Revanth|సీనియర్లను రేవంత్ ఆకాశానికి ఎత్తేశాడా ?
x

Revanth|సీనియర్లను రేవంత్ ఆకాశానికి ఎత్తేశాడా ?

పాలమూరు బహిరంగసభలో జరిగింది చూసిన తర్వాత అందరు ఇపుడు పార్టీలో ఇదే మాట్లాడుకుంటున్నారు


పాలమూరు బహిరంగసభలో జరిగింది చూసిన తర్వాత అందరు ఇపుడు పార్టీలో ఇదే మాట్లాడుకుంటున్నారు. ఇంతకీ విషయం ఏమిటంటే పాలమూరు జిల్లా అంటే మహబూబ్ నగర్ జిల్లా(MahaboobNagar District)ని అందరికీ తెలిసిందే. రేవంత్(Revanth) ది కూడా పాలమూరుజిల్లాలోని కొడంగల్(Kodangal). ఈ జిల్లాలో శనివారం రైతు రుణమాఫీ, విజయోత్సవ సభ జరిగింది. రైతులు, ప్రజల సమక్షంలో జరిగిన బహిరంగసభలో రేవంత్ తో పాటు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క, దామోదరరాజనరసింహ, తుమ్మల నాగేశ్వరరావుతో పాటు చాలామంది పాల్గొన్నారు. ఈ బహిరంగసభలో రేవంత్ మాట్లాడుతు ఉత్తమ్, భట్టి, దామోదరను ఆకాశానికి ఎత్తేశారు.

ఇంతకీ రేవంత్ ఏమన్నాడంటే ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(UttamKumar Reddy) పాలమూరు జిల్లా అల్లుడని. అత్తగారింటికి అల్లుడు ఎప్పుడు వచ్చినా హ్యాపీగానే ఉంటారని చెప్పాడు. అలాగే అత్తగారి జిల్లా కాబట్టి పాలమూరు జిల్లాకు ఉత్తమ్ బాగా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్లు కూడా చెప్పాడు. నెలరోజుల్లోపే ఇరిగేషన్ శాఖ ద్వారా ఇరిగేషన్ ప్రాజెక్టు పనులకు ఉత్తమ్ సుమారు రు. 2వేల కోట్లు విడుదుల చేశారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకునే ఉత్తమ్ ను రేవంత్ అత్తగారి జిల్లాకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పింది. తన గురించి రేవంత్ మాట్లాడుతున్నంతసేపు వేదికమీద ఉత్తమ్ తో పాటు ఇతర మంత్రులు, నేతలు నవ్వుతునే కనిపించారు.

ఇక ఆర్ధికశాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క(Bhatti) గురించి మాట్లాడుతు భట్టి మొదటినుండి పాలమూరు జిల్లాతో గట్టి బంధముందన్నారు. భట్టి సోదరుడు మల్లు రవి చాలాకాలంగా నాగర్ కర్నూలు ఎంపీగా గెలుస్తునే ఉన్నారు. ఓడిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయిలేండి. అన్న ఎంపీగా ఉన్న జిల్లాకు కాకుండా ఇంక ఏ జిల్లాకు తమ్ముడు భట్టి నిధులు కేటాయిస్తాడో చెప్పమని జనాలను అడిగాడు. రవి, భట్టికి పాలమూరు జిల్లాతో అన్నదమ్ముల అనుబంధముందన్నారు. జిల్లాతో అన్నదమ్ముల అనుబంధం ఎప్పటికీ చెరిగిపోదని రేవంత్ చెప్పారు.

ఇక వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ గురించి రేవంత్ మాట్లాడుతు రాజనరసింహా చాలా ఎక్కువగా చదువుకున్నట్లు చెప్పారు. దామోద(Damodar)ర్ ఎంత చదువుకున్నా తాను పంపించిన ఫైలును మాత్రం చదవకుండానే సంతకాలు పెట్టేస్తాడని చెప్పినపుడు జనాలందరు నవ్వేశారు. బహిరంగసభ మొదలైన దగ్గర నుండి రేవంత్ మాట్లాడిన ప్రతి మాటను జనాలు బాగానే ఎంజాయ్ చేశారు. ఎందుకంటే తన సహచర మంత్రుల మీద రేవంత్ జోకులు వేస్తు, ప్రత్యర్ధులపై పంచులు విసురుతు నవ్వించారు కాబట్టే.

మంచి మాటకారే

మొదటినుండి కూడా రేవంత్ మంచి మాటకారే అని అందరికీ తెలుసు. ప్రత్యర్ధుల మీద పంచులు విసరటంలో కూడా సమయస్పూర్తిగా వ్యవహరిస్తారు. కామెంట్లు చేయాలన్నా, ఆరోపణలు, విమర్శలు చేయాలన్నా చివరకు పంచులు విసరాలన్నా కూడా రేవంత్ తర్వాతే ఇంకెవరైనా. ఇదే సమయంలో సహచరుల విషయంలో రేవంత్ ఎంత జోవియల్ గా ఉంటారో కూడా పాలమూరు బహిరంగసభలో నిరూపితమైంది.

అందరూ ప్రత్యర్ధులేనా ?

నిజానికి రేవంత్ ఎవరిగురించి అయితే ఆకాశానికి ఎత్తేస్తు చెప్పాడో వాళ్ళంతా బద్ధ విరోధులన్న విషయం అందరికీ తెలిసిందే. టీడీపీలో నుండి రేవంత్ కాంగ్రెస్ లోకి రావాలని అనుకున్నపుడు భట్టి, ఉత్తమ్, దామోదర తీవ్రంగా వ్యతిరేకించారు. అలాగే పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టును రేవంత్ కు ఇవ్వటాన్ని కూడా వ్యతిరేకించారు. తర్వాత పీసీసీ అధ్యక్షపదవి ఇచ్చినపుడు కూడా అదే వ్యతిరేకతను కనబరిచారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని అనుకున్నపుడు కూడా అందరు వ్యతిరేకించిన వాళ్ళే. విడివిడిగా ఉండి వ్యతిరేకించటం కష్టమని భావించిన పై ముగ్గురు రేవంత్ వ్యతిరేకులందరినీ కూడగట్టారు. ముఖ్యమంత్రి పదవిలో రేవంత్ కు ఎట్టిపరిస్ధితుల్లోను తాము అంగీకరించమని అధిష్టానానికి చెప్పారు. ఎందుకంటే రేవంత్ తో పాటు పై ముగ్గురు కూడా సీఎం కుర్చీకోసం ప్రయత్నిస్తున్నారు కాబట్టే.

చివరకు వ్యతిరేకులంతా ఏమిచేశారంటే సీఎంగా రేవంత్ ను ఎంపిక చేసేబదులు తమలో ఎవరిని ఎంపికచేసినా అందరం మద్దతుగా నిలుస్తామని కూడా ప్రతిపాదన పంపారు. అయితే ఏమిచేయాలో అర్ధంకాక పార్టీ తరపున గెలిచిన 64 మంది ఎంఎల్ఏల్లో సీఎం ఎంపికపై అభిప్రాయ సేకరణ చేసింది. అందులో అందరికన్నా అత్యధికంగా రేవంత్ కు 50 ఓట్లొచ్చినట్లు పార్టీవర్గాల సమాచారం. దాంతో ఏమిచేయలేక పై ముగ్గురితో పాటు బద్ధ విరోధైన రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి(Komatireddy Venkatareddy) కూడా మౌనంగా రేవంత్ ను ఆమోదించాల్సొచ్చింది. అయితే సీఎంగా బాధ్యతలు తీసుకున్న తర్వాత మాత్రం రేవంత్ సీనియర్లందరికీ బాగా ప్రాధాన్యతిస్తు కలుపుకుని వెళుతున్నారు. ఇందులో భాగంగానే వేదికమీదే ఉత్తమ్, భట్టి, దామోదరను ఆకాశానికి ఎత్తేసింది.

Read More
Next Story