
రేపు విచారణ..నేడు హైకోర్టులో మిథున్‌రెడ్డి పిటీషన్
మద్యం కుంభకోణం కేసులో ఎంపీ మిథున్‌రెడ్డికి నోటీసులు జారీ చేసిన పోలీసులు.
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ ప్రభుత్వ హయాంలో మద్యం కుంభకోణం జరిగిందని, దీనిపై ప్రత్యేక విచారణ చేపట్టాలని నిర్ణయించింది. అందులో భాగంగా సిట్‌ను కూడా ఏర్పాటు చేసింది. మరో వైపు జగన్ ప్రభుత్వ హయాంలో లిక్కర్ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించారనే ఆరోపణల మీద వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. శుక్రవారం ఉదయం విజయవాడ సీపీ కార్యాలయంలోని ఏపీ సిట్ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని పేర్కొన్నారు. దీనికి సంబంధించిన డాక్యుమెంట్లు, ఇరత సమాచారం తమకు అందించాలని సిట్ అధికారులు నోటీసుల్లో పేర్కొన్నారు. దీంతో శుక్రవారం ఉదయం 11 గంటలకు సిట్ విచారణకు మిథున్‌రెడ్డి హాజరు కావలసి ఉంటుంది.
ఈ నేపథ్యంలో ఎంపీ మిథున్‌రెడ్డి ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు. సిట్ విచారణ సందర్భంగా తన తరపున న్యాయవాదిని అనుమతిండంతో పాటుగా విచారణను వీడియో రికార్డింగ్ చేసే విధంగా సిట్ అదికారులు చర్యలు తీసుకులా ఆదేశాలు జారీ చేయాలని మిథున్‌రెడ్డి హైకోర్టులో దాఖలు చేసిన పిటీషన్‌లో కోరారు. దీనిపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఏ విధంగా స్పందిస్తుందో అనేది ఆసక్తి కరంగా మారింది. గురువారం రోజే ఈ పిటీషన్ విచారణకు వచ్చే అకాశం ఉందని వైసీపీ శ్రేణులు చర్చించుకుంటున్నారు.
ఇదే కేసులో ఎంపీ మిథున్‌రెడ్డిని పోలీసులు అరెస్టు చేసే అవకాశం ఉందని ఇది వరకు బాగా ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో మిథున్‌రెడ్డి అప్పుడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు. తనను పోలీసులు అరెస్టు చేసే అవకాశం ఉందని, దీంతో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని పిటీషన్ దాఖలు చేశారు. అయితే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు దీనిని కొట్టివేయడంతో అదే అంశంపై సుప్రీం కోర్టుకు వెళ్లారు. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు మిథున్‌రెడ్డిని అరెస్టు చేయొద్దంటూ ఆదేశాలు జారీ చేస్తూనే.. పోలీసుల విచారణకు సహకరించాలని మిథున్‌రెడ్డిని ఆదేశించింది. ఈ నేపథ్యంలో విచారణకు హాజరు కావాలని మిథున్‌రెడ్డికి పోలీసులు నోటీసులు జారీ చేశారు.
Next Story