మరిదితో ఎలా కాపురం చేశావ్ కామేశ్వరీ? గరికపాటి టీమ్ ఎదురుదాడి
x

మరిదితో ఎలా కాపురం చేశావ్ కామేశ్వరీ? గరికపాటి టీమ్ ఎదురుదాడి

ప్రవచన కర్త గరికపాటి నరసింహారావు తొలి భార్య కామేశ్వరి చేసిన ఆరోపణలు మొదట్లో ఆయన్ను ఇబ్బంది పెడితే ఇప్పుడాయన అభిమానులు.. కామేశ్వరిపై మాటల దాడిని ఉధృతం చేశారు.


ప్రముఖ ప్రవచన కర్త, సాహితీవేత్త గరికపాటి నరసింహారావుపై చెలరేగిన దుమారం ఇంకా చల్లారలేదు. ఆయన తొలి భార్య కామేశ్వరి చేసిన ఆరోపణలు, వ్యాఖ్యలు నరసింహారావును ఇబ్బంది పెడితే ఇప్పుడాయన అభిమానులు కామేశ్వరిపై మాటల దాడిని ఉధృతం చేశారు. ఆమెను అనరాని మాటలతో నానా దుర్భాషలాడుతున్నారు. పది రోజుల కిందట మొదలైన ఈ మంటలు ఇప్పుడిప్పుడే ఆగే సూచనలు కూడా కన్పించడం లేదు.
కామేశ్వరిపై దాడి ఎందుకంటే..
గరికపాటి నరసింహారావు అనే వ్యక్తి దరిద్రుడు, దౌర్భాగ్యుడు, అహంకారి, నీచుడు, నికృష్టుడు వంటి పదాలతో కామేశ్వరి తిట్టిపోశారు ఓ వీడియోలో. ఆ తర్వాత ఈ వ్యవహారం లీగల్ నోటీసులు, ఇతరత్రా హెచ్చరికల దాకా వెళ్లింది. ఇప్పుడు ఆయన అనుచరుల పేరిట ఓ బృందం కామేశ్వరిని చాకిరేవు పెడుతూ పోస్టులు పెడుతున్నారు.

"ఆమె (kameswari) తెలుగు.. సంస్కృతం ఏం.ఏ లు చేసి ఆయన (Garikapati) పట్ల తన నిరసన తెలియచేయటానికి అంత తీవ్రమైన పదాలు వాడాలా.." అంటూ నిలదీస్తున్నారు. గరికపాటి దరిద్రుడు.. దౌర్భాగ్యుడు..అంటూ వాడిన పదాలు ఆమె సంస్కారాన్ని తెలియజేస్తున్నాయని మండిపడుతున్నారు.
"ఆయనకు (గరికపాటి)స్కూటర్ రాదట...ఆమె సరదాలకి ఆయన దగ్గర డబ్బు, సమయం లేవట అప్పట్లో.. నిజమే లేవు, ఆయన అప్పుడు లేమితనంతో తన ఆశయ సాధనకై తపన, ఇబ్బందులు పడుతూ, బాధ్యతల బరువుతో మరెన్నో రకాల వత్తిడులలో వున్నారు. ఆమెనీ సంతృప్తి పరచలేక పోయారు. అందుకని ఆమె అతన్ని వద్దు అనుకుని వెళ్ళి పోయారు. సరే, ఇన్నాళ్లకు ఇప్పుడు ఇలా రోడ్డెక్కిన ఆ వీడియోలలో 60 ఏళ్లు పైబడిన ఆమె సంస్కృతం లెక్చరర్ యుక్తా, యుక్త విచక్షణ లేకుండా తీవ్ర పద జాలం ఉపయోగిస్తూ మాట్లాడుతున్నారు అంటే 60 ఏళ్ల వయసులోనూ ఆమెకు పరిణితి కలుగలేదా? సంయమనం కలిగి మాట్లాడాల్సిన మనిషి పదేపదే ఆ దరిద్రుడు, ఆ దౌర్భాగ్యుడు అంటూ, నీచుడు అని ఆమె ఈ వయసులోనూ ఇలా మాట్లాడుతున్నారంటే ఆ రోజుల్లో ఇంట్లో ఆమె వాక్ప్రవహం, ప్రవర్తనా సరళి ఎలా వుండి వుండేదో ఊహించుకోవచ్చు" అని గరికపాటి అనుచరునిగా చెబుతున్న ఓ రాఘవ దుమ్మెత్తిపోశారు. ఆవిడ (కామేశ్వరి) ఇప్పటికైనా ఆత్మ విమర్శ చేసుకోవాలని సలహా ఇచ్చారు.
గరికపాటి నరసింహారావు ఇంకో అనుచరుడైతే "సరేనమ్మా... మీరన్నట్టు ఆయన నీచుడే అనుకుందాం.. మరి సంస్కృతాంధ్రాలు చదువుకున్న మీ వివేకం ఏమయ్యిందిట అప్పుడు..వదిన స్థానంలో ఉన్నారు కదా మీరాపని చేయవచ్చునా? ఆయన్ను లేపుకు రావొచ్చునా?" అని అచ్చు గ్రాంథికంలో ప్రశ్నించారు. ఆయన అంతటితో ఆగకుండా రామాయణంలోని ఓ కథను కూడా ప్రస్తావించారు.
రామాయణంలో సీత ఆ పని చేయలేదే?
"లక్ష్మణా, నే వెడుతున్నా ఆ స్వర్ణలేడిని తీసుకురావడానికి.. నే వచ్చేవరకు నీ వదినను కంటికి రెప్పలా చూసుకో" అని తన తమ్ముడికి చెప్పి మరీ వెళ్ళిన రాముడికి సీత ద్రోహం చేసిందా మీలా అని కామేశ్వరిపై ఎదురుదాడికి దిగారు.
"రాముడి గొంతుతో రాక్షసుడు అరిచిన సందర్భంలో తన అన్న మాటకు కట్టుబడి సీతను విడిచి వెళ్ళడానికి సంశయిస్తున్న లక్ష్మణుడిని అనుమానించి అతనిపై నిందారోపణలు చేసినపుడు కదా అతనామెను విడిచి రాముని వెదుకులాటకు వెళ్ళింది. ఆమె (సీత) చేసిన ఆరోపణలు ఏమిటి... మీరన్నట్టే (కామేశ్వరి) ఓరి నీచుడా నీ అన్న ప్రమాదంలో ఉంటే రక్షించాల్సింది పోయి నన్ను దక్కించుకోవడానికి నీవాడుతున్న నాటకం కాదు గదా ఇదని"... నిలదాశారు. అటువంటి పరిస్థితుల్లో "మీ జ్ఞానమేనయ్యింది? వదిన స్థానంలో ఉన్న మీరు అప్పుడు చేయాల్సింది చేయక మీకు ఇప్పుడు ఓ నీచునిగా తోస్తున్న ఆయనతో మీరంటున్న 20 సంవత్సరాల పాటు సంసారం సాగించి, ఆయనతో ఇద్దరు పిల్లలని సైతం కని.. ఇప్పుడు మాట్లాడుతున్నారా మీరు" అని విరుచుకుపడ్డారు. కామేశ్వరిదే మొత్తం తప్పయినట్టుగా వాదిస్తున్నారు.
ఆనాడే చెంపలు వాయించి ఉండాల్సింది కదా!
గరికపాటి తప్పు చేస్తుంటే ఆనాడే తన మరిది రెండు చెంపలు వాయించి, బుద్దుందా నీ వదినతో ఇలా వ్యవహరించడానికి అని అనాలనిపించలేదా మీకు (కామేశ్వరి) అని విమర్శించారు. కామేశ్వరి తీరు గురివింద గింజ సామెతను గుర్తుకు తెచ్చేలా ఉందని ఇంకో అనుచరుడు ఆరోపించారు. ఆమె తన అసలు భర్తకు చేసింది ద్రోహం కాదా? అని ప్రశ్నిస్తూ ఆ విషయమై కామేశ్వరి వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. "సంస్కృతాంధ్రాలు చదువుకున్న దోష ఫలంలా అనిపిస్తోంది కామేశ్వరి తీరు... తారాశశాంకము, ఉదంకోపాఖ్యానాల ప్రభావం ఆమెపై (కామేశ్వరి) పడుండాలి.. శశాంకుడు తన గురు పత్నితో సంగమించడానికి అభ్యంతరం చెప్పినా వినక, నీ గురువు మాత్రం తక్కువవాడా తన వదినతోనే రమించడానికి సిద్దపడ్డాడు కదా అని తన భర్త అయిన బృహస్పతిని ఉదహరించి మరీ శశాంకుడ్ని వశపరుచుకున్న తార గుర్తుకొస్తోంది ఆమె పురాణం వింటోంటే.. వయసులో రెండేళ్ళు పెద్ద అంటోన్న కామేశ్వరియే తన మరిది గరికపాటికి మాయమాటలు చెప్పి లోబరుచుకోలేదనడానికి సాక్ష్యాలు ఎక్కడి నుంచి తేవాలి" అన్నారు.
శారీరక వాంఛలు వ్యక్తులకు అతీతాలు కావు...
గరికపాటి నరసింహారావు అనుచర బృందం యావత్తు కామేశ్వరికి ఆధ్యాత్మిక ప్రవచన రూపంలోనే సమాధానాలు చెబుతున్నారు. వాళ్లు ఏమంటారంటే.."శారీరక వాంఛలనేవి మనిషి పుటక పుట్టిన వ్యక్తులకు అతీతాలు కావు. వాటికి ఎవరైనప్పటికీ దాసులే. వాటి నుంచి కాపాడేవి విచక్షణ, వివేకం, కట్టుబాట్లు, సంఘ నియమాలు మాత్రమే. బ్రహ్మకైనను పుట్టు రిమ్మ తెగులు అన్న నానుడి పుట్టింది అక్కడి నుంచి... పొరబాటున జరగకూడనివి, ధర్మ విరుద్దమైనవి జరిగితే, ఏమీ ఫరవాలేదులే గతంలో కూడా ఇవి జరిగినవే, సాక్షాత్తు ఆ దేవతలే అతీతులు కారు వీటికి, అని తప్పు చేసి మానసికంగా కృంగిపోతోన్నవారికి నచ్చచెప్పడానికి, వారికో ఉపశమనం కలిగించడానికే రకరకాల ఉపాఖ్యానాలను జోడించి మరీ రచించాడు వ్యాసుడు.
నీ గురువు వెళ్ళేడపుడు నీ గురుపత్ని ఋతుధర్మానికి భంగం కలుగకుండా చూసుకోవలిసిందని తన శిష్యునికి చెప్పి మరీ బయటకు వెళ్ళిన గురువుకు ఆ శిష్యుడా ద్రోహం చేయబూనింది? లేక ఆ గురుపత్నేనా?
ఇలా తారాశశాంకాన్ని, ఉదంకోపాఖ్యానం వగైరాలను ఎవరికి అనుకూలంగా వారు తీసుకుని, ఫరవాలేదు శాస్త్రాలలో ఉన్నదేగా అని తప్పులు చేయడం, తీరా దొరికిపోయే సరికి ప్రక్కవారిపైకి నెపాలు తోసివెయ్యడం... మీరు చేస్తోన్నది కూడా అచ్చంగా అదేనా కామేశ్వరి గారు.." అంటూ ధ్వజమెత్తారు.
"డబ్బు, సంపదలకు లొంగనివారుంటారు, పొగడ్తలకు లొంగనివారుంటారు.. కానీ శరీరానికి, శారీరక వాంఛలకు లొంగనివారు ముల్లోకాలలో ఒక్కరంటే ఒక్కరు కూడా ఉండరు.. అది పురుషుడు కావచ్చు, స్త్రీ కావచ్చు... కాకపోతే పురుషునికి ఏ ఋతుధర్మాలు అడ్డంకులు కావు కాబట్టీను, రిజల్ట్ ఓరియెంటెడు కావు కాబట్టీను, అంటే సైడెఫెక్ట్లు లేనివి కాబట్టీను, దులుపుకు వచ్చేసే వీలు ఉండబట్టీను.. వాడు ట్వంటీఫోర్ బై సెవన్ అందుకు సిద్దంగానే ఉంటాడు... స్త్రీ విషయంలో అలా కాదు.. ఆమెకు అనేక ప్రతిబంధకాలున్నాయి.. శారీరక వాంఛలు సైతం ఋతుధర్మానికి లోబడే కలుగుతాయి ఆమెకు.. అలా కలిగినా వాటిని తీర్చుకునే సావకాశం ఉండదు అందరు స్త్రీలకు.. అనేక నియమాలు, కట్టుబాట్లు, ఆచారాలు అడ్డు వస్తాయి.. అందుకే సగటు స్త్రీ వివాహానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది... పతియే ప్రత్యక్ష దైవమనుకుంటుంది.. ఇంటినే వైఖుంటంలా భావిస్తుంది" అని మరో సంస్కృత పడితుడు పేర్కొన్నారు.
ఆయనే ఇంకా ఏమంటారంటే.."అందుబాటులో ఉన్న అవకాశాలు, వెసులుబాట్లను బట్టే జరుగుతాయి ఏ కార్యాలైనా... మీరు అంతో ఇంతో ధీమంతులు కాబట్టి ఆ కాలంలోనే, అంటే 70 వ దశకంలోనే ఓ రెండడుగులు ముందుకు వేశారు... అప్పుడు మీకు ఆయుధంగా అనిపించి ఉంటుంది అప్పటి మీ వయసు... అందుకే కన్ను, మిన్ను కానక స్వంత భర్తను గాలికొదిలి, మీకన్నా రెండేళ్ళు చిన్నవాడైన స్వంత మరిదితో లేచి వచ్చారు... అక్కడితో ఊరుకున్నారా.. ఇద్దరు పిల్లలను సైతం కన్నారు..
అప్పటి సంఘ నియమాలు, కట్టుబాట్ల ప్రకారం మీ సంతానం జస్ట్ ఇల్లెజిటిమేట్ సంతానం... అంటే.. అక్రమ సంతానం...అయినప్పటికీ గరికపాటివారు (మీరు నీచుడు అంటోన్న ఆ పెద్దమనిషి) మీరు కన్న ఆ సంతానాన్ని కంటికి రెప్పలా చూసుకుని, వారిని పెంచి పెద్ద చేసి, వారికి వివాహాది కార్యాలు కూడా జరిపించి, వారిని వృద్దిలోకి తెచ్చారు... అటువంటి వారిపై అవాకులు, చవాకులు పేలుతూ వారికింత బురద రాయాలనుకుంటోన్న మీరు చేస్తోన్నది తప్పు.. పాపం కూడా .." అంటూ కామేశ్వరి దే మొత్తం తప్పయినట్టు వ్యాఖ్యానించారు.
"ఒక్క గరికపాటి వారనే ఏమిటి ఎవరైనప్పటికీ వారి వారి భార్యలు, ఒకప్పుడు భార్యలుగా చలామణీ అయినవారు మీలా బయటకు వచ్చి ఇలా వ్యక్తిగత వ్యవహారాలను బయట పెడుతూ పోతే ఒక్క మగవాడు కూడా సంసారం చేయడు, చేయలేడు... తన భార్యతో సుమారుగా అన్ని విషయాలను (తనకు పరాయి స్త్రీలతో ఉన్న అక్రమ సంబంధాల గురించి తప్ప) పంచుకుంటాడు సుమారుగా ప్రతీ మగవాడూ... అలా తన వ్యక్తిగత హక్కులన్నిటినీ తన భార్య పాదాక్రాంతం చేస్తాడు బలహీన క్షణాలలో... అలా అని ఎందరు భార్యలు మీలా బ్లాక్ మెయిలు, హౌరా మెయిలులు చేస్తున్నారు చెప్పండి కామేశ్వరి గారూ" అన్నారు గరికపాటి శిష్యబృందంలోని మరో వ్యక్తి. (పేరు రాయడానికి ఏమాత్రం ఇష్టపడలేదు)
పురుషాధిక్య సమాజంలో ఓ స్త్రీని ఇంతలా మాట్లాడడం తగునా? అని ఆయన్ను ప్రశ్నిస్తే పురుషుడు, స్త్రీ ఎలా సమానం అవుతారన్నట్టుగా మాట్లాడారు. సంఘం వివాహ బంధాన్ని ఏర్పరిచింది. ఆ బంధానికి కొన్ని నియమాలను, కట్టుబాట్లను ఏర్పరిచింది. ఆమె వాటన్నిటికీ తూట్లు పొడిచారు. ఒకసారి కాదు. బోలెడుసార్లు.. మొదటిసారిగా అసలు భర్తకు ద్రోహం చేసింది. రెండోసారి స్వయంగా మరిదితో శారీరక సంబంధం పెట్టుకుంది. మూడోసారి సదరు సంబంధం అక్రమమైనదని తెలిసి కూడా సంతానం కన్నారు. నాలుగోసారి ఆ ఇద్దరు పిల్లలని వదిలేసింది. అయిదో తప్పు.. బకెట్ల కొద్దీ బురదను తెచ్చి, దాన్ని ఆమె కొంత పూసుకుని, గరికపాటికి కొంత పూసి, వారిని అనుసరించే లక్షలాది మందిని గందరగోళంలోకి నెట్టి ఓ ఉన్మాది మాదిరి వ్యవహరిస్తున్నారు కామేశ్వరి" అన్నారు ఆ శిష్యుడు. పనిలో పనిగా ఆయన సోషల్ మీడియాపైన దుమ్మెత్తి పోశారు. సోషల్ మీడియాకు కావలిసింది కొత్త కొత్త విషయాలు, వాటిని వివాదాస్పదం చేయడాలు అని విమర్శించారు.
స్మోకింగు, డ్రింకింగులు హానికరాలు, మీ ప్రాణాలకు ముప్పులు అని నిత్యం హెచ్చరిస్తున్నా వాటిని వీడడం లేదు. వాటికి అలవాటు పడ్డవారు. అలాగే నేడు ప్రవచనాలదీ అదే తీరు. అవి దుర్వ్యసనాలా.. మరోటా అన్నది ప్రక్కన పెడదాం కాసేపు... అయితే అవి లేకుండా రోజులు గడవని స్థితికి చేర్చాయి.
నేటి సమాజానికి ప్రతినిదులైన వారు ఎదుర్కుంటోన్న అనేకానేక సమస్యలకు నేడు ఔషధాలుగా పని చేస్తున్నాయి రకరకాల ప్రవచనాలు. ప్రవచన ప్రపంచంలోకి కొత్తగా చేరేవారే తప్ప దాని నుండి వెలుపలకు వెళ్ళేవారు లేని ఈ సమయంలో మకుటం లేని మహారాజులా వెలుగొందుతున్న గరికపాటిపై కామేశ్వరి గారు లేనిపోని విమర్శలు చేసి లబ్ధి పొందాలనుకోవడం సరికాదన్నది గరికపాటి అనుచరుడైన కాశీ విశ్వేశ్వరరావు అభిప్రాయం. కామేశ్వరి ఇప్పటికైనా తాను చేసిన తప్పేమిటో తెలుసుకోవాలని ఆయన సలహా ఇచ్చారు.
అయితే ఇదే స్థాయిలో గరికపాటి నరసింహారావును తప్పు బట్టేవాళ్లూ లేకపోలేదు. ఆయన చెప్పిన నీతుల్ని, విలువల్ని గరికపాటి పాటించరా అని ప్రశ్నిస్తున్న వారూ ఉన్నారు.
Read More
Next Story