కృష్ణమ్మ పరవళ్లు చూసి నా మనసు పులకరిస్తోంది
x

కృష్ణమ్మ పరవళ్లు చూసి నా మనసు పులకరిస్తోంది

రైతుల సంతోషం తమ సంకల్పానికి మరింత బలాన్ని ఇస్తోందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.


రాయలసీమ ప్రాంతంలోని నాలుగు ఉమ్మడి జిల్లాల్లో ఆరు లక్షల ఎకరాలకు సాగు నీరు అందించే హంద్రీ–నీవా ప్రాజెక్టులో కృష్ణమ్మ పరవళ్లు తొకుతోందని, అలా పవళ్లు తొక్కుతున్న కృష్ణమ్మను చూసి తన మనసు పులకరించి పోతోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ప్రతి ప్రాజెక్టు నిండేలా.. ప్రతి చెరువుకు కూడా నీరు అందే విధంగా.. చివరి భూములను కూడా తడిపే విధంగా హంద్రీ–నీవా కాల్వల్లో ప్రవహిస్తున్న నీటి ప్రవాహం రైతన్నల ఆశలను.. ఆకాంక్షలను తీరుస్తోందని ఆదివారం సోషల్‌ మీడియా ద్వారా సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

చంద్రబాబు ఏమన్నారంటే..
రాయలసీమలోని నాలుగు ఉమ్మడి జిల్లాల్లో 6 లక్షల ఎకరాలకు సాగు నీరు అందించే హంద్రీ–నీవా ప్రాజెక్టులో కృష్ణమ్మ పరవళ్లు చూసి నా మనసు పులకరిస్తోంది. ప్రతి ప్రాజెక్టు నిండేలా.. ప్రతి చెరువుకు నీరందేలా.. చివరి భూములను సైతం తిడిపేలా.. అత్యధిక సామర్థ్యంతో హంద్రీ–నీవా కాల్వల్లోని నీటి ప్రవాహాలు రైతన్నల ఆశలను, ఆకాంక్షలను తీరుస్తున్నాయి. రికార్డు సమయంలో కాల్వల విస్తరణ చేపట్టిన కారణంగానే ఈ సీజన్లో చివరి భూములకు నీరందించాలనే మా కల సాకారం అవుతోంది. రైతులు సంతోషం మా సంకల్పానికి మరింత బలాన్ని ఇస్తోంది.. అంటూ సీఎం చంద్రబాబు ఓ వీడియోను ట్యాగ్‌ చేసి ట్వీట్‌ చేశారు.


Read More
Next Story