విశాఖలో గంజాయి కలకలం
x

విశాఖలో గంజాయి కలకలం

ఆంధ్రప్రదేశ్‌ గంజాయికి అడ్డాగా మారి పోయింది. కట్టడి చేయాల్సిన కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వం మీద విమర్శలు చేస్తూ పబ్బం గడుపుకుంటోంది.


విశాఖలో గంజాయి కలకం రేపింది. సరఫరా కాదు ఏకంగా గంజాయి సాగు వెలుగులోకి రావడంతో సంచలనంగా మారింది. అదీ కూడా విశాఖ నడిబొడ్డున సాగు చేస్తుండటం ఆంధ్రప్రదేశ్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది. విశాఖపట్నం కేజీహెచ్‌ కొండపై బాలికల హాస్టల్‌ వెనుక ఉన్న కొండపై కొందరు గాంజాయి స్మగ్లర్లు ఈ గంజాయి సాగు చేస్తున్నట్లు గుర్తించారు. ఒకటి కాదు.. రెండేళ్లు కాదు.. గత కొన్నేళ్లుగా కొండను అడ్డం పెట్టుకొని గంజాయి స్మగ్లరు ఈ చీకటి దందాకు పాల్పడుతున్నారు. గంజాయిని పండిస్తూ సరఫరాకు పాల్పడుతున్నారు. పోలీసులకు కూడా అనుమానాలు రాకుండా ఈ దందా చేస్తుండటం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

నేవీ పరిధిలోని ప్రాంతంలో ఈ సాగు చేస్తుండటం ఇప్పుడు విశాఖలో ఆందోళనకరంగా మారింది. ఈ గంజాయిని పండిస్తున్న కొందరు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అమ్మడం కోసం పండించారా? సరదా కోసం పండించారా అనేది విచారణలో తేలుతుందని పోలీసులు చెబుతున్నారు. ఇటీవల కాలంలో విశాఖ జిల్లాలో పలు ప్రాంతాల్లో గంజాయి సాగు చేస్తున్న దుండగులను పోలీసులు పట్టుకుంటున్నారు. విశాఖ నుంచి గంజాయిన తరలిస్తూ విజయవాడ, నెల్లూరు. తిరుపతి పట్టణాల్లో చాలా మంది పట్టుబడ్డారు. వారి నుంచి లక్షల విలువైన గంజాయి ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్న సందర్భాలు అనేకం ఉన్నాయి. విచ్చల విడిగా గంజాయి సాగు అమ్మకాలు జరుగుతున్నాయని ఉప ముఖ్యమంత్రి కూడా ట్వీట్‌లో పేర్కొన్నారు. వైఎస్‌ఆర్‌సీపీ అవినీతి దీనిని వారసత్వంగా కూటమి ప్రభుత్వానికి ఇచ్చిపోయిందని కూటమి ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోను గంజాయి అమ్మేవారిని, కొనే వారిని ఉపేక్షించదన్నారు.

Read More
Next Story