స్పెషల్ ఎకనామిక్ జోన్‌గా ఉత్తరాంధ్ర.. సీఎంకు మెమొరాండం
x

స్పెషల్ ఎకనామిక్ జోన్‌గా ఉత్తరాంధ్ర.. సీఎంకు మెమొరాండం

విశాఖలో జరుగుతున్న పారిశ్రామిక ప్రమాదాలపై ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రొఫెసర్ కేఎస్ చలం కీలక విజ్ఞప్తి చేశారు. విశాఖలోని పరిశ్రమలు ఎన్విరాన్‌మెంట్ కెపాసిటీని చేరుకున్నాయని, ఇక్కడి ప్రజలకు స్వచ్ఛమైన గాలి దొరకడం కూడా కష్టమవుతుందని ఆయన తన లేఖలో వివరించారు.


విశాఖలో జరుగుతున్న పారిశ్రామిక ప్రమాదాలపై ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రొఫెసర్ కేఎస్ చలం కీలక విజ్ఞప్తి చేశారు. విశాఖలోని పరిశ్రమలు ఎన్విరాన్‌మెంట్ కెపాసిటీని చేరుకున్నాయని, ఇక్కడి ప్రజలకు స్వచ్ఛమైన గాలి దొరకడం కూడా కష్టమవుతుందని ఆయన తన లేఖలో వివరించారు. అందుకు పరిశ్రమలు భారీ మొత్తంలో భూమిని సేకరించడమేనని పేర్కొన్నారు. అంతేకాకుండా ఉత్తరాంధ్ర మొత్తాన్ని స్పెషల్ ఎకనామిక్‌ జోన్‌గా ప్రకటించి.. స్థానికులకు ఉద్యోగాల్లో రిజర్వేషన్ కూడా కల్పించాలని ఆయన కోరారు. అందుకు విశాఖ పారిశ్రామికీకరణ చెందుతున్నా ఉద్యోగాలు తాత్కాలికం కావడం, వలసలు ఏమాత్రం తగ్గకపోవడమే ప్రధాన కారణంగా ఆయన వివరించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 370డి ప్రకారం ఉద్యోగాలు కల్పించాలని, ప్రభుత్వం ఎన్విరాన్‌మెంట్‌పై దృష్టిపెట్టే ప్రైవేటు సంస్థలు, వ్యక్తుల ద్వారా కాకుండా, ప్రభుత్వం ఉద్యోగుల ద్వారా పర్యావరణాన్ని అంచనా వేయాలని కోరారు. వీటికి సంబంధించిన పూర్తి వివరాలను ఆయన చంద్రబాబుకు రాసిన లేఖలో పేర్కొన్నారు. దాంతో పాటుగా భవిష్యత్‌లో ఎదుర్కొనే పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని థర్డ్ పార్టీ పర్యవేక్షణను అనుమతించకుండా.. 1986 చట్టం, సీఆర్‌జెడ్ నిబంధనల వంటి కఠిన పర్యావరణ చట్టాలను అమలు చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.

ఇంకా ఆగని వలసలు

‘‘విశాఖ సహా ఉత్తరాంధ్ర జిల్లాలు అన్నీ కూడా ఇండస్ట్రియల్ పార్క్‌లు, విశాఖ ఉక్కు నుంచి వచ్చే ఆదాయంతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఎంతో ఊతమందిస్తున్నాయి. రాష్ట్ర ఆదాయంలో ఈ ప్రాంతం నుంచి అందుతున్న ఔషధాల తయారీ యూనిట్లు, ఆక్వా, సెజ్ ఎగుమతులే దాదాపు రూ.5లక్షల కోట్లు ఉంటుందని అంచనా. ఈ పారిశ్రామిక ప్రాంతాల్లో పనిచేస్తున్న వారంతా కూడా సాధారణ కార్మికులుగా, తాత్కాలిక కార్మికులుగా ఎదుగూబొదుగూ లేని జీవితాలు గడుపుతున్నారు. ఉత్తరాంధ్రలో ముఖ్యంగా విశాఖపట్నం పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చెందినా ఇక్కడి స్థానికులు మాత్రం ఇప్పటికి కడా అత్యధిక సంఖ్యలో వలసలకు వెళ్తూనే ఉన్నారు. దీనిని బట్టి చూస్తే పారిశ్రామికీకరణ ఉత్తరాంధ్ర వాసులకు పెద్దగా ఉపయోపడలేదన్న విషయం అర్థమవుతుంది. దీనిని మీ దృష్టికి తీసుకురావాలన్నదే నా ప్రయత్నం’’ అని తెలిపారు.

కష్టంగా స్వచ్ఛమైన గాలి..

‘‘విశాఖపట్నం పాత, కొత్త జిల్లా, కొస్తా ప్రాంతం సహా అన్నీ ప్రాంతాలు కూడా అక్వాకల్చర్ సహా వివిధ పారిశ్రామిక, తయారీ యూనిట్లతో పూర్తిగా ఆక్రమించబడ్డాయి. రాంబిల్లి, నక్కపల్లిలో డిఫెన్స్ ప్రాజెక్ట్‌ల ద్వారా సేకరించిన 600 హెక్టార్లతో కలుపుకు ఏపీఐఐసీ, ప్రైవేటు సంస్థలు మొత్తం 5 లక్షల హెక్టార్ల భూమిని సేకరించినట్లు అంచనా. జిల్లాలోని 11.61 లక్షల హెక్టార్ల భూమిలో 40 శాతం భూమి వరకు కొన్ని రకాల పారిశ్రామిక కార్యకలాపాలతో ఆక్రమించబడింది. దీంతో అక్కడి ప్రజలకు స్వచ్ఛమైన గాలి కూడా అందే పరిస్థితులు కనిపించడం లేదు. ఈ ప్రాంతమంతా కూడా పర్యావరణ భారం మోసే సామర్థ్యాన్ని అధిగమించింది. ఈ నేపథ్యంలో ఈ ప్రాంతంలో ముఖ్యంగా తీర, పారిశ్రామిక ప్రాంతంలో భవిష్యత్తులో తీసుకొచ్చే అన్ని డెవలప్‌మెంట్స్ కూడా ప్రజలకు కష్టాలు తెచ్చిపెట్టే అవకాశం ఉంది’’ అని తెలిపారు.

Read More
Next Story