
ఏపీలో మెట్రో కూతకు పచ్చజెండా
విశాఖ, విజయవాడలలో పట్టాలెక్కనున్న మెట్రో రైలు
ఆంధ్రప్రదేశ్ ప్రధాన నగరాలు విశాఖపట్నం , విజయవాడ వాసులకు ప్రభుత్వం తీపికబురు అందించింది. ఈ రెండు నగరాలలో మెట్రో ప్రాజెక్టులు రానున్నాయి. రెండు చోట్లా మెట్రో ప్రాజెక్టులకు ఏపీ క్యాబినెట్ పచ్చజెండా ఊపింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన మంత్రిమండలి సమావేశంలో ఈ దిశగా కీలక అడుగు పడింది.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమాన భాగస్వామ్యంతో ఈ మెట్రో ప్రాజెక్టు ను చేపట్టనున్నారు. విశాఖ, విజయవాడ లలో మెట్రో నిర్మాణాలకు టెండర్లు పిలిచేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది.
రేపే టెండర్లు
విశాఖపట్నం, విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టులకు శుక్రవారం టెండర్లు పిలవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.విశాఖ మెట్రో రైలుకు రూ.11,498 కోట్లతో, విజయవాడ మెట్రోకు రూ.10,118 కోట్లతో టెండర్లు పిలవనున్నారు. ప్రాజెక్టు వ్యయంలో 40శాతం పనులకు తొలుత టెండర్లు పిలవనుంది.రెండు ప్రాజెక్టులకు కలిపి మొత్తం రూ.21,616 కోట్లతో టెండర్లు ఆహ్వానించనున్నారు.కేంద్ర ప్రభుత్వం ,రాష్ట్రం 50:50 భాగస్వామ్యంతో ఈ ప్రాజెక్టును చేపడుతుండగా , విశాఖ మెట్రోకు రాష్ట్ర ప్రభుత్వ వాటా కింద వీఎంఆర్డీఏ నుంచి రూ.4,101 కోట్లు ,విజయవాడ మెట్రోకు సీఆర్డీఏ నుంచి రూ.3,497 కోట్లు అందించనున్నారు.
Next Story