ఏపీలో భారీ వర్షాల సూచన
x

ఏపీలో భారీ వర్షాల సూచన

శుక్రవారం, శనివారం రెండు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు పడనున్నాయి.


ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో శుక్రవారం, శనివారాల్లో భారీ వర్షాలు కురవనున్నాయని విశాఖపట్నంలో వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఆగ్నేయ ఉత్తరప్రదేశ్‌ వద్ద ఏర్పడిన అల్పపీడనం ప్రస్తుతం వాయుగుండగా బలపడిందని, దీని వల్ల ఏపీలోని పలు జిల్లాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. అల్లూరి సీతారామరాజు జిల్లాతో పాటు ఎన్టీఆర్‌ జిల్లా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరో వైపు విజయనగరం జిల్లాలో గడచిన 24 గంటల్లో 12 సెమీ వర్షపాతం నమోదైంది. వాయుగుండంతో పాటు ఉపరితల ఆవర్తనం కొనసాగుతుండటంతో కోస్తా ఆంధ్రాలో పలు ప్రాంతాల్లో ఐదు రోజుల పాటు బలమైన గాలులు వీచే అవకాశాలు ఉన్నాయి. గంటకు 40 నుంచి 50 కిమీ వేగంతో ఈదురు గాలులు వీచనున్నాయి. దీంతో సముద్ర తీర ప్రాంతపు ప్రజలు, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. పలు ప్రాంతాల్లో ఉరుములు, పిడుగుపాటుతో కూడిన వర్షాలు కురుస్తాయని, ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Read More
Next Story