
ఒక్క నెల గడువియ్యండి, అందరం లొంగిపోతామన్నమావోయిస్టులు!
లొంగిపోతామంటూ కీలక ప్రకటన చేసిన మావోయిస్టులు నవంబర్ 30న దండకారణ్య బంద్ కు పిలుపిచ్చారు.
లొంగిపోతామంటూ కీలక ప్రకటన చేసిన మావోయిస్టులు నవంబర్ 30న దండకారణ్య బంద్ కు పిలుపిచ్చారు. పరస్పర విరుద్ధమైన ప్రకటనల నడుమ జనవరి 1న లొంగిపోయేందుకు అవకాశం కల్పించాల్సిందిగా మావోయిస్టుల పేరిట ఓ ప్రకటన వైరల్ అవుతోంది. ఎంఎంసీ(మహారాష్ట్ర-మధ్యప్రదేశ్-ఛత్తీస్‌గఢ్) జోన్ ప్రతినిధి అనంత్ పేరుతో ఈ లేఖ ఉంది.
జనవరి 1న ఆయుధాలను వదలి లొంగిపోతామని అందులో పేర్కొన్నారు. ఒక్కొక్కరికి బదులుగా అందరం ఒకేసారి లొంగిపోతామని ఆ ప్రకటలో తెలిపారు. మావోయిస్టు అగ్రనేతలు మల్లోజుల, ఆశన్న లొంగుబాటు, హిడ్మా ఎన్‌కౌంటర్‌తో పార్టీ బలహీనమైందని పేర్కొన్నారు. మిగతావారు లొంగిపోవాలన్న కేంద్రం విజ్ఞప్తితో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు.
2026 జనవరి 1న సాయుధ పోరాటాన్ని విరమించుకుంటామన్నారు. ఆయుధాలు అప్పగించి ప్రభుత్వ పునరావాసాన్ని అంగీకరిస్తామని చెప్పారు. తమకు సహకరించే రాష్ట్రంలో లొంగిపోవడానికి సిద్ధమని పేర్కొన్నారు. అందరూ లొంగిపోయే వరకు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల ప్రభుత్వాలు సంయమనం పాటించాలని కోరారు.
జనజీవన స్రవంతిలో కలిసేందుకు తమకు కొంత సమయం కావాలని గతవారం మావోయిస్టులు లేఖ రాసిన సంగతి తెలిసిందే.
పోలీసుల అదుపులో మావోయిస్టు కేంద్ర కమిటీ పొలిట్‌బ్యూరో సభ్యుడు దేవ్ జీ ఉన్నారని మావోయిస్టు దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీ ఆరోపించింది. దేవ్ జీని కోర్టులో హాజరుపర్చాలని దండకారణ్య కమిటీ డిమాండ్ చేసింది.
నవంబర్ 18న జరిగిన మావో కీలక నేత హిడ్మా ఎన్‌కౌంటర్ బూటకమని ఆరోపించింది. అదే సమయంలో దేవ్ జీతో పాటు 50 మంది మావోయిస్టులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని డీకేఎస్‌జెడ్‌సీ తెలిపింది. ఎన్‌కౌంటర్లకు నిరసనగా ఈ నెల 30న మమావోయిస్టు దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీ పిలుపునిచ్చింది.
Next Story

