BREAKING: టీచర్లూ చంద్రబాబు ‘బంగారు కుటుంబా’లను దత్తత తీసుకోవాల్సిందే!
x

BREAKING: టీచర్లూ చంద్రబాబు ‘బంగారు కుటుంబా’లను దత్తత తీసుకోవాల్సిందే!

చంద్రబాబుకు P4 చెలగాటం, టీచర్లకు ప్రాణసంకటం


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రభుత్వ ఉపాధ్యాయులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు P4లో భాగస్వాములను చేసింది. ప్రతిటీచర్లు తన పరిధిలో బంగారు కుటుంబాలను దత్తత తీసుకోవాలని ఆదేశించింది. అంతే కాదు, రెండు రోజులు గడవువిధించింది. దీనితో బంగారు కుటుంబాలను దత్తత తీసుకున్న వారి స్కోర్ అమాంతం పెరిగిపోనున్నది. ముఖ్యమంత్రి ముద్దుల కార్యక్రమం ‘జీరో పావర్టీ’(Zero Poverty) కార్యక్రమం అంటే దారిద్య్రరహిత ఆంధ్రప్రదేశ్ స్థాపన వేలాది మంది టీచర్లు కూడా భాగస్వాములు కాబోతున్నారు.

రాష్ట్రప్రభుత్వం జీరో పావర్టీ, పీ-4 విధానాన్ని ఉపాధ్యాయులకు తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. తమ స్కూళ్లలో పనిచేస్తున్న కింది స్థాయి సిబ్బందితోపాటు విద్యార్థుల కుటుంబాలను దత్తత తీసుకోవాలని ఆదేశించింది. ఈ మేరకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ లింక్ లను డీఈవోల ద్వారా ఎంఈవోలు, ఉపాధ్యాయులకు పంపించింది. ఇప్ప టికే బోధనను పక్కనబెట్టి ప్రభుత్వం నిర్దేశించిన ఆన్లైన్ సేవల్లో తరిస్తోన్న తమకు ఇప్పుడు ఇదేం తలనొప్పి అంటూ ఉపాధ్యాయులు మండిపడుతున్నారు.

శుక్రవారం పలు జిల్లాల డీఈవోలు.. లింక్ ను ఉపాధ్యాయులకు పంపించి రెండు రోజుల్లో ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రభుత్వం లోని అన్ని మేనేజ్మెంట్లలోని ఉపాధ్యాయులకు పీ-4 విధానం అమలు చేస్తున్నామని దీన్ని హెచ్ ఎంలు, టీచర్లు విధిగా పాటించాలని పేర్కొ న్నట్లు ‘ఫెడరల్ ఆంధ్రప్రదేశ్’ కు పలువురు ఉపాధ్యాయులు తెలిపారు.

ఆయా పాఠశాలల్లో పనిచేస్తున్న వంట ఏజెన్సీల్లోని సహాయకులు, ఆయాలు, నైట్ వాచ్ మన్లు, తోటమాలితోపాటు దారిద్య్రరేఖకు దిగువ నున్న కుటుంబాల వారిని దత్తత తీసుకోవాలని సూచించారు. ప్రధానోపాధ్యాయులు కనీసం 5 కుటుంబాలను, ఉపాధ్యాయులు 2 కుటుంబాలను తప్పనిసరిగా దత్తత తీసుకుని రిజిస్టర్ చేయాలని ఆదేశించారు.

టీచర్లకు ఆరు సంవత్సరాలుగా డీఎ లు లేవు డి ఎ ఏరియల్ లో లేవు పిఆర్సి ఏరియల్ లేవు సరెండర్ లీవ్ లేవు కనీసం ఎస్ ఎస్ సి స్పాట్ అమౌంట్ కూడా లేవు అటువంటి స్థితిలో ఉన్న టీచర్లకు ఒక్కో టీచరు 15 బంగారు కుటుంబాలను దత్తత తీసుకోమనడం ఎంతవరకు కరెక్ట్ అంటారువాళ్లే అప్పులు చేసుకుంటూ లోన్లు పెట్టుకుంటూ గడుపుతున్నారు.

నేడు,ఉపాధ్యాయుల్ని....రేపు,ఉద్యోగస్తుల్ని....జీరో పావర్టీ (Zero Poverty) పేరుతో "దత్తత"దిశగా ప్రభుత్వం చర్యలు కొనసాగిస్తోంది.

పల్లెల్ని పిల్లల్ని 'దత్తత'తీసుకోవడమంటే ప్రజలు అనాథలుగా ఉన్నారన్నామాటే కదా! ఐదేళ్లు దోపిడీలతో సహా జీతాలేకాదు,పెన్షన్ సౌకర్యాలు పొందుతూన్న ఈ ప్రజా సేవ కులకు ఏమాత్రం సంబంధంలేదా అని ఒక టీచర్ వ్యాఖ్యానించారు.

ప్రజల్నిఅనాథలుగాచేసేందుకేనా ప్రజలు ప్రభుత్వల్ని ఎన్నుకున్నది! 'దత్తత'తో జీరో పావర్టీ పొందడమంటే... రాజకీయనాయలు కుక్కలతోకలు పట్టుకుని ఇంతకాలం కృష్ణ,గోదావరి ఈదినట్టేకాదా అని మరొక ఉపాధ్యాయురాలు అన్నారు.

Read More
Next Story