాలతో తీవ్ర ఆందోళనలకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో శనివారం ఆంధ్రప్రదేశ్‌లో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు.
అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వెల్లడించారు. అల్లూరిసీతారామ రాజు జిల్లాతో పాటు విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లా, ఏలూరు జిల్లా, పల్నాడు జిల్లా, ప్రకాశం జిల్లాల్లో పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని రోణంకి కూర్మనాథ్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో తక్కిన ప్రాంతాల్లో కూడా తేలిక పాటి వర్షాలు కురిసే అకాశాలు ఉన్నాయని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో నెలకొన్న విభిన్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో పిడుగులు పడే అవకాశాలతో పాటు ఈదురు గాలులు వీచే అవకాశాలు ఉన్నందు వల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చెట్ల కింద, పెద్ద పెద్ద హోర్డింగ్‌ల కింద నిలబడరాదని రోణంకి కూర్మనాథ్ సూచించారు.
Next Story