అధికారులపై మేయర్ నిరసన.. కారణం అదే..!
x

అధికారులపై మేయర్ నిరసన.. కారణం అదే..!

గుంటూరు మేయర్ మనోహర్ తన అధికారులకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. నల్ల చొక్కాతో కార్యాలయానికి వచ్చి నిరసన తెలిపారు.


ఉన్నత అధికారులపై ఇందిస్థాయి అధికారులు నిరసన వ్యక్తం చేయడం మనం తరచుగా చూస్తుంటాం. కానీ గుంటూరు జిల్లాలో ఓ వింత ఘటన జరిగింది. అధికారులపై మేయర్ కావటి మనోహర్ నాయుడు నిరసన వ్యక్తం చేశారు. నల్లచొక్కా వేసుకుని కార్యాలయానికి వచ్చి ఆయన తన నిరసన తెలిపారు. ఇది ప్రస్తుతం గుంటూరంతా హాట్ టాపిక్‌గా మారింది. ఈ సందర్భంగానే ఈరోజును బ్లాక్ డేగా ప్రకటించారు మేయర్ మనోహర్. తాను ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయనందుకు అధికారులపై ఆగ్రహం చేశారాయన. ఈ సందర్భంగానే తన ఛాంబర్‌లోనే కుర్చుని ఆయన అధికారులపై నిరసన వ్యక్తం చేశారు.

నిరసనకు ఇదే కారణం

తాను ఇచ్చిన ఉత్తర్వులను అధికారులు పాటించకపోవడం వల్లే తాను నిరసనకు కూర్చున్నానని మేయర్ మనోహర్ చెప్పారు. ‘‘కౌన్సిల్ సమావేశం నిర్వహించాలని ఈ నెల 8న నిర్ణయించాం. కానీ ఇంతవరకు కౌన్సిల్ సమావేశం అధికారులు ఎవ్వరూ స్పందించలేదు. ఒక మేయర్‌కు కౌన్సిల్ భేటీకి తేదీని నిర్ణయించే హక్కు ఉంది. ఇప్పటి వరకు కౌన్సిల్ సమావేశంపై కార్పొరేటర్‌లకు, ఎమ్మెల్యేలకు సమాచారం అందించలేదు. అందుకే నిరసన వ్యక్తం చేస్తున్నా’’ అని మేయర్ నిరసనకు అసలు కారణం వివరించారు. పత్తిపాడు ఎమ్మెల్యే, ఎంపీలు ఈ నెల 6వ తేదీ లోగా నూతన ఎక్స్ అఫిషియో సభ్యులుగా పరిగణలోకి తీసుకొని 20వ తేదీన నిబంధనల ప్రకారం అధికారులకు తెలియజేశామని ఆయన చెప్పారు. అయినా అధికారులు ఎవరికీ సమాచారం ఇవ్వలేదని ఆగ్రహించారు. కొత్త ప్రభుత్వానికి సహకరిస్తామని, నగర అభివృద్ధికి సహకరిస్తామని చెప్పారు.

Read More
Next Story