ధైర్యసాహసాలకు మారు పేరు గూళపాళెం హంపన్న
x

ధైర్యసాహసాలకు మారు పేరు గూళపాళెం హంపన్న

స్త్రీల మాన ప్రాణాలు కోసం ప్రాణాలొడ్డిన గూళపాళ్యం హంపన్న


తెంపరి హంపన్న వీరోచిత మరణాన్ని కీర్తిస్తూ విద్వాన్ విశ్వం ఒకనాడు అనే పద్యకావ్యం రాసాడు. అందులో పద్యం ఒకటి:

ఈ వీరగల్లు గుడిలో
కావలి హంపన్న ఆత్మ కాపురముండున్
తావెక్కడ చాలును
భరతావనియే వాని ఆలయమ్మగును గదా
గూళపాళ్యం హంపన్న 132 వ వర్ధంతి సందర్భంగా రైల్వే అధికారులు, పౌర సమాజం ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా ‘ప్రజాసైన్స్ వేదిక’ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఎం. సురేష్ బాబు మాట్లాడుతూ - నాడు బ్రిటిష్ సిపాయిల కామ దాహానికి బలైపోతున్న మహిళల శీలాన్ని కాపాడేందుకు ఎదురునిలిచి బ్రిటిష్ సిపాయిల తుపాకి గుళ్లకు ప్రాణాలు వదిలిన అమరుడు గూళపాళెం హంపన్న గురించి స్మరించుకొని, ఆ భావజాలాన్ని, పోరాట పటిమను నేటి సమాజానికి అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.

1893లో అక్టోబర్ 4న అమరుడయ్యారు. వీర హంపన్న ప్రాణత్యాగానికి ప్రతీకగా బ్రిటీష్ ప్రభుత్వం గుత్తి పట్టణం సర్ థామస్ మన్రో సత్రం ఎదురుగా హంపన్న సమాధితో పాటు ఒక స్మారక స్తూపాన్ని నిర్మించింది. ఆ రోజుల్లో మిలిటరీ దండు విడిది చేసిందంటే మహిళలు ఇల్లు ఒదిలి బయటకు వెళ్ళేందుకు సాహసించేవారు కాదు. ప్రాణ భీతితో భయకంపితులయ్యేవారు. గుంతకల్లులో విడిది చేసిన సైన్యంలోని ఇద్దరు సిపాయిలు సాయంత్రం గ్రామ శివారులో షికారుకు వెళుతూ జొన్న చేనులో గడ్డి కోసుకుంటున్న ఇద్దరు మహిళలను చూశారు. ఆ ఇద్దరిమీద లైంగికంగా దాడిచేసేందుకు ప్రయత్నించారు. సిపాయిలు తమ వైపు రావడం గమనించిన మహిళలు భయంతో. అక్కడి నుంచి పరుగు తీశారు.
అయితే సిపాయిలు మాత్రం వారిని వదలక వెంబడించారు. అదే సమయంలో అక్కడి రైల్వే గేట్ కీపర్ గా ఉన్న గూళపాళెం హంపన్న ఆర్థనాదాలతో పరిగెడుతున్న మహిళలను చూశాడు. హంపన్న వెంటనే వారివద్దకు వెళ్లి తన గదిలోకి వెళ్లమని చెప్పాడు. అనంతరం హంపన్న సిపాయిలకు అడ్డుగా నిలిచాడు. అడ్డు తొలగమని సిపాయిలు హంపన్నకు అర్థం కాని భాషలో ఆదేశించారు. ఆయన బెదరలేదు.దీంతో ఆంగ్లేయ సిపాయిలు ఆగ్రహించి హంపన్నను తుపాకితో కాల్చి నేలకూల్చారు.

తుపాకి పేలుడు శబ్దం విన్న రైల్వే పోలీసులు అక్కడికి పరగులు తీశారు. దీంతో సిపాయిలు పారిపోయారు. తుపాకీ గుళ్లకు నేలకొరిగిన హంపన్నను ప్రాణాలతో బ్రతికించాలని వెంటనే గుత్తి ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువచ్చినా ఫలితం లేకపోయింది. అప్పటికే ఆయన ప్రాణాలు అనంత వాయువులో కలిసిపోయాయి. హంపన్న ధైర్య సాహసానికి, మానవత్వానికి మహిళల మాన ప్రాణాలు కాపాడేందుకు ప్రాణాలు పోగొట్టుకున్న అమరవీరుడికి గుర్తుగా గుత్తిలోనే ఒక స్థూపం నిర్మించారు.
ఆ స్థూపం దిగువ భాగాన ‘‘ యూరోపియన్ సిపాయిల బారి నుంచి ఇద్దరు మహిళలను రక్షించబోయి సిపాయిల తుపాకీ గుళ్లకు బలైన హంపన్న పార్థీవ దేహం ఇక్కడ పాతి ఉందని హంపన్న పార్కు అభివృద్ధి కమిటీ అధ్యక్షులు లయన్ విరూపాక్ష రెడ్డి తెలిపారు.

‘ది హిందూ’ పత్రికలో 1893-96లో ఈ కేసుకు సంబంధించి వచ్చిన వివిధ కథనాల ప్రకారం 1893 అక్టోబరు 4 న గుంతకల్లు రైల్వేస్టేషన్ మీదుగా సికిందరాబాద్ వెళ్తున్న ఆంగ్ల సైనికుల పటాలంలోని కొందరి దుష్ప్రవర్తనను, దురన్యాయాన్ని ప్రతిఘటించినందుకు రైల్వేగేటు కీపర్ అయిన గొల్ల హంపన్నను కాల్చి చంపారు.
వెల్లింగ్టన్ నుంచి సికింద్రాబాద్ వెళ్ళే దారిలో గుంతకల్లు వద్ద పటాలం రైలు మారవలసి రావడంతో వారు ఒక మిలటరీ బంగళాలో దిగారు. సాయంకాల సమయంలో కొందరు మద్యపానం చేసి ఆ దారిలో వెళ్తున్న ఇద్దరు స్త్రీలపై అత్యాచార యత్నం చేశారు. దానితో వారిద్దరూ పారిపోయి రైల్వేగేట్ కీపర్ గొల్ల హంపన్న శరణుకోరి, ఆయనకు కేటాయించిన చిన్న గదిలో దాక్కున్నారు.
గది తలుపులు విరగ్గొట్టబోయి సాధ్యం కాకపోవడంతో తమను వారిస్తున్న గొల్ల హంపన్నను తుపాకీతో కాల్చి బంగళాకు పారిపోయారు. రైల్వే పోలీసులు కూడా అక్కడికి వచ్చారు. ఆ రాత్రి జరిగిన గుర్తింపు కార్యకలాపంలో హంపన్న తానున్న నీరసస్థితిలో కాల్చిన వారిని గుర్తించలేకపోయారు. తర్వాతిరోజు పొత్తి కడుపు కింద, గజ్జల దగ్గర ఇరుక్కున్న తుపాకీ గుండు ప్రభావం వల్ల హంపన్న మరణించారు.
గుత్తిలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి టౌన్ హాల్ ఆవశ్యకతను గౌరవ శాసనసభ్యుల ముందు ఉంచి టౌన్ హాల్ నిర్మాణానికి అలాగే గుత్తి పట్టణాన్ని సుందరీకరించడం, పురాతన కట్టడాలను పరిరక్షించే బాధ్యత ప్రభుత్వం చొరవ చూపాలని డా యం విరూపాక్ష రెడ్డి కోరారు.
జన విజ్ఞాన వేదిక రాష్ట్ర నాయకులు బి ఇస్మాయిల్ మాట్లాడుతూ ఇతను మరణించి యూరోపియన్, హిందూ దేశస్తుల మెప్పు పొందాడు’’ అని ఆంగ్ల భాషలో రాసి ఉంది. బ్రిటీష్ పాలకులు గుత్తి దుర్గాన్ని సందర్శించినప్పుడల్లా హంపన్న స్మారక స్థూపానికి, ఘనంగా రాజ లాంఛనాలతో నివాళులు అర్పించేవారని తెలిపారు. కార్యక్రమంలో సయ్యద్ ఇషాక్ బాషా, బి. ఇస్మాయిల్, నిజాముద్దిన్‌, లయన్ శ్రీనివాసులు, రామదాసు, అశ్వనాగప్ప, కమిషినర్ శ్రీ జబ్బార్ మియా తదితరులు హంపన్న సమాధికి నివాళులు అర్పించి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.


Read More
Next Story